-
‘బంగారు బుల్లోడు’ మూవీ రివ్యూ
టైటిల్ : బంగారు బుల్లోడు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : అల్లరి నరేశ్, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ : ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : రామబ్రహ్మం సుంకర దర్శకత్వం : పీవీ గిరి సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల ఎడిటర్ : ఎమ్. ఆర్. వర్మ విడుదల తేది : జనవరి 23, 2021 టాలీవుడ్లో ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేశ్ తరువాత ఆ రేంజ్లో సక్సెస్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న నరేశ్ ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి తన మార్క్ రెగ్యులర్ కామెడీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తొలి సినిమా ‘నందిని నర్సింగ్ హోమ్’తో సూపర్ హిట్ కొట్టిన గిరి పాలిక (పీవీ గిరి) దర్శకత్వంలో.. నందమూరి బాలకృష్ణ క్రేజీ టైటిల్ 'బంగారు బుల్లోడు'గా శనివారం (జనవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. మరి వినోదం అందించడంతో నరేశ్ సఫలం అయ్యాడా? అల్లరి నరేశ్ కెరీర్‌కు ఎంతో కీలకమైన బంగారు బుల్లోడు ప్రేక్షకులను ఆకట్టుకుందా..? అల్లరి నరేష్‌కు ఆశించిన విజయం దక్కిందా..?. మినిమమ్ గ్యారెంటీ హీరో ట్యాగ్ కి దూరమవుతున్న ఈ యంగ్ హీరో తిరిగి ఆకట్టుకున్నాడా? రివ్యూలో చూద్దాం. కథ సీతానగరం గ్రామంలో మావుళ్ళమ్మ తల్లి బాగా ఫేమస్. పెళ్లి కానివారు ఎవరు ఆమెకి మొక్కుకున్నా వెంటనే పెళ్ళైపోతుంది. కానీ అదే ఊర్లో ఉంటున్న భవాని ప్రసాద్(అల్లరి నరేశ్), అతని సోదరులకు మాత్రం పెళ్లిళ్లు కావు. దానికి కారణం భవాని ప్రసాద్ తాత గారు(తనికెళ్ళ భరణి) చేసిన ఓ తప్పిదమని భవాని ప్రసాద్ కి తెలుస్తుంది. తాత తప్పుడు సరిదిద్దాలని భవాని ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో భవాని ప్రసాద్ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అసలు ఇంతకీ తన తాతయ్య చేసిన తప్పు ఏమిటి ? ఈ క్రమంలో కనక మహాలక్ష్మి (పూజా జవేరి)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆమె అతని ప్రేమ కోసం ఏం చేసింది ? ఊర్లోని అమ్మవారి నగలకి భవాని ప్రసాద్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? తాత తప్పును మనవడు ఎలా సరిదిద్దాడు అనేదే మిగతా కథ. నటీనటులు కామెడీ స్టార్‌గా మంచి ఇమేజ్ ఉన్న నరేశ్ మరోసారి తన ఇమేజ్‌కు తగ్గ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బంగారు ఆభరణాలు కుదువ పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నరేశ్ ఒదిగిపోయాడు. అయితే పెద్దగా కొత్తదనం చూపించకుండా రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. తాత చేసే తప్పును సరిదిద్దే క్రమంలో వచ్చిన సనివేశాల్లో నరేశ్ బాగా నటించారు. హీరోయిన్ పూజ ఝవేరి కూడా కొన్ని చోట్ల ఓకే అనిపిస్తే, కొన్ని చోట్ల ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అలాగే మరో కీలక పాత్రల్లో నటించిన సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ కొన్ని కామెడీ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చారు. పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, పృథ్వి తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ ‘బంగారు బుల్లోడు’.. 1993లో వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. నందమూరి బాలకృష్ణ, రమ్య కృష్ణ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అప్పట్లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. అయితే 23 ఏళ్ల తర్వాత అదే టైటిల్‌తో నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో బాలయ్య సినిమా అంత హిట్ కావాలని అందరూ ఆశించారు. ఇక ప్రమోషన్లో భాగంగా ‘నా సినిమాలన్నిటిలో కామెడీ ఉంటోంది కథ ఉండడం లేదు, అందుకే ఈ సారి ఓ కథతో ఈ సినిమా చేసాను’ అని అల్లరి నరేశ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కానీ ప్రేక్షకుల అంచనాలను పీవీ గిరి అందుకోలేకపోయాడు. చెప్పినట్లుగానే సినిమాలో మంచి కథ, ఎమోషన్ ఉంది. కానీ ఆ ఎమోషన్ని అల్లరి నరేశ్‌తో బాలెన్స్ చేయడంలో పీవీ గిరి విఫలమయ్యాడు. అలాగే కామెడీ కూడా అంతగా లేకపోవడం సినిమాకు మైనస్. కథనంలో కొత్తదనం లేదు. క్లైమాక్స్ భాగాన్ని మినహాయిస్తే.. మొత్తం సినిమా అంత ఆసక్తిగా సాగదు. సాయి కార్తీక్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.స్వాతిలో ముత్యమంత సాంగ్ మాత్రం కాస్త అలరిస్తుంది. అప్పట్లో ఈ సాంగ్‌ని ఎస్పీ బాలు, చిత్ర పాడారు కాబట్టి ఒరిజినల్ ఫ్లేవర్‌ని అయితే తీసుకురాలేకపోయారు యువ గాయకులు. కాకపోతే ఈ క్లాసిక్ సాంగ్‌ని ఒకసారి గుర్తు చేసుకునేలా చేశారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె వాతావరణాన్ని బాగా చూపించి సినిమాకి ఆ ఫీల్ ని బాగా తెచ్చారు. ఎడిటర్ కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. -
సినిమా చూశాక ఆయన కంట్లో నీళ్లొచ్చాయి
‘‘సినిమా విడుదల ముందు వరకూ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ ఉండేది. సినిమా విడుదలయ్యాక చాలా బాగుందని, స్క్రీన్‌ప్లే ఇంకా బావుందని ప్రేక్షకులు అంటుంటే ఆనందం వేసింది’’ అని దర్శకుడు పీవీ గిరి చెప్పారు. నవీన్ విజయ్‌కృష్ణ, నిత్య, శ్రావ్య ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాధాకిషోర్. జి, బిక్షమయ్య సంగం నిర్మించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ ఇటీవల విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈవీవీ సత్యనారాయణగారు, జనార్ధన మహర్షి దగ్గర అసిస్టెంట్‌గా చేశా. ‘బెండు అప్పారావ్’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ చిత్రాలకు కథ అందించా. నిర్మాత రాధాకిషోర్ నా కజిన్. ‘నందిని నర్సింగ్ హోమ్’ కథ, ఆ కథను నేను న్యారేట్ చేసిన విధానం నిర్మాతలకు నచ్చడంతో నన్నే దర్శకత్వం చేయమన్నారు. కథ విన్న సీనియర్ నరేశ్‌గారు, వారబ్బాయి నవీన్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఈ చిత్రం మొదటి ఆట చూసిన తర్వాత నరేష్‌గారి కళ్లలో నీళ్లొచ్చాయి. ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలు అడుగుతున్నారు. నా తదుపరి చిత్రం కథ సిద్ధంగా ఉంది. త్వరలో ఆ వివరాలు చెబుతా’’ అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement