breaking news
Ramalatha
-
విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా (Prabhu Deva) జీవితంలో ఇద్దరు మహిళలు భార్య స్థానాన్ని పొందారు. గతంలో ఈయన రామలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కాదా అందులో ఓ అబ్బాయి టీనేజ్‌లో మరణించాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. అవి విడాకుల వరకూ వెళ్లాయి. నయనతార వల్లే విడిపోయామని ఆమధ్య రమాలత్ మీడియా ముందే తేల్చేసింది.పిల్లలంటే ప్రాణంఅనంతరం ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను వివాహం చేసుకోగా వీరికి ఓ పాప కూడా పుట్టింది. తాజాగా ప్రభుదేవా మాజీ భార్య రమాలత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రభుదేవాకు మా పిల్లలంటే ప్రాణం. వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. నా ఇద్దరు కొడుకులకు కూడా తండ్రితో మంచి అనుబంధం ఉంది. వారు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు నాతో పాటు ప్రభుదేవా అనుమతి అడుగుతారు.అదే రక్తం..ప్రభుదేవా సంగీత కచేరిలో నా పెద్ద కొడుకు రిషి డ్యాన్స్ అద్భుతంగా చేశాడు. తండ్రి రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది. అందరూ వాడి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. అలా ఎలా చేయగలిగాడు? అని అడుగుతున్నారు. అతడు కేవలం రెండేళ్ల నుంచే డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. హీరోగానూ అవకాశాలు వస్తున్నాయి. చిన్నవాడికి మాత్రం సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. తను డాక్టర్ అవుతానంటున్నాడు. విదేశాలకు పంపించి బాగా చదివించాలనుకుంటున్నాం.అతడే సపోర్ట్..ప్రభుదేవాకు, నాకు విడాకులయ్యాయి. అంతమాత్రాన మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైగా నాకు, నా పిల్లలకు అతడే సపోర్ట్‌గా నిలబడ్డాడు. ఎన్నడూ నా గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు. అందుకే ఆయన్ని ఎప్పటికీ వదులుకోలేను. అయితే ఒంటరిగా పిల్లల్ని పెంచడం అనేది కష్టమే! ఆ కష్టాల్ని నేను అధిగమించాను. మంచి తండ్రిగా ప్రభుదేవా నా పిల్లల కోసం ఎప్పుడూ నిలబడ్డాడు అని లత చెప్పుకొచ్చింది.చదవండి: కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్ -
రెండేళ్లుగా ఒంటరి జీవితమే
తాను రెండేళ్లుగా ఒంటరి జీవితమే గడుపుతున్నానని, ఎవరితోనూ సహ జీవనం చేయడంలేదని ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా పేర్కొన్నారు. ఆయన ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ దర్శకుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఈయనకు భార్య రమాలత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం నటి నయనతారతో పరిచయం ప్రేమగా మారింది. వీరి ఘాటు ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. ప్రభుదేవాతో ఏడడుగులు వేయడానికి క్రిష్టియన్ అయిన నయనతార హిందూ మతం తీసుకున్నారు. వీరి పెళ్లి మాత్రం జరగలేదు. చిన్న మనస్పర్థల కారణంగా వీరి ప్రేమ బ్రేక్ అప్ అయ్యింది. నయనతారతో ప్రభుదేవా అనుబంధం కారణంగా ఆయన భార్య రమాలత్ దూరమయ్యారు. విడాకులు కూడా తీసుకున్నారు. నయనతారతో కూడా సంబంధాలు తెగిపోవడంతో ప్రభుదేవా ముంబయిలో సెటిల్ అయిపోయారు. భార్య రమాలత్‌తో అనుబంధం లేకపోయినా పిల్లలతో మాత్రం ప్రభుదేవా ప్రేమగా మసలుకునే వారు. దర్శకుడిగా బిజీగా ఉన్నా ఖాళీ దొరికినప్పుడల్లా చెన్నైకి వచ్చి పిల్లలతో గడుపుతుంటారు. వారిని వేసవి సెలవుల్లో విదేశాలకు తీసుకెళ్లి సంతోష పరుస్తుంటారు. ఈ ఏడాది కూడా పిల్లల్ని సిడ్నీ తీసుకెళ్లాలని భావించారు. అందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. అలాంటి పరిస్థితిలో పిల్లలతో సహా ఆయన పాస్‌పోర్టు మిస్ అవ్వడం ప్రభుదేవాను నిరాశ పరిచింది. స్నేహితులకిచ్చిన పాస్ పోర్టు మిస్ అయ్యిందని, మళ్లీ కొత్తగా పాస్‌పోర్టులకు అప్లై చేసినట్టు ఇటీవల చెన్నై వచ్చిన ఆయన తెలిపారు. మరో పది రోజుల్లో తనకు, పిల్లలకు పాస్ పోర్టులు వస్తాయని అధికారులు తెలిపారని, ఆ తర్వాత సిడ్నీ బయలుదేరనున్నట్లు ప్రభుదేవా తెలిపారు. ఈ క్రమంలో మీ పిల్లలతో పాటు భార్య రమాలత్‌ను కూడా సిడ్నీకి తీసుకువెళతారా? అన్న ప్రశ్నకు ప్రభుదేవా బదులిస్తూ, తనకు ఏ అమ్మాయితోను అనుబంధం లేదన్నారు. రెండేళ్లుగా ఒంటరిగానే జీవిస్తున్నట్లు వెల్లడించారు. దర్శకుడిగా తాను బిజీగా ఉన్నానని, ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడానికి సమయంలేదన్నారు. ఇకపై ఎవరితోనైనా అనుబంధం పెంచుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు తనకు వయసు పెరుగుతోందన్నారు. నా పిల్లలు పెద్దవారవుతున్నారని, వారు స్నేహితులతో తిరిగే సమయమని అన్నారు. మీ పిల్లల్ని నృత్య దర్శకులుగా తయారు చేస్తారా? అనే ప్రశ్నకు తాను తన తండ్రి బాటలో పయనించానని, అలాగని తన పిల్లలు తన వృత్తిని చేపట్టాలని ఏమీ లేదన్నారు. ఈ విషయంలో నిర్ణయం వారికే వదిలేస్తున్నట్లు ప్రభుదేవా పేర్కొన్నారు.