-
ఇదే కరెక్ట్ అనిపించింది!
‘‘నేను పీజీ వరకు వైజాగ్‌లో చదువుకున్నాను. చిన్నప్పటి నుండి సాహిత్యాభిమానిని. పీజీ కాగానే రెండేళ్లు వ్యాపారం చేసాను. అందులో కిక్ దొరకలేదు. ఒక స్నేహితుని ద్వారా అనుకోకుండా చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఇదే కరెక్ట్ అనిపించింది’’ అని శ్రీనివాస్ రవీంద్ర అన్నారు. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్బీ చౌదరి సమర్పణలో రూపొందిన ‘ద్వారక’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు శ్రీనివాస్ రవీంద్ర. ప్రద్యుమ్న చంద్రపాటి–గణేశ్ పెనుబోతు నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 3న విడుదల కానుంది. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘తమ్మారెడ్డి భరద్వాజ, దశరద్, శ్రీను వైట్ల తదితరుల దగ్గర అసిస్టెంట్‌గా చేశా, పవన్‌కళ్యాణ్‌గారి దగ్గర ఏడాది పాటు రైటర్‌గా చేశా. దర్శకుడు శ్రీవాస్‌గారికి నాలుగు సంవత్సారాల కిందట ‘ద్వారక’ కథ చెప్పాను. ఆయనకి బాగా నచ్చటంతో మా ఇద్దరికీ పరిచయమైన ప్రద్యుమ్నగారికి చెప్పించారు. కథ విన్న వెంటనే, ఈ సినిమా మనం చేస్తున్నామని, షేక్‌హ్యాండిచ్చి అడ్వాన్సు ఇచ్చారు. విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. కథ విషయానికి వస్తే, దేవుడు అంటే ఏంటి? అని హీరో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు దొంగ, రొమాంటిక్‌గా కూడా ఉంటాడు. కానీ, నేను సర్వాంతర్యామి అంటాడు. ఈ సినిమాలో మా హీరో ఎర్రశ్రీనుగా దొంగ పాత్రలో కనపడతాడు. హీరోయిన్ పాత్ర పేరు వసుధ. వసుధతో ప్రేమలో పడ్డ తర్వాత హీరో ఏవిధంగా పరిణతి చెందాడో చెప్పే కథే ఈ సినిమా. ఇది వ్యంగ్య హాస్య చిత్రం. అందరూ చూసే విధంగా ఉంటుంది ’’ అన్నారు. -
ద్వారక అందరూ చూసేలా ఉంటుంది
- నిర్మాత ఆర్బీ చౌదరి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను అందించడంలో ఎప్పుడూ ముందుండే బ్యానర్ సూపర్‌గుడ్ ఫిలింస్. ఈ సంస్థ అధినేత ఆర్బీ చౌదరి సమర్పణలో శ్రీనివాస్ రవీంద్ర(ఎంఎస్ఆర్) దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మించిన చిత్రం ‘ద్వారక’. విజయ్ దేవరకొండ, పూజా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆర్బీ చౌదరి మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్స్‌ని, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశాం. ‘ద్వారక’తో శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తు న్నాం. ప్రద్యుమ్న, గణేష్‌లతో కలిసి ఈ చిత్రానికి అసోసియేట్ అవడం ఆనందంగా ఉంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. అందరూ చూసేలా ఈ సినిమా ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడే సినిమాలు అందించే చౌదరిగారితో కలిసి ఈ చిత్రం చేసినందుకు హ్యాపీగా ఉంది’’ అని ప్రద్యుమ్న పేర్కొన్నారు. శ్రీనివాస్ రవీంద్ర, విజయ్ దేవరకొండ, పూజా జవేరి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, మాటల రచయిత లక్ష్మీభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
నిప్పులు చెరుగుతున్న స్టార్క్.. కష్టాల్లో ఎస్ఆర్హెచ్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement