breaking news
Railway employees 78-day wage
-
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
న్యూఢిల్లీ: రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్), రైల్వే రక్షక ప్రత్యేక దళం (ఆర్పీఎస్ఎఫ్) మినహా మిగిలిన నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో 11.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్టంగా రూ. 17,951 వరకు బోనస్ పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఉత్పాదకతను బట్టి ఇచ్చే ఈ బోనస్ కారణంగా రైల్వేపై రూ. 2,044.31 కోట్ల భారం పడుతుందని అంచనా. ఏటా దసరా పండుగకు ముందు ఉద్యోగులకు రైల్వే బోనస్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రైల్వే పనితీరును మెరుగు పరిచే దిశగా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఈ బోనస్ ఉపయోగపడుతుందని రైల్వే భావిస్తుంది. తిరుపతి, బరంపురంలలో: తిరుపతితోపాటు ఒడిశా రాష్ట్రం బరంపురంలో భారత విజ్ఞానవిద్య, పరిశోధన సంస్థ (ఐఐఎస్ఈఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు, శాశ్వత భవనాల నిర్మాణం కోసం మొత్తంగా 3074.12 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. 2021 చివరికల్లా తిరుపతి, బరంపురంలలో భవనాల నిర్మాణం పూర్తవుతుందనీ, ఈ విద్యాసంస్థల కోసం రెండు రిజిస్ట్రార్ ఉద్యోగాలను సృష్టించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటూ ఓ అధికారిక ప్రకటన వెలువడింది. అన్ని సదుపాయాలతో 1,17,000 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మితమయ్యే ఒక్కో క్యాంపస్‌లో 1,855 మంది విద్యార్థులకు సరిపోయేలా సౌకర్యాలు ఉంటాయంది. సైన్సు విద్యలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన బోధనను అందించేందుకు ఐఐఎస్‌ఈఆర్‌లను స్థాపిస్తున్నారు. మంత్రివర్గ ఇతర నిర్ణయాలు ► జాతీయ వృత్తి శిక్షణా మండలి (ఎన్సీవీటీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్డీఎస్ఏ)లను జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి (ఎన్సీవీఈటీ)లో విలీనం చేసే ప్రతిపాదనకు ఆమోదం. వృత్తి విద్య, శిక్షణకు సంబంధించిన సంస్థలను నియంత్రించే అధికారం ఎన్‌సీవీఈటీకి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, నాణ్యమైన కార్మికులను తయారుచేసేందుకు దోహద పడుతుందని కేంద్రం పేర్కొంది. ► పర్యావరణ పరిరక్షణలో సహకారం కోసం భారత్–ఫిన్లాండ్ల మధ్య జరిగిన ఒప్పందానికి, పర్యాటక రంగంలో రొమేనియాతో కుదిరిన మరో ఒప్పందానికీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
రైల్వే ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా సందర్భంగా ఈ ఏడాది కూడా 78రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ) కింద రూ. 2,044.31 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి రవిశంకర్‌ప్రసాద్ బుధవారం వెల్లడించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ లభించనుంది. దీని కింద ఉద్యోగులు తమ వేతనంతో పాటు రూ.17,951 అదనంగా బోనస్ కింద పొందనున్నారు. పీఎల్బీ బోనస్ కింద సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్) ఉద్యోగులకు ఇది వర్తించదు. -
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు ఈ ఏడాది కూడా 78 రోజల వేతనం దీపావళి బోనస్‌గా అందనుంది. నిధుల సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో కూడిన బోనస్‌గా 2013-14 సంవత్సరానికి ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. 2011-12, 2012-13 సంవత్సరాల్లోనూ రైల్వే శాఖ 78 రోజుల బోనస్‌నే ప్రకటించిన విషయం గమనార్హం. తాజా నిర్ణయంతో 11.5 లక్షల నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుండగా, రైల్వే శాఖపై రూ.800 కోట్ల భారం పడనుంది. కాగా, అర్హత కలిగిన ప్రతీ రైల్వే ఉద్యోగి సుమారు రూ.8,975 బోనస్‌గా పొందనున్నట్లు అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తెలిపారు. అయితే, ఈ ఏడాది ఆదాయం పెరిగిందని, మరింత బోనస్ ఉద్యోగులకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.