breaking news
rasmi Thakur
-
అందం.. సేవానందం..
చక్కని అందంతో పాటు మంచి మనసు కూడా ఉంటే మరింతగా ఆ అందం వన్నెలీనుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. నగరానికి చెందిన మోడల్, పలు అందాల పోటీల విజేత రష్మీ ఠాకూర్ అలాంటి వన్నెలీనే గ్లామర్ క్వీన్. కొంతకాలంగా గ్లామర్ రంగంలో రాణిస్తున్న ఆమె.. లాక్డౌన్ సమయంలో తన రైజ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఆపన్నులకు ఆసరాగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయి సంస్థకు నగరానికి చెందిన మోడల్ బ్రాండ్ అంబాసిడర్ కావడమనే అరుదైన ఘనతను సాధించారు. సాక్షి, సిటీబ్యూరో: యూఎన్ ఆధ్వర్యంలోనే గ్లోబల్ డిప్లొమాటిక్ కౌన్సిల్‌కు ఫార్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంబాసిడర్‌గా అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైఫ్‌స్టైల్స్ డైరెక్టర్‌గా ఎంపికైనట్టు రష్మీ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా తన గురించి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... ఫ్యాషన్.. ప్రొఫెషన్.. మాది ఒకప్పటి కరీంనగర్ జిల్లా.. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాగా మారింది. నాన్న రైతు. నేను బీకామ్ కంప్యూటర్స్, టెక్స్‌టైల్స్‌లో డిప్లొమా చేశాను. అనుకోకుండా అందాల పోటీల్లోకి ప్రవేశించాను. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు మోడలింగ్ చేశాను. ఫస్ట్ 2013లో అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఏడాది 2014 జనవరి 18న మిస్ ఏపీ గెలిచాను. అక్కడ నుంచి 2016లో మిస్ బ్యూటీఫుల్ ఐస్, మిస్ పర్ఫెక్ట్ టైటిల్స్ గెలిచాను. 2016లో మిస్ ఇండియా ప్లానెట్ గెలిచాను. మొత్తం 7 టైటిల్స్ గెలిచాను. ప్రొఫెషనల్ మోడల్‌గా దాదాపు అన్ని క్లోతింగ్ బ్రాండ్స్‌కు పనిచేశా. పలు అందాల పోటీలకు జడ్జ్‌గా వ్యవహరించాను. 2017 నుంచి నేషనల్ హ్యాండ్లూమ్స్కి అంబాసిడర్‌గా ఉన్నాను. సినిమా అవకాశాలు వచ్చాయి.. కానీ చేయలేదు. ఎందుకంటే గ్లామర్ రంగం ద్వారా వచ్చిన గెలుపును వ్యక్తిగతానికి కాకుండా సమాజహితానికి వినియోగించాలని నా ఆలోచన. సేవానందం.. అందాల పోటీలకు, గ్లామర్ రంగ తళుకు బెళుకులతో పాటు సమాజంలో ఉన్న కష్టాలు కన్నీళ్లూ కూడా చూశాను. సమాజం పట్ల నా వంతు బాధ్యత నిర్వర్తించాలని 2017 నుంచి రైజ్ ఇండియా అనే ఎన్జీఓ నిర్వహిస్తున్నాను. ఇటీవల లాక్డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రాసరీస్ ఇచ్చాను. తల్లీ, పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అందించాం. ఇప్పటికీ కోవిడ్–19 పరోక్షంగా చాలామంది జీవితాలను దెబ్బతీసింది. రైజ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా వీలైనంత మంది ఉపాధి కరువైన మహిళలు నిలదొక్కుకునేలా చేయాలని ఆలోచిస్తున్నాం. బ్రాండ్ అంబాసిడర్ హోదాలో... ఇదే సమయంలో యునైటెడ్ నేషన్స్‌తో అనుబంధంగా పనిచేసే గ్లోబల్ డిప్లొమాటిక్ కౌన్సిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అవడం నా లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో మరింత ఉపకరిస్తుంది. ఈ సంస్థ 14 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మహిళా స్వయంసాధికారతకు పెద్దపీట వేస్తోంది. అంబాసిడర్‌గా 3 సంవత్సరాలు ఉంటాను. గ్లామర్ రంగాన్ని కూడా సరిగా ఉపయోగించుకుంటే మహిళలకు విభిన్న రకాల అవకాశాలు అందించే చక్కని ప్రొఫెషన్. ఈ రంగం మీద ఉన్న అపోహలు తొలగించి ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చే ఆలోచన ఉంది. -
శ్రీలంక అందాల పోటీల్లో జడ్జీగా రష్మీ ఠాకూర్
జ్యోతినగర్ : శ్రీలంక దేశంలో నిర్వహించిన మిస్ శ్రీలంక 2017 అందాల పోటీల్లో జడ్జీగా ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్‌కు చెందిన మిస్ ప్లానెట్ ఇండియా 2016 విజేత రష్మీఠాకూర్ వ్యవహరించారు. ఈనెల 15నుంచి 18వరకు శ్రీలంకలో జరిగిన సీయోన్ మెజాస్టిక్ పైజాంట్ పోటీలకు రష్మీఠాకూర్ను న్యాయనిర్ణేతగా ఆహ్వానించారు. విజేతలుగా ఎంపికైన అందాల తారలకు ఆమె బహుమతులను అందించారు. -
తెలంగాణ తొలి మిస్ ఇండియాగా గర్వంగా ఉంది
వరంగల్ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలో తొలి మిస్ ఇండి యా టైటిల్‌ను సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని మిస్ ఇండియా రష్మీ ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. సోమవా రం వరంగల్ స్టేషన్ రోడ్డులోని గ్రాండ్ గాయిత్రి హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముంబై, ఢిల్లీ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు అమ్మాయిలు అందం గా, కావాల్సిన అన్ని అర్హతలతో సిద్ధంగా ఉన్నారని తెలిపా రు. మోడలింగ్‌పై అనేక రకాలైన అపోహలున్నాయన్నారు. అన్ని రంగాల్లో ఉన్నట్లుగా మోడలింగ్‌లో ఉన్నాయని, గ్లామ ర్ ఫీల్డ్ కావడంతో ఎక్కువ చర్చజరుగుతుందన్నారు. అభిరుచులకు తల్లిదండ్రులు పాధాన్యం కల్పిస్తూ, ప్రోత్సహించాల ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా సాయంచేస్తే మోడలింగ్‌పై శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మోడలింగ్ సంస్థలు ఉన్నందున కరీంనగర్ లేదా వరంగల్‌లో నెల కొల్పుతానన్నారు. సినిమాల్లో హీరోయిన్గా అవకాశలు వస్తున్నాయన్నారు. త్వరలో వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ గృహిణిగా తన ప్రస్తానం మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళలకు అదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో కూనూరు శేఖర్ గౌడ్, సదానందం పాల్గొన్నారు.