breaking news
Quality houses
-
తక్కువ ధర.. నాణ్యమైన ఇల్లే కావాలి..
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్‌లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి.ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.40 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ సిటీ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు. -
మన్నికగా కడితేనే.. మార్కెట్లో గిరాకీ!
సాక్షి, హైదరాబాద్: పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటిని కొనేందుకు ముందుకొస్తారు సామాన్యులు. అలాంటి వారికి నాణ్యమైన ఇళ్లను అందించడం బిల్డర్ల బాధ్యత. అందుకే ఎక్కడ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినా నిర్మాణంలో ఎలాంటి రాజీపడకుండా నాణ్యమైన నిర్మాణ సామగ్రినే వినియోగిస్తాం అంటున్నారు ట్రాన్స్‌కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. ఎండీ శ్రీధర్‌రెడ్డి. ఫిర్జాదిగూడలో ఎకరం విస్తీర్ణంలో ‘ప్రగతి అవెన్యూ’ పేరుతో ప్రీమియం అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 70. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ఎందుకంటే కొనుగోలుదారులందరి జీవన శైలి ఒకేలా ఉండాలి. భవిష్యత్తులో నిర్వహణ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు. రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, 270 గజాల్లో ల్యాడ్ స్కేపింగ్, అంపి థియేటర్, 4 వేల చ.అ. విస్తీర ్ణంలో క్లబ్ హౌస్, విశాలమైన పార్కింగ్, కార్ డ్రైవర్లకు ప్రత్యేకమైన రెస్ట్ రూములు వంటి సౌకర్యాలెన్నో కల్పిస్తున్నాం. చ.అ. ధర రూ. 2,650గా చెబుతున్నాం. 2015 మే కల్లా నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. భువనగిరిలో ఏరియా ఆసుపత్రి పక్కనే ‘ట్రాన్స్‌కాన్ లక్ష్మీ నరసింహా రెసిడెన్సీ’ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. 2 వేల గజాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 35 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,250. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాడ్ స్కేపింగ్‌లతో నివాసితులకు గాలి, వెలుతురు విశాలంగా వచ్చేందుకు వీలుగా ఫ్లాట్ల గోడకు గోడకు మధ్య ఆరున్నర ఫీట్ల స్థలాన్ని వదులుతున్నాం. టైల్స్, రంగులు, లిఫ్ట్, సిమెంట్, బాత్ రూమ్ ఫిట్టింగ్స్.. ఇలా నిర్మాణ సామగ్రి అంతా నాణ్యమైనవే వినియోగిస్తున్నాం.