breaking news
Pushkara baths
-
ఆరో రోజు..అదే రద్దీ
భూపాలపల్లి/కాళేశ్వరం: అష్టమి కావడంతో త్రివేణి సంగమ తీరానికి ఉదయం వేళ భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా, క్రమక్రమంగా పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరానికి ఆరవ రోజైన మంగళవారం భక్తులు పుష్కర స్నానాలకు వచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తజనం సరస్వతిçఘాట్‌కు చేరుకున్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి, నదీమాతకు విశేష పూజలు చేశారు. నదీ తీరంలోనే సైకత లింగాలను తయారు చేసి శివుడిని ప్రత్యేకంగా పూజించారు. ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 17 అడుగుల ఏకశిల సరస్వతీమాత, కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. 50 వేల మంది వరకు భక్తులు స్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనా వేశారు. గోదావరి నదిలోకి భక్తులు వెళ్లకుండా కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశాల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘాట్, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని చెప్పడంతో సిబ్బంది బ్లీచింగ్ చల్లారు. వర్షం పడితే రోడ్లు బురదమయం కాకుండా గ్రావెల్ చిప్స్ వేసి నీటిని చల్లుతున్నారు. ఎస్పీ కిరణ్‌ఖరే ట్రాఫిక్‌పై దృష్టి సారించారు. డివైడర్లు ఏర్పాటు చేసి పోలీసు ఫోర్స్‌తో వాహనాల నియంత్రణ చేపట్టారు. హైకోర్టు జడ్జి సృజన, ఎస్ఐబీ డైరెక్టర్ తరుణ్‌జోషి, ఇంటెలిజెన్స్ డీజీ శశిధర్‌రెడ్డిలు పుష్కర స్నానాలు చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. కాగా, ప్రతీరోజు సరస్వతి పుష్కరాల్లో రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తున్న నవరత్నమాలిక హారతిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నదీ హారతికి భారీ స్పందన రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం నుంచి హారతి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా, మంగళవారం రాత్రి నిర్వహించిన నవరత్నమాలిక హారతికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు. -
కాశీలో తెలుగు సంగమం గంగా పుష్కర్ ఆరాధన...ముఖ్య అతిధిగా మోదీ
-
వద్దనుకున్నవే భక్తులకు చేరువ!
– మొత్తం పుష్కర స్నానం చేసింది: 14,85,608 – సగటున రోజుకు పుష్కర స్నానం చేసిన వారి సంఖ్య: 1,23,800 – అత్యధిక భక్తులు పుష్కర స్నానం చేసిన ఘాట్, సంఖ్య : నెహ్రూ నగర్(3,29,369) – పుష్కర స్నానాలు అధికంగా చేసిన రోజు: 21వ తేదీ (2,83,583) – పిండ ప్రదానాలు చేసిన వారి సంఖ్య: 23 వేలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్కడ పుష్కర ఘాట్లు వద్దనుకున్నారు. మొదట్లో ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం నిర్మాణానికి వెనుకడుగు వేసింది. అయినప్పటికీ పుష్కర భక్తులు అక్కడికే మక్కువ చూపారు. జిల్లాలో నిర్వహించిన కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వం నిర్మించిన ఘాట్ల కంటే ప్రై వేటు ఘాట్ల వైపే ప్రజలు అధిక సంఖ్యలో అడుగులేశారు. ప్రజలకు చేరువలో ఉండటం.. స్నానం చేసేందుకు కూడా అనువుగా ఉండటంతో సామాన్య భక్తులంతా ముచ్చుమర్రి, నెహ్రూనగర్‌లోనే పుణ్యస్నానం చేసేందుకు ఆసక్తి కనపర్చారు. మొత్తం 12 రోజుల పుష్కర భక్తుల తాకిడి లెక్కలను పరిశీలిస్తే అర్థమవుతున్న విషయం ఇదే. మరోవైపు లింగాలగట్టులోని ఎగువ ఘాట్‌కు భక్తుల తాకిడి ఏమాత్రం లేకపోవడంతో ఆ ఘాటు కాస్తా వెలవెలబోయింది. ఇదే సమయంలో దిగువ ఘాట్ భక్తులతో కళకళలాడింది. మొత్తం మీద కృష్ణా పుష్కరాల్లో జిల్లావ్యాప్తంగా 14,85,608 మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. 144 సెక్షన్ విధించినా... ముచ్చుమర్రిలో సొంత నిధులతో పుష్కర స్నానానికి రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారు. అయితే, ప్రభుత్వం 144 సెక్షన్ విధించి పుష్కరస్నానాలు జరగనివ్వబోమని బీష్మించింది. మరోవైపు నెహ్రూనగర్‌లో ఘాటును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఘాటు ఏర్పాటుపై ప్రతిపాదనలను కాస్తా చివరివరకు జలవనరుల శాఖ పంపలేదు. చివర్లో పంపినప్పటికీ ప్రభుత్వం అనుమతించలేదు. అయితే, ఈ రెండు ప్రాంతాల్లో ప్రై వేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన ఘాట్లకే భక్తులు పోటెత్తారు. ఇక్కడ మొత్తం 5,47,243 మంది భక్తులు స్నానం ఆచరించారు. ఘాట్ల వారీగా పుష్కర స్నానాలు(12 రోజుల్లో) లింగాలగట్టు : 3,17,427 పాతాళగంగ : 3,28,558 సంగమేశ్వరం : 2,94,837 నెహ్రూనగర్ : 3,29,369 ముచ్చుమర్రి : 2,17,874 మొత్తం : 14,85,608 -
మూడోరోజు పోటెత్తిన భక్తజనం
* పుష్కర స్నానమాచరించి పులకించిన భక్తులు * ఆదివారం భారీగా తరలివచ్చిన వైనం సాక్షి, అమరావతి/శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి: కృష్ణా నదిలో పుష్కర స్నానం చేసి భక్తజనం పులకిస్తున్నారు. ఆదివారం, ఏకాదశి కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలకు తరలి వచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పుష్కర ఘాట్లు భక్తజనంతో నిండిపోయాయి. కృష్ణా బ్యారేజీ పై భాగంలోని దుర్గ, పున్నమి, భవానీ, పవిత్ర సంగమం ఘాట్లతోపాటు బ్యారేజీ దిగువన ఉన్న కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో జనం పోటెత్తారు. మధ్యాహ్నం కాస్త పలుచబడినా సాయంత్రం తిరిగి భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం మూడు గంటలకు 24,55,908 మంది భక్తులు రాష్ట్రంలో పుష్కర స్నానాలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క విజయవాడలోనే ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు 9,24,169 మంది స్నానాలు చేశారు. పవిత్ర సంగమం ఘాట్ మినహాయిస్తే మిగిలిన ఐదు ఘాట్లు రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లకు సమీపంలో ఉండటంతో భక్తులు నేరుగా నడుచుకుంటూ బ్యారేజీకి రెండు వైపుల ఉన్న ఘాట్లకు వెళ్తున్నారు. వీఐపీలు, పాస్‌లు ఉన్న వారి వాహనాలను నేరుగా ఘాట్ల వరకు అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్‌లు కూడా ఘాట్ల వరకు వస్తున్నాయి. పోలీసులు నిబంధనలు సడలించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. దుర్గమ్మను చూసేందుకు క్యూలైన్లలో గంటల తరబడి నడవాల్సి వస్తోందని, దుర్గాఘాట్ ఎదురుగా ఉన్న క్యూలైన్ నుంచి లోపలికి పంపించాలని భక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు అధికారులు గుడిపైకి పంపిస్తున్నారు. మూడో రోజు రాత్రి 7 గంటల వరకు దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు 1.60 లక్షల మంది ఉన్నారని ఆలయ అధికారులు తెలిపారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో భక్తులు ఎక్కువ మంది స్నానాలు చేశారు. శ్రీశైలంలో .... శ్రీశైలంలో రోప్‌వేను అనుమతించడంతో పాతాళగంగలో స్నానం ఆచరించే భక్తుల సంఖ్య పెరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదివారం తెల్లవారుజామున పాతాళగంగలో పుణ్యస్నానం ఆచరించారు. అంతకుముందు పిండప్రదానం చేశారు. కాగా ఆదివారం నాడు సినీ ప్రముఖులు నిర్మాత అశ్వనీదత్, హీరో వడ్డే నవీన్, సినీ నటుడు కృష్ణుడు మాత్రమే ఇంతవరకు పుష్కరాలకు హాజరయ్యారు.