మాయావతి ఎన్నికల వ్యూహం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి పార్టీని పునర్య్వస్థీకరించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా పలు మార్పులు చేశారు. సీనియర్ నాయకుడు అశోక్ సిద్ధార్థకు అదనంగా అలీగఢ్, ఆగ్రా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఆయన లక్నో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.
అయితే కాన్పూర్ బాధ్యతలు ఆయన నుంచి రాంకుమార్ కురీల్ అప్పగించారు. చిత్రకూట్, ఝాన్సీ వ్యవహారాలు కూడా రాంకుమార్ కే కట్టబెట్టారు. 2017లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో మాయావతి వ్యూహారచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీలో పలు మార్పులు చేస్తున్నారు.