breaking news
Rangaraya medical college
-
కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 21 నుంచి పరీక్షలు ఉన్నాయని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేదానిపై తెలియలేదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాలి. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని ఉమామహేశ్వరరావు అన్నారు.రైలు కిందపడి..శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ ఎల్సీ గేటు దగ్గర గూడ్స్ రైలు క్రింద పడి గుర్తు తెలియని యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పలాస రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రంగరాయలో ర్యాగింగ్ కలకలం
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్యకళాశాల (ఆర్ఎంసీ)లో ర్యాగింగ్ కలకలం రేపింది. హౌస్ సర్జన్ తన జూనియర్లకు ర్యాగింగ్ పేరుతో శనివారం అర్ధరాత్రి ప్రత్యక్ష నరకం చూపాడు. శ్రీకాకుళానికి చెందిన జగదీశ్ ఆర్ఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్ చేస్తున్నాడు. ఆర్ఎంసీ పీజీ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. శనివారం అర్ధరాత్రి మద్యం తాగి ఆర్ఎంసీ మెన్స్ హాస్టల్లోకి చొరబడ్డాడు. రాత్రి ఒంటిగంటకు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి, రెండో సంవత్సరం చదువుతున్న పలువురు వైద్య విద్యార్థులను నిద్ర లేపాడు. 10 మంది విద్యార్థులను బలవంతంగా కారిడార్లోకి తీసుకొచ్చి, నిలబడాలని ఆదేశించాడు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 వరకూ ప్రత్యక్ష నరకం చూపించాడు. వికృత చేష్టలు చేయాలంటూ వేధించాడు. వారిలో ఎదురు తిరిగిన ముగ్గురు జూనియర్లపై చేయి చేసుకున్నాడు. బాధిత విద్యార్థుల్లో పలువురు ఆదివారం తల్లిదండ్రులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారు కళాశాల యాజమాన్యానికి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఈ ఫిర్యాదుపై యాజమాన్యం స్పందించింది. మద్యం తాగి, హాస్టల్లోకి చొరబడి ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధించిన విద్యార్థిని జగదీశ్‌గా గుర్తించింది. ఈ విషయాన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీకి నివేదించింది. జగదీశ్‌పై సోమవారం చర్యలు తీసుకోనుంది. -
దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: ఏరా లం...కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావా.. అంటూ నోటికొచ్చినట్టు బండ బూతులు తిడుతూ ఓ దళిత ప్రభుత్వ వైద్యుడిపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులతో కలసి పిడిగుద్దులతో దాడి చేశారు. శనివారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) మైదానంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు శ్రీనగర్‌లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది.ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్ట్æ ఉంది. వైద్య కళాశాల ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు క్రీడల కోసం ఆ కోర్టును వినియోగించరాదు. అయితే గత కొంత కాలంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్ట్‌కు వస్తూ మెడికోలపై గొడవకు దిగుతున్నారు. వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్‌చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు అటు రంగరాయ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కి ఫిర్యాదు చేశారు. అనుమతి అడిగి.. అంతలోనే గొడవకు దిగి..తమ అనుచరులను కోర్టులో ఆడుకునేందుకు అనుమతివ్వాలని ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహాన్ని ఇటీవల ఎమ్మెల్యేలు ఇరువురూ ఫోన్లో అడిగారు. అందుకు నరసింహం అభ్యంతరం చెబుతూ.. ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి చెబుతామని వారికి చెప్పారు. ఇంతలో అనుమతి లేకుండానే శనివారం కూటమి ఎమ్మెల్యేల అనుచరులు వాలీబాల్ కోర్టులో ఆటలాడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ విష్ణువర్ధన్, కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్‌తో కలసి ఆర్ఎంసీ గ్రౌండ్‌కి చేరుకున్నారు.కోర్టు నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేల అనుచరులకు నచ్చజెప్పగా.. వారు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు కోర్టు ఖాళీ చేసి వెళ్లిపోయాక ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులను వెంట బెట్టుకుని గ్రౌండ్‌కు వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బండ బూతులు మొదలుపెట్టి.. ఆ డాక్టర్ ముఖానికి మాస్క్‌ను బలవంతంగా లాగేసి పిడిగుద్దులు కురిపించారు. మరోమారు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానని హెచ్చరించి వెళ్లారు. ఆ సమయంలో ఇరు పక్షాలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.నేటి నుంచి జూడాల నిరసన..ఎమ్మెల్యే నానాజీ దౌర్జన్యానికి నిరసనగా ఆదివారం నుంచి విధులు బహిష్కరిస్తామని వైద్యులు, జూడాలు ప్రకటించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు జరిగిన సంఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఎల్ఏ నానాజీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆర్ఎమ్సీకి వచ్చి ఇరుపక్షాలతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వైద్యులు, మెడికోలు ససేమిరా అంటున్నారు. దళిత సంఘాలు ఆర్ఎంసీ గ్రౌండ్స్‌కు చేరుకుని దళిత జాతికి జరిగిన అవమానమంటూ ధర్నాకు దిగారు.క్రిమినల్ కేసు నమోదు చేయాలిడా.ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.జయధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. -
కడుపుబ్బ నవ్వించి.. కంటతడి పెట్టించి..
సాంబమూర్తినగర్ (కాకినాడ) : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రామ్‌కోసా) సమావేశంలో తన విశిష్ట ప్రతిభను కనబరిచారు. ఆర్ఎంసీ ఆడిటో రియంలో శనివారం రామ్‌కోసా 10వ అ లూమినీ సమావేశం ప్రముఖ నిర్మాత, సంఘం అధ్యక్షుడు డాక్టర్ కేఎల్ నారాయణ అధ్యక్షతన జరిగింది. నారాయణ అభ్యర్థన మేరకు అతిథిగా హాజరైన బ్ర హ్మానందం..స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రముఖుని సన్మాన కార్యక్రమంలో వక్తల హావభావాల్ని అనుకరిస్తూ కడుపుబ్బ నవ్వించారు. చివరిగా ఆయన ఓ మానసిక వికలాంగుడి హావభావాల్ని ప్రదర్శించి, మనసుల్ని క దిలించి కంటతడి పెట్టించారు. బ్రహ్మానందం ప్రసంగించినంత సేపూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీని వాస్, వైద్యులు కరతాళధ్వనులు చేశారు. వైద్యులు కనిపించే దేవుళ్లని బ్రహ్మానం దం అన్నారు. వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
కడుపుబ్బ నవ్వించి.. కంటతడి పెట్టించి..
-
కంటతడి పెట్టించిన బ్రహ్మి