breaking news
publishes
-
కాంగ్రెస్ హామీలకు కేసీఆర్ రాజముద్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాజముద్ర వేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్, అనిల్‌కుమార్‌యాదవ్, చామల కిరణ్‌రెడ్డిలతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. తమ ఆరు గ్యారంటీలను సాధ్యం కాదని చెప్పిన బీఆర్ఎస్ నేతలు తాజాగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత ఇక ఆ మాటలు మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ చిత్తుకాగితంగా చూస్తుందని, దానిపై పెద్దగా చర్చ అవసరం లేదని చెప్పారు. సారా పాటల్లా ఉంది మహాలక్ష్మి పథకం కింద తాము రూ.2,500 మహిళలకు ఇస్తామని చెపితే కేసీఆర్ రూ.3వేలు చెప్పారని, రూ.500కే గ్యాస్సిలెండర్ ఇస్తామంటే ఆయన రూ.400 చెప్పారని, పింఛన్లు రూ.4వేలు ఇస్తామని తాము చెపితే ఆయన రూ.5వేలు చెప్పారని, రైతుబంధు కింద తాము రూ.15వేలు ఇస్తామంటే కేసీఆర్ రూ.16వేలు చెప్పారని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పిన మాటలు చూస్తుంటే గతంలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టు సారా పాటల్లా చెప్పారని, మూడోసారి అనకుండానే పెద్దలోయలో పడిపోయారన్నారు. రాష్ట్రమే కాదని, కేసీఆర్ బుర్ర కూడా దివాళా తీసిందని, బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో చూపించినట్టు మేనిఫెస్టో ప్రకటించారని విమర్శించారు. కేసీఆర్ లాగా తాము ఉత్తుత్తి హామీలను ఇవ్వలేమని, ఆరు గ్యారంటీలను అమలు చేయగలమనే నమ్మకంతోనే ప్రకటించామని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్హామీలు ఆచరణ సాధ్యమేనని కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ‘కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నా. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి. ఈ పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఈనెల 17న మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలి. ఇద్దరం ప్రమాణం చేద్దాం.’అని అన్నారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలి రాష్ట్రం నిజంగా దివాళా తీయకపోతే ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పింఛన్లను ఒకటో తేదీన ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను చూసిన తర్వాత కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ ముందుగానే అంగీకరించి కాడి కిందపడేశారని చెప్పారు. ‘కేసీఆర్ మీ పాలనకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఆలోచన శక్తిని కూడా మీరు కోల్పోయారు.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి.’అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
భారీ పన్ను డిఫాల్టర్ల జాబితా జారీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ఆదాయపన్ను శాఖ తాజాగా జాబితా విడుదల చేసింది. భారీగా పన్ను ఎగవేత దారులు నేమ్ అండ్ షేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ అవమాన వ్యూహంలో భాగంగా రూ .10 కోట్లకుపైగా పన్నులు చెల్లించని ఢిల్లీకి చెందిన ఐదు సంస్థల పేర్లను ప్రచురించింది. ఆదాయ పన్ను,కార్పొరేట్ టాక్స్ చెల్లించాల్సిన జాబితాను ప్రధాన జాతీయ జాతీయ దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలోఐటీశాఖ విడుదల చేసింది. "పన్ను బకాయిలు వెంటనే" చెల్లించాలని కోరింది. పన్ను శాఖ యొక్క పాలసీ యంత్రాంగం ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డు (సిబిడిటి) గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ అవమాన పథకాన్ని ఆదాయం పన్ను శాఖ ప్రారంభించింది. ఈ క్రమంలో గతంలో 96 సంస్థలు గుర్తించింది. ఇవి గుర్తించలేకుండా లేదా రికవరీ కోసం ఎలాంటి ఆస్తులు లేకుండా మిగిలిపోయాయి. ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జారీ చేసిన ఒక నోటీసు లో ఈ జాబితాను వెల్లడి చేశారు. పాన్ కార్డు సంఖ్య, చివరిగా తెలిసిన చిరునామా, అంచనా పరిధి , పన్ను చెల్లించని మొత్తాన్ని, వ్యక్తిగత, సంస్థల వివరాలతో వెల్లడించినట్టు ఐటీ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ సంస్థల చిరునామా, వ్యాపారం, వాటాదారుల నిర్వహణ మరియు నిర్వహణ వంటివి మారవచ్చు. ఈ సంస్థల గురించి సమాచారం తెలిసిన వారు, ఉపయోగకరమైన సమాచారం ఉంటే తమకు తెలియపర్చాల్సిందిగా కోరారు. కాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్లీన్‌మనీ వెబ్‌సైట్‌ను మంగళవారం ప్రారంభించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూర్చేలా , పన్ను చెల్లింపులకు ప్రజలను ప్రోత్సహించేలా ఈ పోర్టల్‌ను లాంచ్ చేసినట్టు చెప్పారు. ఈ డిఫాల్టర్ల పేర్లను తన అధికారిక వెబ్ సైట్ లో కూడా ప్రచురించడం ప్రారంభించింది.