breaking news
pulse polio programme
-
కశ్మీర్లో కలకలం: పోలియో ప్రకటనపై పాక్ నినాదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖలో ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపింది. అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ఒక కరపత్రంలో పొరుగు దేశానికి సంబంధించిన నినాదం కనిపించడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక అనధికారిక పోలియో నినాద పత్రంపై జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే నినాదంతో కూడిన ఈ వివాదాస్పద కరపత్రం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో, ఉన్నతాధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి అత్యవసర విచారణకు ఆదేశించారు.రాజౌరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్-2026కు సంబంధించిన ఒక ప్రకటన సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవ్వడాన్ని గుర్తించారు. ఈ కరపత్రం బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ) కార్యాలయం ద్వారా అధికారికంగా ప్రచురించినట్లు ఉంది. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజౌరి సీఎమ్ఓ, సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్‌కు తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.ఈ కరపత్రాన్ని పరిశీలించిన అధికారులకు అందులో నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ లోగోతో పాటు ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే టెక్స్ట్ కనిపించింది. ఈ లోగో లేదా నినాదానికి జమ్ముకశ్మీర్ ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యా విభాగంతో కానీ, లేదా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ పత్రంలో సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ పేరు, అధికారిక హోదా స్పష్టంగా ముద్రించి ఉండటం గమనార్హం.ఇది కూడా చదవండి: ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా? -
పల్స్ పోలియో కార్యక్రమంలో సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ భాగమయ్యారు. -
మహమ్మారిపై మరోసారి పోరు
సాంబమూర్తినగర్ (కాకినాడ) :జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులు జిల్లాలో 5,30,884 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. సంచార జాతులు, మత్స్యకారవాడలపై ప్రత్యేకదృష్టి సారించనున్నారు. పల్స్ పోలియో నిర్వహణకు జిల్లాలో 7,520 మంది వైద్య, ఏడు వేల మంది అంగన్వాడీ, ఐకేపీ, డ్వాక్రా యానిమేటర్లను 11 రూట్లలో నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,112, పట్టణాల్లో 594, గిరిజన ప్రాంతంలో 876 పోలియో చుక్కల బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఆయా బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయడమే కాకుండా సోమ, మంగళ వారాల్లో ఇంటింటా సర్వే నిర్వహించి పోలియో చుక్కలు వేసేలా కార్యాచరణ రూపొందించారు. రాజమండ్రిలో బుధవారం కూడా పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలో 149 హైరిస్క్ ప్రాంతాలలో 26,273 కుటుంబాల్లో 10, 496 మంది ఐదేళ్లలోపు చిన్నారులున్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వారందరికీ పూర్తిస్థాయిలో పోలియో చుక్కలు వేయాల్సిందిగా సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలియో చుక్కలు ప్రతి చిన్నారికీ అందించేందుకు సుమారు ఏడు లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 8 గంటలకు కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహకల్పలోని దుర్గాదేవి గుడి వద్ద కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అనిత తెలిపారు. కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ఆయా రూట్లలో ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. పలుమార్లు అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశాలు ఏ ర్పాటు చేశామని, ర్యాలీలు, కరపత్రాలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం చేశామని చెప్పారు. జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించడాన్ని వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాకినాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో శనివారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి ప్రారంభించారు. విద్యార్థులు పోలియో చుక్కలు వేయించాలని నినదించారు.


