breaking news
racial attacks in us
-
సునయన శాంతి ర్యాలీ
హూస్టన్: అమెరికాలో జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన ఆయన సహోద్యోగులతో కలసి హూస్టన్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం కూచిభొట్ల 34వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కూచిభొట్ల పనిచేసిన కంపెనీ గార్మిన్ నుంచి హత్యకు గురైన బార్ వరకు సుమారు 3 కి.మీ మేర ఈ యాత్ర సాగింది. -
'ట్రంప్ వచ్చాకే దాడులు పెరిగాయి'
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే అక్కడ మన దేశీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడులపై లోక్‌సభ మలివిడత బడ్జెట్ సమావేశాలలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి అంశంపైనా ట్విట్టర్లో స్పందిస్తారని, మరి ఈ జాత్యహంకార దాడుల విషయంలో మాత్రం ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఖర్గే ప్రశ్నించారు. ప్రధాని వెంటనే ఈ అంశంపై సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలో భారతీయులకు భద్రత కరువైందని, అక్కడ మనవాళ్ల మీద జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. కాగా.. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడుల అంశాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, వచ్చేవారం ఈ అంశంపై సభలో ప్రకటన చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభకు తెలిపారు.