breaking news
Rajiv Gandhi Centre for Aquaculture
-
పండుగప్ప.. హెక్టారు.. 15 టన్నులు!
దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉండటమే కాకుండా.. మంచి నీటిలో, ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో కూడా పెరిగే అరుదైన చేప.. పండుగప్ప (సీబాస్). రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేయదగిన సలక్షణమైన చేప ఇది. ముళ్లు తీసేసిన పండుగప్ప మాంసం ముక్కలకు దేశీయ సూపర్ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. కిలో రూ. 400–500 వరకు పలుకుతోంది. విదేశాల్లో దీనికి ఉన్న డిమాండ్ సరేసరి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఎంపెడా ఇటీవల పండుగప్ప సాగులో అధిక దిగుబడి సాధించింది. ఉప్పునీటి చెరువులో హెక్టారుకు 15 టన్నుల పండుగప్ప చేపల దిగుబడి తీయడం విశేషం. చెరువుల్లో సాగయ్యే రకాల్లో రొయ్యలకు అన్ని విధాలా దీటైన ‘రారాజు పండుగప్ప’ అని ‘ఎంపెడా’ చైర్మన్ కె.ఎస్. శ్రీనివాస్ అభివర్ణించారు. ఆక్వా సాగు అంటే కేవలం రొయ్యల సాగే అని భావించే రైతులు పండుగప్ప సాగుపై దృష్టి సారించడానికి తాజా ప్రయోగాత్మక సాగు ఫలితాలు ఉత్తేజాన్నిస్తాయని ఆయన అన్నారు. ఆక్వా సాగులో సరికొత్త ప్రయోగాలకు ‘రాజీవ్‌గాంధీ ఆక్వాకల్చర్ సెంటర్’(ఆర్.జి.సి.ఎ.)లు వేదికలుగా నిలిచాయి. ఎంపెడా ఆధ్వర్యంలో దేశంలోని అనేక చోట్ల ఆర్.జి.సి.ఎ.లు ఏర్పాటయ్యాయి. కృష్ణాజిల్లాలో కూడా ఒక ఆర్.జి.సి.ఎ. విభాగం ఉంది. పాండిచ్చేరిలోని కరైకల్ వద్ద ఏర్పాటైన ఆర్.జి.సి.ఎ.లోని ప్రదర్శనా క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండుగప్పను సాగు చేసి, 10 నెలల్లో హెక్టారుకు 15 టన్నుల దిగుబడి సాధించారు. 1.5–2.0 సెం.మీ. చేప పిల్లలను చెరువులో వదిలారు. పది నెలల్లో ఒక్కోచేప 1200 గ్రాముల నుంచి 1500 గ్రాముల బరువు పెరిగాయి. తేలాడే పెల్లెట్లను మేతగా వేశారు. కిలో మేతకు 1.8 కిలోల దిగుబడి సాధించడం విశేషం. అన్నీ కలిపి కిలోకు రూ. 300 ఉత్పత్తి ఖర్చు అయింది. వ్యాపారులు చెరువు దగ్గరకే వచ్చి రూ. 420–450 ధర ఇచ్చి కొనుక్కెళ్లారు. రూ. 17 లక్షల లాభం వచ్చినట్లు ఎంపెడా అధికారులు ప్రకటించారు. పండుగప్ప సాగుకు కీలకం నాణ్యమైన విత్తనం. తమిళనాడు నాగపట్నం జిల్లా తోడువాయి వద్ద గల ఆర్.జి.సి.ఎ.లోని హేచరీలో అత్యంత నాణ్యమైన పండుగప్ప విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే కోటి 80 లక్షల సీడ్‌ను ఉత్పత్తి చేసి రైతులకు అందించినట్లు ఎంపెడా చెబుతోంది. ప్రజలు మక్కువతో ఆరగించే పండుగప్ప చేపలను రొయ్యలకు బదులుగా ఆక్వా రైతులు సాగు చేయాలని ఎంపెడా సూచిస్తోంది. పండుగప్ప విత్తనం కోసం ఆర్.జి.సి.ఎ. అధికారి పాండ్యరాజన్‌ను 94437 24422లో సంప్రదించవచ్చు. ఫాక్స్: 04364–264502 seabasshatchery@gmail.com. -
ఉద్యోగ సమాచారం
ఈసీఐఎల్‌లో వివిధ పోస్టులు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలు.. సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ (ఖాళీలు-3), జూనియర్ ఆర్టిసన్ (ఖాళీలు-1), టెక్నికల్ ఆఫీసర్ (ఖాళీలు-6). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 2, 7, 17. వివరాలకు www.ecil.co.in చూడొచ్చు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 28. వివరాలకు www.cuk.ac.in చూడొచ్చు. రాజీవ్‌గాంధీ ఆక్వాకల్చర్ సెంటర్లో వివిధ పోస్టులు రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ (ఆర్జీసీఏ).. వివిధ విభాగాల్లో రెగ్యులర్/ కాంట్రాక్ట్/ డిప్యుటేషన్ ప్రాతిపదికన 36 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 17, 18, 19. వివరాలకు www.rgca.org.in చూడొచ్చు. ఫుడ్ టెక్నాలజీ సంస్థలో బోధనేతర సిబ్బంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్.. ల్యాబ్ ఇన్చార్జ (ఖాళీలు-2), ల్యాబ్ టెక్నీషియన్ (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 27. వివరాలకు www.niftem.ac.in చూడొచ్చు. భువనేశ్వర్ ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.iitbbs.ac.in చూడొచ్చు. మైసూర్ పేపర్ మిల్స్‌లో కన్సల్టెంట్లు ద మైసూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ (ఎంపీఎం).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. వయసు 26 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు www.mpm.co.in చూడొచ్చు. భారత నావికాదళంలో సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు ఇండియన్ నేవీ.. పర్మనెంట్, షార్ట సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి అవివాహిత పురుషులు/స్త్రీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 25 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది 24. వివరాలకు www.joinindiannavy.gov.in చూడొచ్చు. అలరిస్తున్న టెక్నోజియూన్ కాజీపేట రూరల్: వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో జరుగుతున్న టెక్నోజియూన్-15 సంబురాలు అలరిస్తున్నారుు. ఈ మేరకు రెండో రోజు శనివారం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు రోబో ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. కాగా, సాయంత్రం వేళలో ఆటపాటలతో సందడి చేశారు. మధ్యాహ్నం వేళలో వెబ్‌నార్ ద్వారా ఇన్నో వెంటర్ ఆఫ్ ఈ-మెరుుల్ అండ్ సిస్టమ్స్ సైంటిఫిక్ డాక్టర్ శివ అయ్యదురై విద్యార్థులతో మాట్లాడారు. కాగా, ఆదివారం టెక్నోజియూన్ ముగియనున్నట్లు నిట్ అధికారులు తెలిపారు.