breaking news
ramalayam opening
-
అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న రామ్‌లల్లా పవిత్రోత్సవం జరగనుంది. ఈ నేపధ్యంలో ఇక్కడి హోటళ్ల బుకింగ్స్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయ్యాయి. హోటల్ రూమ్ బుకింగ్ ధర గతంలో కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలో 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని పలు లగ్జరీ హోటళ్లలో ఒక రోజు రూమ్ బుకింగ్ లక్ష రూపాయల వరకూ చేరింది. రామ్‌లల్లా పవిత్రోత్సవం రోజున మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఐదు లక్షల మంది వరకూ భక్తులు అయోధ్యకు వస్తారనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు రూమ్‌ల ధరలను అమాంతం పెంచేశారు. హోటల్ అయోధ్య ప్యాలెస్‌లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె సుమారు రూ. 18,500 పలుకుతోంది. సాధారణంగా ఇక్కడ గది అద్దె రూ. 3,700. ది రామాయణ హోటల్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె రూ. 40 వేలు. 2023లో దీని అద్దె రూ. 14,900గా ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్లో ప్రస్తుతం ఒకరోజు అద్దె దాదాపు రూ.70, 500. గత ఏడాది జనవరిలో ఇక్కడ గది అద్దె రూ. 16,800గా ఉండేది. మీడియాకు అందిన వివరాల ప్రకారం అయోధ్యలోని రామాయణ్ హోటల్లోని గదుల బుకింగ్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయింది. ఈ హోటల్లోని గదులు జనవరి 20 నుండి 23 వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఈ హోటల్లో గది అద్దె రోజుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ పెరిగింది. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్‌లోని విలాసవంతమైన గది ఒకరోజు అద్దె లక్ష రూపాయలకు బుక్ అయ్యింది. ఈ హోటల్లోని గదులన్నీ బుక్ అయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. గతంలో ఈ హోటల్లో గది అద్దె కనీసంగా రూ.7,500 ఉండేది. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
రామాలయ ప్రారంభోత్సవానికి... ఖర్గే, సోనియా దూరం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత సోనియాగాం«దీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అ«దీర్ రంజన్ చౌదరి నిర్ణయించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఈ మేరకు వెల్లడించారు. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ, ఆరెసెŠస్స్ కలిసి రామ మందిరాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని విమర్శించారు. అందుకే అసంపూర్తి ఆలయాన్ని హడావుడిగా ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఖర్గే, సోనియా, అ«దీర్‌లను రామ మంది ట్రస్టు, వీహెచ్‌పీ నేతలు డిసెంబర్లో కలిసి రామ మందిర ప్రారం¿ోత్సవానికి రావాలంటూ వ్యక్తిగతంగా ఆహా్వన లేఖలు అందించారు. కానీ అది ఫక్తు ఆరెస్సెస్, బీజేపీ రాజకీయ సంరంభమని జైరాం విమర్శించారు. ‘‘కోట్లాది మంది భారతీయులు రాముడిని పూజిస్తారు. మతం మనిషి వ్యక్తిగత విషయం. అందుకే రామున్ని పూజించే కోట్లాది మంది సెంటిమెంట్లను గౌరవిస్తూనే ఆహా్వనాన్ని నేతలు సున్నితంగా తిరస్కరించారు’’ అన్నారు. వారిని ప్రజలు బాయ్‌కాట్ చేస్తారు కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ దుయ్యబట్టింది. రాముని అస్తిత్వాన్నే నిరాకరిస్తున్నామంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ నుంచి ఇంకేం ఆశించగలమని ఎద్దేవా చేసింది. హిందూ మతాన్ని, హిందువులను అవమానించడం కాంగ్రెస్‌కు, విపక్ష ఇండియా కూటమి పక్షాలకు కొత్తేమీ కాదంటూ మండిపడింది. రామునిపై నమ్మకం లేదని సోనియా మరోసారి నిరూపించుకున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శించారు. వారిని దేశ ప్రజలు బాయ్‌కాట్ చేస్తారని మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. -
అయోధ్య రామునిపై పాట.. సింగర్‌ని అభినందించిన ప్రధాని మోదీ
లక్నో: అయోధ్యలో మరికొద్ది రోజుల్లో రామ మందిర ప్రారంభోత్సవం ప్రారంభం కానుంది. ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాముడిపై భక్తితో పాటలను రూపొందిస్తున్నారు భక్తులు. రాముని గొప్పతనాన్ని కీర్తిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. వాటిలో తనకు నచ్చిన వాటిని ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసి గాయకులను ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌కు చెందిన జానపద గాయని గీతా రబారీ పాటను ప్రధాని మోదీ షేర్ చేశారు. अयोध्या में प्रभु श्री राम के दिव्य-भव्य मंदिर में राम लला के आगमन का इंतजार खत्म होने वाला है। देशभर के मेरे परिवारजनों को उनकी प्राण-प्रतिष्ठा की बेसब्री से प्रतीक्षा है। उनके स्वागत में गीताबेन रबारी जी का ये भजन भावविभोर करने वाला है। #ShriRamBhajanhttps://t.co/ctWYhcPM4h — Narendra Modi (@narendramodi) January 7, 2024 గుజరాత్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా రబారీ ‘శ్రీ రామ్ ఘర్ ఆయే’ పేరుతో ఆలపించిన గీతాన్ని ప్రధాని షేర్ చేస్తూ ఆమెను అభినందించారు. ‘‘అయోధ్యలో శ్రీరాముడి రాక కోసం ఎదురుచూపులు ముగిశాయి. దేశవ్యాప్తంగా రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. రాముడికి స్వాగతం పలుకుతూ గీతా రబారీ ఆలపించిన గీతం ఎంతో భావోద్వేగంగా ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: murli manohar joshi: ‘అయోధ్య’ ఉద్యమంలో మురళీ మనోహర్ జోషి పాత్ర ఏమిటి? -
జనవరి 22న... ఇంటింటా రామజ్యోతి
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టను దీపావళి పర్వదినంగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఆ సందర్భంగా జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ రోజు కోసం ప్రపంచమంతా ఏళ్ల తరబడి ఎదురుచూసిందన్నారు. ఏళ్ల తరబడి గుడారంలో గడిపిన రామునికి ఎట్టకేలకు ‘పక్కా ఇల్లు’ సాకారమైందన్నారు. అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. నూతన విమానాశ్రయంతోపాటు ఆధునీకరించిన రైల్వే జంక్షన్‌ను ప్రారంభించారు. రూ.15,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, వారసత్వం రెండు పట్టాలుగా దేశం ప్రగతి పథంలో పరుగులు తీయాలని ఆకాంక్షించారు. జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని, ఎక్కడివారక్కడే రామాలయ ప్రారంభ వేడుకలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఉజ్వల్ పథక 10 కోట్లవ లబి్ధదారు ఇంట్లో మోదీ చాయ్ ఆస్వాదించారు. అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జనవరి 22న దేశమంతటా ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. నిత్యం రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్న అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రోజంతా బిజీబిజీగా గడిపారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాక అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభాన్ని, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమంటే అందరికీ దీపావళి పండుగే. దీనికి గుర్తుగా ఆ రాత్రి ఇంటింటా శ్రీరామ జ్యోతిని వెలిగించండి. అయోధ్యలో రామ్‌లల్లా (బాల రాముడు) ఇంతకాలం తాత్కాలిక టెంట్ కింద గడపాల్సి వచ్చింది. ఇప్పుడు దేశంలోని నాలుగు కోట్ల మంది పేదలతో పాటు రామ్‌లల్లాకు కూడా పక్కా ఇల్లు వచ్చేసింది’’ అని అన్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని చరిత్రాత్మక ఘట్టంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఈ రోజు కోసం యావత్ ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. కనుక అయోధ్య వాసుల్లో ఇంతటి ఉత్సాహం సహజం. భరత గడ్డపై అణువణువునూ ప్రాణంగా ప్రేమిస్తా. ప్రతి భారతీయుడూ పుట్టిన నేలను ఆరాధిస్తాడు. నేనూ మీలో ఒకడినే’’ అన్నారు. వికాస్.. విరాసత్ అత్యంత స్వచ్ఛమైన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దుదామంటూ ప్రతిజ్ఞ చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ఇది అయోధ్యవాసుల బాధ్యత. జనవరి 14 నుంచి 22వ తేదీ దాక దేశంలోని అన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాల్లో స్వచ్ఛత కార్యాక్రమాలు చేపడదాం. దేశం కోసం కొత్త తీర్మానాలు, మనం కోసం కొత్త బాధ్యతలను తలకెతత్తుకుందాం. ఏ దేశమైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిందే. వికాస్ (అభివృద్ధి)తో పాటు విరాసత్ (వారసత్వం) కూడా ముఖ్యమే. అవి రెండూ పట్టాలుగా 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఆ రెండింటి ఉమ్మడి అభివృద్ధి బలమే భారత్‌ను ముందుకు నడుపుతుందన్నారు. సభలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న మెగా రోడ్ షో శనివారం ఉదయం 11 గంటలకు అయోధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక మోదీ అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ దాకా దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా రోడ్‌షో సాగింది. దారి పొడవునా ప్రధానికి అయోధ్యవాసులు, పలు రాష్ట్రాల నుంచి వచి్చన కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. రోడ్‌షో మధ్య మధ్యలో ఏర్పాటుచేసిన 40 కళావేదికల వద్ద పలు రాష్ట్రాల కళాకారులు నృత్య, కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి వచి్చన కళాకారులు రాముని జీవితంతో ముడిపడి ఉన్న ‘దేధియా’ నృత్యంతో ఆకట్టుకున్నారు. అనంతరం మోదీ మార్గమధ్యంలో అతిపెద్ద వీణతో అలంకృతమైన లతా మంగేష్కర్ చౌక్ వద్ద కాసేపు గడిపారు. ఆ రోజు రాకండి ఆహా్వనితులు మినహా మిగతా వారు 22న అయోధ్యకు రావద్దని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘‘రామాలయ ప్రాణప్రతిష్ఠ క్రతువును ప్రత్యక్షంగా తిలకించేందుకు జనవరి 22వ తేదీనే అయోధ్యకు పోటెత్తాలని అసంఖ్యాకులు భావిస్తున్నట్టు తెలిసింది. దయచేసి ఆ రోజున మాత్రం అయోధ్యకు రాకండి. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎందుకంటే అందరికీ అదే రోజున దర్శనభాగ్యం సాధ్యపడదు. ఆ రోజు చాలామంది విశిష్ట అతిథులు విచ్చేస్తున్నారు. కనుక యావత్ ప్రజానీకం జనవరి 23 నుంచి జీవితాంతం అయోధ్య రామున్ని దర్శించుకోవచ్చు’’ అని సూచించారు. వాలీ్మకి మహర్షి ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో ఆధునిక హంగులతో సిద్దమైన విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. రామాయణ కర్త పేరిట దీనికి మహర్షి వాలీ్మకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక సౌకర్యాలతో రూ.1,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని శనివారం ఉదయం మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వాలీ్మకి విరచిత రామాయణం మనకు గొప్ప జ్ఞానపథమని ఈ సందర్భంగా అన్నారు. ‘‘అది మనల్ని శ్రీరామ ప్రభువు చెంతకు చేరుస్తుంది. ఆధునిక భారత దేశంలో అయోధ్య ధామంలోని వాలీ్మకి విమానాశ్రయం మనల్ని దివ్య (మహోన్నత), భవ్య (అద్భుత), నవ్య (ఆధునిక) రామ మందిరానికి చేరుస్తుంది. అప్పట్లో ఇదే రోజున అండమాన్ దీవికి బ్రిటిష్ చెర నుంచి సుభాష్ చంద్రబోస్ విముక్తి కలి్పంచారు. అక్కడ జాతీయ జెండా ఎగరేశారు. మనలి్నది ఆజాదీ కీ అమృత్ కాల్లోకి తీసుకెళ్తుంది’’ అన్నారు. విమానాశ్రయ విశేషాలు.. ► అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాతి్మక వాతావరణం ప్రతిబింబించేలా విమానాశ్రయ నిర్మాణం సాగింది. టెర్మినల్ భవనానికి శ్రీరామ మందిరాన్ని తలపించేలా తుదిరూపునిచ్చారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ వేశారు. రాముడి జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలకు విమానాశ్రయంలో చోటు కలి్పంచారు. ► బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించారు. ► ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ► చుట్టూతా పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. ► విమానాశ్రయ నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ► ఈ ఎయిర్‌్రస్టిప్ గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీన్ని రూ.350 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. ఇందుకు యూపీ ప్రభుత్వం 821 ఎకరాలు కేటాయించింది. ► ఏటా 10,000 మంది ప్రయాణికుల రాకపోకలను వీలుగా విమానాశ్రయాన్ని విశాలంగా నిర్మించారు. టెరి్మనల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టారు. ► 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఉండటంతో ఎయిర్‌బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చాలా సులువు. రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకోవచ్చు. ► భవిష్యత్తులో విమానాశ్రయ రెండో దశ విస్తరణ మొదలవనుంది. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరిస్తారు. ► ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ► రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కలి్పంచాలని భావిస్తున్నారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు పచ్చజెండా అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.241 కోట్లతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి రెండు అమృత్ భారత్ రైళ్లను, ఆరు వందే భారత్ రైలు సేవలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘ మూడు కొత్త సేవలైన వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్‌ల ‘త్రిశక్తి’తో భారత రైల్వే నూతన అభివృద్ధి శకంలోకి దూసుకెళ్లగలదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. మూడంతస్తుల నూతన అయోధ్య రైల్వేస్టేషన్లో సరికొత్త సౌకర్యాలను కలి్పంచారు. లిఫ్ట్‌లు, కదిలే మెట్లు, ఫుడ్ ప్లాజాలు, వాణిజ్య, వ్యాపార సముదాయలు, పూజా సామగ్రి దుకాణాలు, చైల్డ్ కేర్, వెయిటింగ్ హాళ్లతో స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారి సరి్టఫికెట్‌నూ ఈ రైల్వేస్టేషన్ సాధించింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అమృత్ భారత్ రైలుకు తొలి రోజు విశేష స్పందన లభించింది. బుకింగ్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. -
'రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు'
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ చెప్పారు. రామ మందిరాన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. ఎదైతేనేం.. రామాలయం ఏర్పడైనందుకు సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఎంతో మంది సహకారం ఉందని అన్నారు. అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందాయి. దాదాపు 6000 మందికిపైగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. డిసెంబర్ 30న అయోధ్యలో ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇదీ చదవండి: ఇది ఇంగ్లాండ్ కాదు.. కన్నడ భాషా వివాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు -
కోదండ రామాలయం ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక పోలీస్ లైన్లో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయం, పునరుద్ధరించిన కల్యాణమంటపాన్ని బుధవారం తెల్లవారుజామున అనంతపురం రేంజ్ డీఐజీ మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడారు. గతంలో కోదండ రామాలయం, కల్యామంటపం రెండూ కలిసే ఉండడం వల్ల కొంత అసౌకర్యంగా ఉండేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామాలయం, కల్యాణమంటపం వేర్వేరుగా ఏర్పాటు చేశామన్నారు. అదనపు ఎస్పీ కె. మాల్యాద్రి, డీఎస్పీలు బి. మల్లికార్జున, జె. మల్లికార్జునవర్మ, ఖాసీంసాబ్, మహబూబ్‌బాషా, నరసింగప్ప, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు త్రిలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, హరినాథ్, నాగరాజు, పలువురి ఆర్ఎస్ఐలు,ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.