కోదండ రామాలయం ప్రారంభం | ramalayam opening | Sakshi
Sakshi News home page

కోదండ రామాలయం ప్రారంభం

Apr 5 2017 11:20 PM | Updated on Aug 21 2018 8:06 PM

స్థానిక పోలీస్‌ లైన్‌లో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయం, పునరుద్ధరించిన కల్యాణమంటపాన్ని బుధవారం తెల్లవారుజామున అనంతపురం రేంజ్‌ డీఐజీ మల్లికార్జునరావు ప్రారంభించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : స్థానిక పోలీస్‌ లైన్‌లో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయం, పునరుద్ధరించిన కల్యాణమంటపాన్ని బుధవారం తెల్లవారుజామున అనంతపురం రేంజ్‌ డీఐజీ మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడారు. గతంలో కోదండ రామాలయం, కల్యామంటపం రెండూ కలిసే ఉండడం వల్ల  కొంత అసౌకర్యంగా ఉండేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామాలయం, కల్యాణమంటపం వేర్వేరుగా  ఏర్పాటు చేశామన్నారు. 

అదనపు ఎస్పీ కె. మాల్యాద్రి, డీఎస్పీలు బి. మల్లికార్జున, జె. మల్లికార్జునవర్మ, ఖాసీంసాబ్, మహబూబ్‌బాషా, నరసింగప్ప, ఏఆర్‌ డీఎస్పీ చిన్నికృష్ణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు త్రిలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, హరినాథ్, నాగరాజు, పలువురి ఆర్‌ఎస్‌ఐలు,ఏఆర్, స్పెషల్‌ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement