జర్నలిస్టు హత్య కేసులో కీలక నిందితుడి అరెస్ట్
                  
	బాలాఘాట్:  మధ్యప్రదేశ్ జర్నలిస్టు హత్యకేసులో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మధ్యప్రదేశ్ కు చెందిన జర్నలిస్టు సురేష్ కొఠారి హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన రాకేష్‌ను  బాల్ఘాట్లోని ప్రాంతంలో అదుపులోకి పోలీసులు  బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.  దీనికి సంబంధించిన వివరాలను  పోలీసు ఉన్నతాధికారి  మార్కం  గురువారం వెల్లడించారు. జర్నలిస్టుని కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో  కీలక నిందితుడు రాకేష్ పరారీలో ఉన్నాడు.  
	దీంతో ఈ కేసులో మొత్తం ఏడుగురిని అదుపులోకి  తీసుకున్నట్టయింది. కాగా  సురేష్ కొఠారిని జూన్ 19న  మైనింగ్ మాఫియా  చేతిలో  హత్యకు గురయ్యాడు. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా  వ్యతిరేకంగా రాస్తున్నందువల్లే  తామీ హత్యలకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో ముగ్గురు యువకులు నేరాన్ని అంగీకరించారు. మధ్యప్రదేశ్‌లో కిడ్నాప్ చేసి హతమార్చి మహారాష్ట్రలోని  నాగ్‌పూర్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్టుగా చెప్పారు. ఈ కేసులో రాకేష్‌తో పాటు  మొత్తం ఏడుగురిపై కేసు నమోదుచేశారు.