breaking news
radha cinema
-
చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు)
-
రాధా ప్రేమకథ
ప్రస్తుతం మారుతి టైమ్ నడుస్తోంది. యువతరం ఆలోచనలనే ప్రధానాస్త్రంగా చేసుకుంటూ దూసుకుపోతున్నారాయన. మరి అలాంటి దర్శకుడితో సీనియర్ హీరో సినిమా అంటే... అది నిజంగా ఆసక్తికరమైన విషయమే. మారుతి డెరైక్ట్ చేయబోతున్న సీనియర్ హీరో వెంకటేష్ అని తెలిసిందే. దర్శకుని స్కూల్లోకి చొరవగా చొచ్చుకుపోవడం వెంకటేష్ ప్రత్యేకత. సో... ఈ విషయంలో మారుతి నిజంగా అదృష్టవంతుడే. సినిమా పేరు ‘రాధా’ అని ఖరారు చేసి.. టైటిల్ నుంచే ఆసక్తిని రేకెత్తించారు మారుతి. పైగా ఈ సినిమా ఓ హోమ్ మినిస్టర్ ప్రేమకథ అనే విషయాన్ని గాలిలో వదిలి చేసి ప్రేక్షకుల్లోని ఆసక్తిని రెట్టింపు చేశారాయన. వెంకీ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అనే ఆసక్తితో ఉన్నారు. అందుకే... అది మొదలయ్యే డేట్‌ని కూడా ‘సాక్షి’కి ప్రత్యేకంగా చెప్పేశారు మారుతి. ఫిబ్రవరి 6న లాంఛనంగా పూజాకార్యక్రమంతో ‘రాధ’ చిత్రం ప్రారంభం కానుంది. నయనతార కథానాయికగా నటించనున్న ఈ చిత్రం... ఓ అద్భుతమైన ప్రేమకథ అని, వెంకటేష్ స్థాయికి తగ్గట్టుగా ఈ ప్రేమకథ ఉంటుందని మారుతి చెప్పారు. ఈ భిన్నమైన ప్రేమకథలో మంచి సందేశం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మార్చి నుంచి రెగ్యులర్‌గా చిత్రీకరణ జరుపుకునే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తామని మారుతి చెప్పారు.


