breaking news
R. surender reddy
-
29 నుంచి డీఎడ్ ప్రథమ సంవత్సరం పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో 2013-15 బ్యాచ్ డీఎడ్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ నెల 29 నుంచి జనవరి 2వ తేదీ వరకు జరుగుతాయని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఆర్.సురేందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 29న పేపర్ 1- ఎడ్యుకేషన్ ఇన్ ఎమర్జింగ్ ఇండియా, 30న పేపర్ 2 - ఎడ్యుకేషనల్ సైకాలజీ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, 31న పేపర్ 3 - ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్లానింగ్ మేనేజ్మెంట్ అండ్ టీచర్ ఫంక్షన్స్, జనవరి 1న పేపర్ 4 - పర్స్పెక్టివ్స్ ఇన్ ప్రైమరీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, 2వ తేదీన పేపర్ 5 - కెపాసిటీ బిల్డింగ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. -
11 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్
షెడ్యూలు జారీ చేసిన విద్యాశాఖ 11 నుంచి 14 వరకూ వెబ్ ఆప్షన్లు, 19న సీట్ల కేటాయింపు 27న తరగతులు ప్రారంభం డిసెంబర్ 2 నుంచి రెండోదశ, 27 నుంచి చివరి దశ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం విద్యాశాఖ ఎట్టకేలకు గురువారం షెడ్యూలు జారీ చేసింది. మొదటి దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 11 నుంచి చేపట్టనున్నట్లు ఈ మేరకు డైట్‌సెట్ (డీఈఈసెట్) చైర్మన్ డాక్టర్ జి.వాణీమోహన్, కన్వీనర్ ఆర్.సురేందర్‌రెడ్డి వెల్లడించారు. కళాశాలల జాబితా, ర్యాంకుల వారీ వివరాలు, ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం, ప్రక్రియను ఈ నెల 10వ తేదీన తమ వెబ్సైట్ (http://dietcet.cgg.gov.in)లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 11వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. డైట్‌సెట్-2013లో అర్హత సాధించిన దాదాపు 2.71 లక్షల మంది అభ్యర్థులు నాలుగు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల డీఎడ్ కోర్సులో కౌన్సెలింగ్ ద్వారా 30 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. మైనారిటీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేక షెడ్యూలు జారీ కానుంది. ఇదీ షెడ్యూలు... నవంబర్ 11 నుంచి 26 వరకూ మొదటి దశ కౌన్సెలింగ్ 11 నుంచి 14 వరకూ వెబ్ ఆప్షన్లు 19న సీట్ల కేటాయింపు 23 నుంచి 26 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 27న తరగతులు ప్రారంభం డిసెంబర్ 2 నుంచి 19 వరకూ రెండో దశ కౌన్సెలింగ్ 2 నుంచి 4 వరకూ వెబ్ ఆప్షన్లు 10న సీట్ల కేటాయింపు 16 నుంచి 19 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 27 నుంచి 30 వరకూ చివరి దశ కౌన్సెలింగ్ 27 నుంచి 29 వరకూ వెబ్ ఆప్షన్లు 30న సీట్ల కేటాయింపు