breaking news
Railway facilities
-
రాష్ట్రానికి రెండు పారిశ్రామిక కారిడార్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మీదుగా వెళ్లే ప్రధాన రహదారుల వెం బడి రెండు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లో ఈ కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. గతేడాది ఈ రెండు కారిడార్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పంపించింది. ఆ తర్వాత కూడా సీఎం కేసీఆర్తో పాటు పరిశ్రమల శాఖ కేంద్రం వద్ద ఈ ప్రతిపాదనపై ప్రస్తావిస్తూ వచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పూర్తి స్థాయిలో కారిడార్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కారిడార్లలో చమురు శుద్ధి, చేనేత వస్త్ర పరిశ్రమలు, హస్తకళలు, కాగితం, మైనింగ్, ఇంజనీరింగ్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఈ కారిడార్ల వెంబడి రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే సౌకర్యాలు కూడా మెరుగవుతాయి. ఈ మార్గాల్లో హైస్పీడ్ రైళ్ల సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కారిడార్ వెంట ఉన్న రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుంది. -
'శ్రీవారి భక్తులకు మరిన్ని రైల్వే సౌకర్యాలు'
తిరుమల: తిరుమల తిరుపతి నుంచి షిర్డీకి మధ్య నూతన రైలు వస్తోంది. శనివారం రైల్వేమంత్రి సురేష్ ప్రభు తిరుపతి-షిర్డీ కొత్త రైలు ప్రారంభోత్సవం చేశారు. జెండా ఊపి నూతన రైలును ఆయన ప్రారంభించారు. రైలు ప్రారంభోత్సవం అనంతరం సురేష్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. తిరుపతి స్టేషన్ను మరింత అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అంతేకాక శ్రీవారి భక్తులకు మరిన్ని రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు.