breaking news
Rajanna Sircilla district collectorate
-
దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడి అదృశ్యం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు దుబాయ్‌లో అదృశ్యమయ్యాడు. పది రోజులుగా అతని ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన ఆకెన రవి(36) పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడు. దుబాయ్‌లో మెరుగైన ఉపాధి లభిస్తుందనే ఆశతో సిరిసిల్లకు చెందిన మరో యువకుడు వేముల శ్రీనివాస్‌తో కలిసి విజిటింగ్ వీసాపై ఈనెల 17న అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులు, లేబర్ క్యాంపులు చూసి, పని దొరికే అవకాశం లేక పోవడంతో ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రవి కాటగలిశారు. అతని కోసం శ్రీనివాస్ తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో సిరిసిల్లలోని అతడి భార్య రూపకు సమాచారం ఇవ్వడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. రవి మిస్ అయినట్లు కేసు నమోదు చేయించిన ఎంబసీ అధికారులు అతడి కోసం పోలీసుల ద్వారా గాలించారు. సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు, సామాజిక సేవకులు గుండెల్లి నర్సింహులకు విషయం తెలియడంతో ఆయన తెలంగాణకు చెందిన వలస కార్మికుల ద్వారా ఆరా తీశారు. మొత్తంగా ఆదివారం షార్జాలో రవి ఉన్నట్లు గుర్తించారు.ఐదు రోజులుగా తిండిలేక.. నడవలేని స్థితిలో ఉన్న రవిని పోలీసులు గుర్తించి ఎంబసీ అధికారులకు అప్పగించారు. అతడి పాస్‌పోర్టును దుబాయ్ నుంచి రికవరీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో రవికి విమాన టిక్కెట్ సమకూర్చి ఇండియాకు పంపించారు. బుధవారం ఉదయం అతడు హైదరాబాద్ రానున్నారు. మరో యువకుడు వేముల శ్రీనివాస్ సోమవారం ఉదయం సిరిసిల్లకు చేరాడు. రవిని స్వదేశానికి రప్పించడానికి చొరవ చూపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రాక్ట్రర్పై బయటకు వచ్చిన కలెక్టర్ అనురాగ్ జయంతి
-
‘రాజన్న సిరిసిల్ల’లో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమావేశం కానున్నారు. తంగెళ్లపల్లి మండలంలోని మండెపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి, వాటి పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇదే గ్రామంలో ‘టైడ్స్’ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్)ను, సిరిసిల్ల మండలంలోని సర్దాపూర్‌లో వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించనున్నారు. సిరిసిల్ల మండలం రాగుడు గ్రామంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. రోడ్డు మార్గాన జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ రాకను పురస్కరించుకొని శనివారం ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఏర్పాట్లను సమీక్షించారు. -
తలాపునే జిల్లా కేంద్రం...
కండ్ల ముందుకొచ్చిన పాలన ఖుషీ...ఖుషీగా యువతరం వేములవాడ : ఇన్నేళ్లు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దూరభారం...వ్యయ ప్రాయాసాలు పడాల్సి వచ్చేది. కొత్త జిల్లా ఏర్పాటుతో ఆభారం తగ్గిందని జనం సంబరపడిపోతున్నారు. సమయం సరిపోక ఇబ్బందులు పడిన వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల ప్రజానీకానికి కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజన్నసిరిసిల్ల జిల్లా ఆవిర్భావం కావడంతో తలాపునే జిల్లా కేంద్రం వచ్చేసిందంటూ జనం సంబరపడిపోతున్నారు. మొన్నటి వరకు ఇక్కడ్నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 35 నుంచి 50 కిలో మీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది, ఇప్పుడా తిప్పలే లేదంటూ ఖుషీ...ఖుషీగా కనిపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎస్పీలతోపాటు ఇతర అధికారులను కలుసుకోవాలంటా ఇంటినుంచి హాయిగా భోంచేసి బయలుదేరే అవకాశాలు లభించాయని ఆనందపడుతున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగుల సంబరాలైతే ఆకాశన్నంటుతున్నాయి. అరవైయేండ్లుగా ఎదురుచూసిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జల్లాల ప్రక్రియను ముందేసుకుంది. 31 జిల్లాలను విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసింది. యువ ఆఫీసర్లను బాస్‌లుగా నియమించారు. ఇల్లు అలకగానే పండుగ కాదన్న చందంగా తొలి ప్రయత్నంలో కార్యాలయాలు హడావుడిగా ప్రారంభించిన ప్రభుత్వం, కార్యాలయాల్లో సిబ్బంది, పనితీరుపై దృష్టి సారించేందుకు చర్యలను ప్రారంభిస్తోంది. ఇప్పుడు జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కాస్త అందుబాటులోకి వచ్చేసిందనీ, సులువుగా తమ కష్టసుఖాలు చెప్పుకోవచ్చన్న ఆశ జనంలో పెరిగిపోయింది. వెనుకబడిన వేలాది కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేందుకు కొత్త జిల్లాలు ఎంతో ఉపయోగపడతాయన్న సంబురం పెరిగిపోయింది. పేదల మోముల్లో కాస్త ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మంచిపాలనకు శ్రీకారం..... జిల్లా కేంద్రం సమీపంలో ఉండటం వల్ల ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువవుతోందనీ, ఇంతేకాకుండా ప్రజలు సైతం తమతమ ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సులభతరమవుతోందన్న సదుద్దేశ్యంతో కొత్త జిల్లాలకు, నూతన పాలనావిధానానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్లా జిల్లా కేవలం 30 కిలో మీటర్ల పరిధిలోనే ఉండటంతో అంతా అలవోకగా జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం లభిస్తోంది. దీంతోపాటు వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ పరధులను ఏర్పాటు చేయడంతో గతంలో ఉన్న గ్రామాల సంఖ్య కుదింపు అయ్యింది. దీంతో ప్రభుత్వ పాలన మరింత సులభమవుతోందన్న వాదన వినవస్తోంది. అలాగే చందుర్తి మండలాన్ని రెండుగా విభజించారు. ఇందులో రుద్రంగా మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి పాలన కొనసాగించనున్నారు. అధికార యంత్రాంగం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, లేదా ప్రజల వద్దకే అధికారులు చేరుకోవాలన్న కాన్సెప్టుతో ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసింది. చిన్నజిల్లా... తక్కువ కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన 31 జిల్లాలలో చిన్నజిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లానే. కేవలం 2.50 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నట్లు ఎమ్మెల్యే రమేశ్‌బాబు దసరా రోజున ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించిన తరుణంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ జిల్లాలోని 2.50 లక్షల కుటుంబాల వివరాలు మొత్తం జిల్లా కలెక్టర్ కంప్యూటర్లలో నింపబడి ఉంటాయనీ, ఏ కుటుంబం ఆర్థిక స్థితి, వారి జీవన విధానం, విద్యా, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలను ఇందులో పొందుపరచనున్నారు. దీంతో జిల్లా పాలన మరింత శరవేగంగా వృద్ధిచెందే అవకాశాలు మెండుగా ఉంటాయన్న భావన ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. ప్రజలంతా కలసికట్టుగా పని చేసుకుంటూ తమతమ ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవాలనీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్, ఎస్పీ ఇక్కడే ఉంటారట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఇక్కడే ఉంటారంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. కలెక్టర్ వస్తురన్న విషయం ఇప్పుడిక కలెక్టర్, ఎస్పీ ఇక్కడే ఉంటారంటే మన సమస్యలు ఎంత త్వరగా తీరిపోతాయి. ఇది మంచి కార్యక్రమం. కొంత మందికి ఇబ్బందులు కలిగినా చాలా మందికి మాత్రం సంబరంగానే ఉంది. కొత్త జిల్లాల మన జిల్లా ముందంజలో ఉండాలి. పేదలకు సర్కూరు సేవలందాలి.... జనాభా ప్రాతిపదిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం మంచి పరిణామం. ఈ ప్రాంతంలోని నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందే అవకాశాలు పెరిగాయి. ప్రజలకు అధికార యంత్రాంగం వారి సేవలను మంచిగా అందించాలి. కార్యాలయాల చుట్టూ తిప్పుకునే సంస్క ృతి పోవాలి. ఇంత దగ్గరికి ప్రభుత్వ పాలన వచ్చినా... ఇంకా ఒక్కో పనికి రోజుల తరబడి తిరిగే పరిస్ధితి రావోద్దు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఈజీగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది.