Prolapse
-
గర్భసంచి జారడం అంటే...?
సాధారణంగా మహిళల్లో మధ్యవయసు దాటిన కొందరిలో ‘గర్భసంచి జారడం’ అనే మాట వినిపిస్తుంటుంది. మహిళల పొత్తికడుపులో గర్భసంచి అంటూ అందరూ సామాన్యంగా పిలిచే యుటెరస్‌తో పాటు పెద్దపేగు, మూత్రపు సంచి లాంటివి కూడా ఉంటాయి. ఇవి కాస్తంత జారిపోయి యోని పైభాగం మీద ఒత్తిడి కలిగిస్తూ మహిళల్లో తీవ్రమైన నొప్పినీ, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇలా పొత్తికడుపులోని యుటెరస్, పెద్దపేగు, మూత్రపు సంచి (బ్లాడర్) వంటి దేహ భాగాలు యోని పైభాగంలోకీ లేదా ఒక్కోసారి యోనిలోనికి జారిపోవడాన్నే వైద్యపరిభాషలో ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అని పేర్కొంటారు. అవి ఎందుకలా జారతాయో, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. నిజానికి మహిళల్లో తమ పొత్తికడుపులోని అవయవాలన్నీ చాలా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. పొత్తికడుపులోపల ఉండే గర్భసంచి వంటి అనేక అంతర్గత అవయవాలన్నీ ‘పెల్విక్ ఫ్లోర్’ అని పిలిచే ఓ పొర లాంటి కండరంపై ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ ‘పెల్విక్ ఫ్లోర్’ ఆ అంతర్గత అవయవాలను మోస్తూ ఉంటుంది.ప్రొలాప్స్కు మరికొన్ని కారణాలు పొత్తికడుపు అవయవాలు ఇలా కిందికి జారడానికి చాలా అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు వయసు పెరగడం వల్ల పెల్విక్‌ఫ్లోర్ కండరం బలహీనపడటం అనే ముఖ్యకారణంతో పాటు...→ బిడ్డలకు జన్మనివ్వడం (ఛైల్డ్ బర్త్) → రుతుక్రమం ఆగిపోవడం (మెనోపాజ్) → బరువు పెరగడం (ఒబేసిటీ) → తీవ్రమైన మలబద్ధకం (క్రానిక్ కాన్స్టిపేషన్)తో ముక్కడం వల్ల కొందరిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ (హిస్టరెక్టమీ) జరగడం... వంటి అంశాలు ప్రొలాప్స్కు కారణమవుతాయి. నివారణపెల్విక్ ప్రొలాప్స్ నివారణ చాలా పరిమితమైన మేరకే సాధ్యమవుతుంది. పెల్విక్ ఫ్లోర్ కండరాన్ని బలోపేతం చేసే ‘కెగెల్స్ ఎక్సర్సైజెస్’ అని పిలిచే పొత్తికడుపు వ్యాయామాలను చేయడం ద్వారా కొంతవరకు ఈ పరిస్థితిని నివారించవచ్చు. మలబద్ధకాన్ని నివారించేందుకు ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం, మంచి విసర్జక అలవాట్లు (గుడ్ టాయిలెట్ హ్యాబిట్స్... అంటే రోజూ ఒకేవేళకు మలవిసర్జనకు వెళ్లడం), స్థూలకాయాన్ని నివారించుకోవడం అంటే బరువు పెరగకుండా జాగ్రత్తపడటం, బరువైన వస్తువుల్ని అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తగా ఉండటం వంటి వాటితో పెల్విక్ ప్రొలాప్స్ను కొంతమేర నివారించవచ్చు. జారడం ( ప్రొలాప్స్) అంటే ఏమిటి, ఎందుకలా జరుగుతుందంటే...? మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కండరం బలహీనపడుతుంది. ఆ క్రమంలో ఒక్కోసారి పొత్తికడుపులో ఉండే అంతర్గత అవయవాలు ‘బలహీనపడ్డ’ ఆ పెల్విక్‌ఫ్లోర్ నుంచి జారి... యోనిలోకి గానీ లేదా యోని పైభాగంలోకి వచ్చేస్తాయి. ఇలా జారి కిందకు రావడాన్నే ‘్రపొలాప్స్’అంటారు. ఏ అవయవం జారిందో దాన్ని బట్టి ఆ జారిన ప్రక్రియకు ( ప్రొలాప్స్కు) ఆ పేరు పెడతారు. ఉదాహరణకు గర్భసంచి జారితే దాన్ని ‘యుటిరైన్ ప్రొలాప్స్’ అనీ, పెద్దపేగు జారితే ‘బవెల్ ప్రొలాప్స్’ అనీ, మూత్రపు సంచి జారితే ‘బ్లాడర్ ప్రొలాప్స్’ అని చెబుతుంటారు. సాధారణంగా వీటన్నింటినీ కలిపి ‘పెల్విక్ ఆర్గాన్స్’గా పేర్కొంటారు కాబట్టి అవి జారినప్పుడు... అలా జరడాన్ని ‘పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్’ అనే ఒక్క మాటతో సూచిస్తుంటారు. నిజానికి ఇవేవీ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే సమస్యలు కాదు. అయితే ఇలా జారడం వల్ల ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు తీవ్రంగా నొప్పి కూడా వస్తుంటుంది.చికిత్సకొన్ని జీవనశైలి మార్పులు అనుసరిస్తూ కొంతమందిలో హార్మోన్ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ కండిషన్‌ను డాక్టర్లు చక్కదిద్దడం జరిగినప్పటికీ... ఇలాంటి చర్యలతో అంతగా ఫలితం లేనప్పుడు జారిన అవయవాన్ని / అవయవాలను తిరిగి వాటి వాటి స్థానాల్లో అమర్చేలా శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సతో ఆయా అవయవాలను వాటి స్థానాల్లో తిరిగి అమర్చడం మాత్రమే ప్రొలాప్స్కు శాశ్వత చికిత్సగా చెప్పవచ్చు.డా‘‘ సరోజ బానోతు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ -
ప్రొలాప్స్ అంటే ఏంటి? నా ఈ సమస్యకు అదే కారణమా?
నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్లప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్లో ఎక్సర్సైజెస్తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్‌లో ప్రాలాప్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్‌తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్‌గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లినిక్‌లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ఆపరేషాన్!
ప్రొలాప్స్ ఆపరేషన్లలో తీవ్ర జాప్యం మూడు నెలలుగా నిరీక్షణ పట్టించుకోని వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు ఈమె పేరు చిన్నీరమ్మ. సొంతూరు సోమందేపల్లి మండలం సిద్ధకుంటపల్లి. పేగు జారడంతో ఇబ్బంది పడుతోంది. ప్రోలాప్స్ ఆపరేషన్ కోసం సర్వజనాస్పత్రిలో చేరింది. రెండు నెలలవుతున్నా ఆపరేషన్ చేయలేదు. అసలు చేస్తారో, లేదో కూడా తెలియడం లేదు.గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన అంకమ్మ కూడా ప్రోలాప్స్ ఆపరేషన్ కోసం రెండు నెలలుగా ఇదే ఆస్పత్రిలో నిరీక్షిస్తోంది. వైద్యుల కరుణ కోసం ఎదురుచూస్తూనే ఉంది. అనంతపురం అర్బన్ : చిన్నీరమ్మ, అంకమ్మ మాత్రమే కాదు.. ఇలా 18 మంది వృద్ధులు సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగంలో ఆరోగ్యశ్రీ కింద ప్రొలాప్స్ ఆపరేషన్ల కోసం చేరి ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ఏడు పదుల వయసు నిండినవారే. కొన్ని నెలలుగా ఆస్పత్రిలోనే మగ్గుతున్నా ఆరోగ్యశ్రీ అధికారులు గానీ, వైద్యులు గానీ పట్టించుకోవడం లేదు. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే 10-15 రోజుల్లో సర్జరీ చేస్తుంటారు. సర్వజనాస్పత్రిలో మాత్రం నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. వేరే రోగులు రాకుండా, ఆపరేషన్లు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. చిన్నాచితక కారణాలు చూపుతూ తప్పించుకుంటున్నారు. ఆస్పత్రిలోని మిగతా విభాగాలతో పోలిస్తే గైనిక్ విభాగంలో వైద్యులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ ఆపరేషన్లు సకాలంలో జరగడం లేదు. అనారోగ్యశ్రీ సర్వజనాస్పత్రిలో ఆరోగ్యశ్రీ సిబ్బంది తీరు వల్ల రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కిరణ్ సర్కారు 2012 ఏప్రిల్‌లో ప్రొలాప్స్‌తో పాటు అనేక ఆపరేషన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేద రోగులు గత్యంతరం లేక సర్వజనాస్పత్రిలో చేరుతున్నారు. వీరి పట్ల ఆరోగ్యశ్రీ అధికారులు ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. కేసులను ఎప్పటికప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు అప్రూవల్ కోసం హైదరాబాద్‌కు పంపాల్సి ఉంటుంది. ఈ విషయంలోనూ కాలయాపన చేస్తున్నారు. సిఫారసు ఉంటే తప్ప త్వరగా అప్రూవల్ కావడం లేదు. ఆరోగ్యశ్రీ విభాగంలో మంచాల కొరత కూడా తీవ్రంగా ఉంది. కేవలం ఎనిమిది మంచాలు ఉన్నాయి. వీటిపైనే చాలా మందిని సర్దుతున్నారు. విధిలేక కొంత మంది నేలపైనే పడుకుంటున్నారు. మాలాంటోళ్లకు తప్పదయ్యా ఆపరేషన్ కోసం వచ్చా సార్. పేగు జారిందంట. ఓవైపు నొప్పి వస్తోంది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో తెలియడం లేదు. మాలాంటోళ్లంటే అందరికీ చులకనే. ఇక్కడ ఉండబట్టి నెలన్నర కావస్తోంది. - నల్లమ్మ, సిండికేట్ నగర్, అనంతపురం 50 రోజులవుతోంది ఇక్కడికొచ్చి దగ్గర దగ్గర 50 రోజులవుతోంది. పొద్దున్నే లేయడం.. ఇక్కడే స్నానాలు చేయడం సరిపోతోంది. మంచం దొరికితే పైన పడుకుంటాం. లేకపోతే కిందనే గతి. - నారమ్మ, కందుకూరు, అనంతపురం రూరల్ టేబుళ్లు లేవు ఆపరేషన్ల కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. అక్కడికీఆలస్యం చేయడం లేదు. ఆపరేషన్ థియేటర్లో కనీసం టేబుళ్లు సరిగా లేవు. ఈ విషయంపై సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. - డాక్టర్ సంధ్య, గైనిక్ హెచ్ఓడీ త్వరలో చేయిస్తాం ఆపరేషన్లు వాయిదా పడుతున్న సంగతి నాకు తెలీదు. ఈ విషయాన్ని పరిశీలిస్తా. త్వరగా చేసేలా శ్రద్ధ చూపుతా. - డాక్టర్ ప్రవీణ్, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్


