breaking news
raithu mitra shop
-
నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?
దామరచర్ల : దామరచర్ల మండలం కొండ్రపోల్ రైతు మిత్ర ఎరువుల దుకాణంలో సోమవారం విజిలెన్స్ అధికారిగా హల్చల్ చేసిన వ్యక్తి.. ఈ నెల 23న హయత్ నగర్లో సోనీని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఒక్కరేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీ ఫార్మసీ విద్యార్థిని సోనీని రవిశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కిడ్నాపర్ వినియోగించిన లాంటి కారునే విజిలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తీ వినియోగించాడని సమాచారం. అయితే కారునంబర్లో మాత్రం తేడాలున్నట్లు తెలుస్తోంది. ఎరువుల దుకాణం నుంచి నగదుతో ఉడాయించిన సదరు వ్యక్తి రాష్ట్ర సరిహద్దు అయిన వాడపల్లి వంతెన ద్వారా ఏపీలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడంతో కిడ్నాపర్, విజెలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తి ఒక్కరేనా? అన్న దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
మందు కొడితే.... పంట పాడైంది!
- లబోదిబోమంటున్న రైతు - ఆదుకోవాలని విజ్ఞప్తి సంగారెడ్డి రూరల్ : చీడ పీడల నివారణ కోసం పత్తి పంటకు క్రిమిసంహారక మందు పిచికారి చేశాడు. తెల్లవారి వచ్చి చూసే సరికి పొలంలో ఉన్న పత్తిపంట ఆకులు ముడతపడి వాలిపోయింది. దీంతో ఎంతో ఆశపడి అప్పుచేసి సాగుచేస్తున్న పంట పాడవడంతో రైతు లబోదిబోమంటున్నాడు. రైతు కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉ న్నాయి. కలబ్‌గూర్‌కు చెందిన కంది సహకార సొసైటీ చైర్మన్ రవీందర్ తన పొలంలో పత్తిపంటను సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో చీడపీడల నివారణ కోసం సంగారెడ్డిలోని రైతుమిత్ర దుకాణంలో ఈ నెల 14న కార్బన్డిజం, ఇమిడాక్లోఫ్రైడ్ను కొనుగోలు చేసి ఆ మిశ్రమాన్ని రెండున్నర ఎకరాల పత్తిపంటకు పిచికారి చేశాడు. 15న వచ్చి పంటను పరిశీలించిన రవీందర్‌కు పొలంలో సగభాగం పత్తి మొక్కల ఆకులు ముడతపడి వాలిపోయాయి. దీంతో క్రిమిసంహారక మందు ఖాళీ డబ్బాలను తీసుకుని సంగారెడ్డిలోని డాట్ సెంటర్ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ను కలిసి పరిస్థితిని వివరించాడు. డబ్బాలను పరిశీలించిన శ్రీనివాస్ ఈ మందుకు బ దులు ఇతర మందులను పత్తిపై పిచికారి చేయాల్సిందని, యూరియాను నీటిలో కలిపి పిచికారి చేస్తే కొంతమేర మెరుగుపడే అవకాశం ఉందని సలహా ఇ చ్చారు. దీంతో తన పంట పాడై పోయిందని గ్రహిం చిన రవీందర్ తనను ఆదుకోవాలని వ్యవసాయ అధికారులకు మొరపెట్టుకున్నాడు.