breaking news
purnachandra prasad
-
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రం
-
‘సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని మెజార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన క్యాబినేట్ సమావేశం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోవడ ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నకోబడిన ప్రభుత్వమన్నారు. మండలిలో పెట్టిన బిల్లులన్నింటినీ ప్రతిపక్షం తిరస్కరించిందని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మండలి రద్దవుతుందన్న బాధ కంటే ఆయన కుమారుడు లోకేష్‌కు ఉద్యోగం పోతుందనే బాధ ఎక్కువైందన్నారు. మండలి చైర్మన్‌కు విచక్షణ అధికారాలు ఉంటే... 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా విచక్షణ అధికారాలు ఉన్నాయన్నారు. ఇక మండలి రద్దును వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలుగా సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ: ఈ రోజు శాసన మండలి రద్దుకు క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుకు పట్టడం లేదని, వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లు అడ్డుకున్నారని, గిరిజనులు, దళితుల అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అదేవిధంగా ఆంగ్లభాషా బిల్లును కూడా అడ్డుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ: శాసన మండలి రద్దు నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా శాసన మండలిలో టీడీపీ వ్యవహరిస్తోందని, ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకుందని మండిపడ్డారు. కాగా పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రతి ఒక్కరు సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. -
యథా నేత... తథా మేత
‘యథారాజా తథా ప్రజా’ అని ఊరకే అనలేదు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ అధినేత నుంచి కింది స్థాయి వరకు ‘అవినీతి మా జన్మహక్క’న్నట్టుగా చెలరేగిపోయారు. ఇందుకు దేవస్థానాలనూ మినహాయించలేదు. పాపభీతిని పక్కన పెట్టేసి పైసాయే పరమాత్మంటూ చెట్టాపట్టాలేసుకుంటూ చేతివాటాలకు దిగారు. ‘వడ్డించేవాడు మనోడైతే భయమెందు’లకనే ధీమాతో కోట్ల రూపాయలు వెనకేసుకోడానికి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పరుగులు తీశారు. వచ్చే సర్కారు తమదే అనే అహంకారంతో ఆ అవినీతిని మరింత విస్తరింపజేసే క్రమంలో వారి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్సార్సీపీ సర్కారు అధికారం చేపట్టడంతో ‘పచ్చ’ తిమింగలాల పరిస్థితి గందరగోళంగా మారింది. సాక్షి, రాజమహేంద్రవరం : అవినీతి రహిత పాలనే ప్రధాన అజెండాగా నడుస్తున్న వైఎస్సార్సీపీ సర్కారు గత ప్రభుత్వంలో అవినీతిపరులపై దృష్టిని సారించింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితోపాటు జిల్లా మంత్రులు కూడా ఇదే బాట పడుతున్నట్టు ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశం ద్వారా ప్రత్యక్షంగానే హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లాలో పలు ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ కూడా ముగిసిన ఇద్దరిపై వేటు వేయడానికి రంగం సిద్ధమయింది. ఉన్నతాధికారుల ముందుకు వెళ్లిన తొలి జాబితాలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు, అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న పీఆర్ఓ తులా రాము ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలను ప్రసన్నం చేసుకుని వీరిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ప్రభుత్వం మారినా పాత పంథా వీడకపోవడంతో వీరిద్దరిపై నిర్వహించిన విచారణ పూర్తయింది. దీంతో చర్యలకు సిఫార్సు చేస్తూ మూడు రోజుల కిందటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. ప్రిన్సిపాల్ వేధింపుల పర్వం... రాజమహేంద్రవరం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపుల వ్యవహారంపై విచారణ మొదలు పెడితే చివరకు కాలేజీలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ‘తీగ లాగితే డొంక కదిలినట్లుగా తవ్వేకొద్దీ అవకతవకల పుట్ట బయటపడిందని సమాచారం. కాలేజీలో పనిచేస్తున్న 17 మంది మహిళా అధ్యాపకులు పనిచేసే ప్రాంతంలో మానసిక వేధింపులపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడం, అధ్యాపకులు తమ గోడు స్త్రీ, శిశు సంక్షేమం, విద్యాశాఖా మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో తీవ్రంగా పరిగణించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ డైరెక్టర్ నగేష్‌కుమార్ కళాశాలలో విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. అధ్యాపకుల వేధింపులే కాకుండా కళాశాలలో పలు అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గడచిన మూడున్నరేళ్లుగా అరాచకాలు చేస్తున్నా సంబంధితాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ఫీజుల్లో రాయితీలు ఇవ్వకుండా అక్రమ వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ ధర కంటే అదనంగా యూనిఫారాలు విక్రయించడంలోనే పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని నిగ్గు తేలిందని సమాచారం. కళాశాల రికార్డులను సీజ్ చేసి విచారణ అధికారులు వారి వెంట తీసుకువెళ్లారు. ఇది చదవండి : మహిళా అధ్యాపకులపై ప్రిన్సిపల్ వేధింపులు మాయమైన రంగూన్ కలప... బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనంలో కలపను కూడా ప్రిన్సిపాల్ హయాంలో మాయమైందని గుర్తించారు. ఇది ఒకప్పుడు ప్రిన్సిపాల్ కార్యాలయంగా వినియోగించే వారు. ఈ భవనాన్ని రంగూన్ కలపతో 10 గదులతో నిర్మించారు. ఈ భవనం అంతా పూర్తిగా ఖరీదైన కలపతో నిర్మించినదే. ఉడెన్ స్టైర్‌కేస్, టేకుతో తయారుచేసిన పైకప్పుతో పాతబడి పోయిన ఈ భవనాన్ని నేలమట్టం చేసేసి అందులో కలప ఏంచేశారో తెలియని పరిస్థితి. ఎంత తక్కువ లెక్కలేసినా రూ.50 లక్షలు పైమాటేనంటున్నారు. కలపతోపాటు కళాశాల ఆవరణలో ఉన్న పెద్ద, పెద్ద చెట్లను కూడా విక్రయించి సొమ్ము జేబులో వేసుకున్నారని విచారణలో నిగ్గు తేలిందని సమాచారం. విచారణ ఎంతవరకూ వచ్చిందనే అంశంపై రాజమహేంద్రవరం ఆర్జేడీ నగేష్‌కుమార్‌ను సంప్రదించగా అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందచేశామన్నారు. ఇంతకుమించి తాము మాట్లాడలేమని, నిర్ణయం ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. భగవంతుని సన్నిధిలో... దాదాపు ఇదే పరిస్థితి అన్నవరం సత్యదేవుని దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తులా రాము వ్యవహారం అని చెప్పుకోవచ్చు. సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగా ఉద్యోగం పొందడం, డిస్మిస్ అయి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే రెండు పదోన్నతులు పొందడం, సత్యదేవుని సన్నిధిలో అన్నింటా పెత్తనం చెలాయిస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా మెట్ట ప్రాంత ఎమ్మెల్యేల అండదండలతో అనేక అవకతవకలు, ఇష్టానుసారం కొండపై పెత్తనం చెలాయించారని ఎమ్మెల్యే పర్వత సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు దేవదాయశాఖ కమిషనర్ మన్మోహన్సింగ్ను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రీజినల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథ్ సర్వీసు రూల్స్‌కు వ్యతిరేకంగా పోస్టింగ్, రెండు పదోన్నతులకు సంబంధించి కాగితపూర్వక ఆధారాలు, రికార్డులు, పలువురు ఈఓలు, అధికారులను రాజకీయ పలుకుబడితో పెత్తనం చెలాయించే వ్యవహారశైలిపై స్థానికులు, ఉద్యోగుల అభిప్రాయాలతో దేవదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు రెండు, మూడు రోజుల్లో చర్యలు వెల్లడించనున్నారు. -
నమ్మించి..నట్టేట ముంచాడు!
ప్రియుడు పెళ్లాడే వరకూ దీక్ష విరమించేది లేదు.. ♦ రెండో రోజుకు చేరిన యువతి వెంకట రమణ మౌనదీక్ష ♦ బాధితురాలికి అండగా మహిళా, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ♦ చీరాలలో అర్ధరాత్రి మౌనదీక్ష శిబిరాన్ని పరిశీలించిన డీఎస్పీ జయరామరాజు చీరాల : ‘ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు.. నాకు న్యాయం జరిగే వరకూ మౌనదీక్ష విరమించేది లేదు’ అని ప్రియుని చేతిలో మోసపోయిన యువతి వెంకట రమణ తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్ కళాశాల లెక్చరర్ చేతిలో మోసపోయిన ఆమె.. చీరాలలోని అతడి ఇంటి ముందు శనివారం నుంచి చేపట్టిన మౌన దీక్ష ఆదివారానికి రెండో రోజుకు చేరుకుంది. ఆమెకు పలు రాజకీయ, మహిళా, ప్రజా సంఘాల నాయకులు అండగా నిలిచారు. బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలేనికి చెందిన ఇంజిరింగ్ విద్యార్థిని గుమ్మా వెంకట రమణ.. చీరాల వీరరాఘవపేటలో నివసించే కూరపాటి వెంకట పూర్ణచంద్ర ప్రసాద్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి వెంకట రమణను లోబరుచుకుని పెళ్లి చేసుకుంటాటనని మోసగించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు మౌనదీక్షకు దిగింది. ఆమె ప్రియుడు, ఇతర కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయినా ఆమె అర్ధరాత్రి కూడా ప్రియుని ఇంటిముందే దీనంగా కూర్చుని దీక్ష కొనసాగించింది. ఆ సమయంలో చీరాల డీఎస్పీ జయరామరాజు సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించారు. తనకు న్యాయం చేయాలని ఆమె డీఎస్పీని కోరింది. డీఎస్పీ ఆదేశాల మేరకు మౌనదీక్ష చేస్తున్న వెంకట రమణకు చీరాల ఒన్‌టౌన్ పోలీసులు రక్షణ కల్పించారు. బాధితురాలికి సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబు, నాయకులు సుదర్శన్, హరికృష్ణ, మస్తానమ్మలతో పాటు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఐ.లక్ష్మీశేషు, సీఐటీయూ నాయకుడు బాబూరాావు, మహిళా మండలి ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు పి.నందా మద్దతు పలికారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెళ్లి చేసుకునే వరకూ దీక్ష విరమించను : వెంకట రమణ నన్ను ప్రేమించి మోసం చేసి అన్యాయం చేసిన పూర్ణచంద్రప్రసాద్‌తో నా పెళ్లి జరగాలి. అప్పటి వరకూ మౌన పోరాటం ఆపను. ఈ సంఘటనలో పోలీసులు కూడా నిందితుని పక్షానే నిలిచి నాకు అన్యాయం చేశారు. నాకు మోసగించిన యువకునితో పది మందిలో పెళ్లి జరగాలి. లేకుంటే ఆందోళననను మరింత ఉధృతం చేస్తా.