breaking news
Pujabhat
-
ప్రతి అడుగూ విలువైనదే
కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. మహేశ్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా ‘సడక్ 2’. మహేశ్‌భట్ దర్శకత్వంలోనే 1991లో వచ్చిన ‘సడక్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యారు ఆలియా. ‘‘సడక్ 2’ సెట్స్‌పైకి వెళ్లింది. మా నాన్నగారు (మహేశ్ భట్) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అపారమైన, అందమైన, ఓ ఎమోషనల్ పర్వతాన్ని ఎక్కబోయే చిన్న ఎలుకగా నన్ను నేను ఊహించుకుంటున్నాను. నేను ఈ పర్వత శిఖరాన్ని చేరుకోగలనని అనుకుంటున్నాను. ఇది అనుకున్నంత ఈజీ కాదని తెలుసు (తండ్రి డైరెక్షన్లో, సీనియర్స్‌తో కలిసి నటించడాన్ని ఉద్దేశించి). ఒకవేళ మధ్యలో నేను పడిపోతే తిరిగి పుంజుకోగలననే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం వేసే ప్రతి అడుగూ విలువైనదే’’ అని ఆలియా అన్నారు. తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నారు ఆలియా. ఇక దాదాపు 20ఏళ్ల తర్వాత ‘సడక్ 2’ సినిమా కోసం మహేశ్ భట్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. 1999లో వచ్చిన ‘కారతూష్’ చిత్రం తర్వాత మహేశ్ భట్ ఇంకో సినిమాకు దర్శకత్వం వహించలేదు. -
ఇలా అయితే... కష్టమే సుమీ!
గాసిప్ నటిగా మాత్రమే కాదు... మోడల్‌గా, దర్శక, నిర్మాతగా తన ప్రతిభ చాటుకుంది పూజాభట్. ‘డాడీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూజా... సడక్, ప్రేమ్ దివానే, బార్డర్... మొదలైన చిత్రాలతో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘తమన్నా’ సినిమాకు జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. అయితే తెర వెనుక ఎన్ని పాత్రలు పోషించినా... తెర మీద కనిపించడానికే ఆమె ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘‘నేను నటించడానికి రెడీ’’ అని మళ్లీ పూజాభట్ ప్రకటించింది! నటించడం సరే, మరి ఆమె ఎలాంటి పాత్రల్లో కనిపించాలనుకుంటోంది? హీరోయిన్గా కష్టం! హీరో తల్లిగా నటించడానికి ఆమె ఒప్పుకోవడం కూడా కష్టం !!బాలీవుడ్ మాజీ హీరోయిన్ రీతూ శివపురి అయితే పదమూడు సంవత్సరాల తరువాత కూడా మళ్లీ తెరపై కనిపించడానికి రెడీ అయ్యింది. ‘‘తల్లిగా, అక్కగా, వదినగా... ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధం’’ అని కూడా ప్రకటించింది.అయితే పూజాభట్ మాత్రం తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటోందో... ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో దర్శక, నిర్మాతలు కన్ఫ్యూజ్కు గురవుతున్నారట. ఒకరిద్దరు దర్శకులు తమ సినిమాలో నటించమని అడిగితే, పాత్ర నచ్చక చేయనని చెప్పిందట.‘‘మళ్లీ నటించడం సంగతేమిటోగానీ, ఆమెను ఒప్పించడానికి తలప్రాణం తోకకు వచ్చేలా ఉంది’’ అని గొణుక్కుంటున్నారట దర్శక, నిర్మాతలు. కొందరైతే- ‘‘ఇలా అయితే కష్టమే..’’ అని పూజా ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఇంతకీ... ఎలాంటి పాత్రలు చేయడానికి పూజాభట్ ఇష్టపడుతుంది?!