breaking news
Ran
-
21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత?
శరీర బరువును తగ్గించడంలో రన్నింగ్ సహాయపడుతుందని ఫిట్నెస్ నిపుణులు చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అయితే ఒక వ్యక్తి కేవలం 21 కిలోమీటర్ల రన్నింగ్ ద్వారా తన శరీర బరువును 11 కిలోలు తగ్గించుకున్నాడనే సంగతి మీకు తెలుసా? ఇటీవల రష్యాలోని రిపబ్లిక్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు రన్నింగ్ ద్వారా 11 కిలోల బరువు తగ్గాడు. ఇందుకోసం ఆ వృద్ధుడు 2 గంటల 50 నిముషాలు పరిగెత్తాడు. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలేమిటో ధృవీకరణ కాలేదు. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో ఉంటున్న 69 ఏళ్ల బహామా ఎగుబోవ్ పేరు 2019లో రష్యన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. అప్పుడు బహామా 5 గంటల పాటు పరిగెత్తి, 9 కిలోలకుపైగా బరువు తగ్గాడు. తాజాగా బహామా ఎగుబోవ్ 21 కిలోమీటర్ల రేసులో పరుగు తీసి, కేవలం రెండున్నర గంటల్లోనే 11 కిలోల బరువు తగ్గాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫీట్లో బహామా ఎగుబోవ్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కాలేదు. ఎందుకంటే శరీరానికి హాని కలిగించే ఇలాంటి విజయాన్ని రికార్డ్‌గా పరిగణించరు. త్వరగా బరువు తగ్గేందుకు ప్రయోగాలు చేయడం ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా బరువు తగ్గిన వ్యక్తి ని తానేనని బహామా ఎగుబోవ్ చెబుతున్నాడు. ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం బహామా.. జూడో, సాంబో, గ్రీకో-రోమన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు. బహామా ఒకప్పుడు యుద్ధాల్లో పాల్గొన్న సమయంలో బరువు తగ్గించే కళను నేర్చుకున్నాడు. తాను తన చిన్నతనంలో యుద్ధాల కోసం 17 కిలోల బరువును తగ్గానని బహామా తెలిపాడు. అయితే వృద్ధాప్యంలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అయినా తాను ఈ ఘనత సాధించానని పేర్కొన్నాడు. పోషకాహార నిపుణుడు ఒక్సానా లైసెంకో మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా రెండు గంటల్లో 11 కిలోల బరువు తగ్గాలంటే, శరీరం నుండి తగినంత ద్రవాన్ని తొలగించాలి. ఇది బహామా ఎగుబోవ్ విషయంలో నిస్సందేహంగా జరిగింది. అయితే సాధారణ వ్యక్తి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ఆయన హెచ్చరించారు. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
ఒడిస్సా: ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైల్..
-
పట్టురైతుకు మరిన్ని ప్రోత్సాహకాలు
పలమనేరు, న్యూస్‌లైన్: పట్టురైతుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందజేస్తామని పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ సీఎస్ రామలక్ష్మి తెలిపారు. పలమనేరు పట్టణ సమీపంలో గురువారం ఆమె స్థానిక ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డితో కలసి సిల్క్పార్కును ప్రారంభించారు. రీలింగ్ కేంద్రం వద్ద రీలర్ల తో, పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్ర సమీపంలోని రైతులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ప్రపంచస్థాయి సెరికల్చర్ హబ్‌గా పలమనేరును త్వరలో తయారు చేస్తామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బైవోల్టిన్ పట్టుగూళ్లకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందన్నారు. జిల్లాలో రీలింగ్ యూనిట్ల అవసరం పెరిగిందన్నారు. ఇక్కడ ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లతో పాటు మల్టీఎండ్ రీలింగ్ యూనిట్లు, అడ్వాన్స్డ్ట్విస్టింగ్ యూనిట్లను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. కర్ణాటకలోని వ్యాపారులు ఇక్కడ యూనిట్లను ప్రారంభిస్తే 75 శాతం సబ్సిడీ మంజూరు చేస్తామన్నారు. పట్టుగూళ్ల ఉత్పత్తిలో రాష్ర్టంలోనే చిత్తూరు జిల్లా మొదటిస్థానంలో ఉందని, నెలకు టన్ను పట్టుగూళ్లను పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఐటీ ఉద్యోగాలను వదిలిపెట్టి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పట్టుపరిశ్రమ వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. ఈ ఏడాది బైవోల్టిన్ పట్టుగూళ్లు 300 టన్నుల ఉత్పత్తయ్యాయన్నారు. రాబోవు రోజుల్లో 3 వేల టన్నుల లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె వెల్లడించారు. ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి మాట్లాడుతూ పట్టుగూళ్ల ఉత్తత్తితో పాటు నాణ్యమైన పట్టుదారం తీసే యూనిట్లు ఈ ప్రాంతంలో మరిన్నింటిని నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో పట్టు రైతులు, రీలర్ల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. సెరికల్చర్ జేడీపీజే. శర్మ మాట్లాడుతూ జిల్లాలో 25 వేల ఎకరాల్లో 18 వేల మంది పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. రెండేళ్లుగా సీబీ, సీఎస్ఆర్ పట్టుగూళ్ల ఉత్పత్తి 40 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సిల్క్పార్క్ ప్రారంభం పట్టుగూళ్ల మార్కెట్ సమీపంలో రూ.కోటితో నిర్మించిన సిల్క్పార్కును ప్రారంభించారు. మల్టీఎండ్, ట్విస్టింగ్ యూనిట్లను కమిషనర్, ఎమ్మెల్సీలు పరిశీలించారు. పట్టుగూళ్ల విక్రయ కేంద్రంలో బైవోల్టిన్ గూళ్ల వేలాన్ని పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ తనిఖీ చేశారు. పట్టురైతుకు వరాలు బైవోల్టిన్ చాకీ పురుగుల సబ్సిడీని ఒక్కోరైతుకు రూ.250 నుంచి రూ.750 పెంచినట్టు కమిషనర్ ప్రకటించారు. పట్టుపురుగుల షెడ్లకు (పెద్దసైజు) సబ్సిడీని రూ.లక్ష, షెడ్లకు ముందు వరండాల నిర్మాణానికి రూ.22.500ను మంజూరు చేస్తామన్నారు. ప్లాస్టిక్ చందరీకలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిల్క్‌బోర్డు మెంబర్ జయరామిరెడ్డి, డెప్యూటీడెరైక్టర్, స్పెషలాఫీసర్ మాలకొండారెడ్డి, ఏడీలు ఢిల్లీబాబు, శివశంకర్ గౌడ్, సైంటిస్టులు మురళి, ప్రసాద్, స్థానిక నాయకులు సుబ్రమణ్యంగౌడు, చెంగారెడ్డి, బాలన్న, ప్రహ్లాద, ఎంహెచ్ ఖాన్ పాల్గొన్నారు.