breaking news
Private insurance organizations
-
ఐఐఆర్ఎం ‘బీమా’ రంగంలో ప్రత్యేకం..
ఇటీవల కాలంలో కలర్‌ఫుల్ కెరీర్‌కు ధీమాగా నిలుస్తున్న రంగం బీమా రంగం. ప్రైవేట్ బీమా సంస్థల ప్రవేశం.. ఈ రంగంలో ఎఫ్‌డీఐల పెంపు వంటి కారణాలతో సుశిక్షితులైన మానవ వనరుల ఆవశ్యకత ఏటా పెరుగుతోంది. ఈ అవసరాలను తీర్చే విధంగా హైదరాబాద్‌లో ఏర్పాటై.. ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన సంస్థ.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్(ఐఐఆర్ఎం)పై ఫోకస్... దేశంలో బీమా రంగ నిపుణులను తయారుచేసే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సంయుక్త ఒప్పందంతో 2002లో ఏర్పాటైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సంస్థ.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు బహుళజాతి సంస్థల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో జీవిత ధీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్లో కోర్సులను పరిశీలిస్తే.. అవి.. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో భవిష్యత్తుకు ధీమాగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. ఇన్స్టిట్యూట్ అందిస్తున్న కోర్సుల్లో ప్రవేశానికి బ్యాచిలర్ డిగ్రీ కనీస అర్హత. ఈ క్రమంలో నాలుగు కోర్సులను అందిస్తోంది. అవి.. ఏ ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ (జనరల్ అండ్ లైఫ్), ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్మెంట్. ఇవే విభాగాల్లో ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్లస్ అనే కోర్సులను అందిస్తోంది. అర్హత: ఏడాది వ్యవధిలో ఉండే ఈ కోర్సులకు కనీస అర్హత 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. బ్యాచిలర్ డిగ్రీ వరకు అకడెమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీటితోపాటు ఇన్సూరెన్స్ రంగంలో, విధుల్లో ఎంతో కీలక విభాగంగా పేరొందిన యాక్చుయేరియల్ సైన్స్‌కు సంబంధించి కూడా కోర్సును అందిస్తోంది. ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ యాక్చుయేరియల్ సైన్స్ పేరుతో అందించే ఈ కోర్సుకు మ్యాథమెటిక్స్ / స్టాటిస్టిక్స్ / ఎకనామిక్స్‌లలో ఒక సబ్జెక్ట్ ప్రధాన సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. - ఏటా ఆగస్ట్‌లో మొదలయ్యే అకడెమిక్ సెషన్‌కు మార్చి/ఏప్రిల్ నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. యాక్చుయేరియల్ సైన్స్ కోర్సు కోసం ప్రత్యేకంగా ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో శిక్షణ కోర్సుల్లో శిక్షణ విషయంలో ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌కు కూడా ఐఐఆర్ఎం ఎంతో ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో కోర్సు వ్యవధిలో నిర్ణీత కాలం ఇంటర్న్‌షిప్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది. ఫలితంగా విద్యార్థులకు క్షేత్ర స్థాయి అంశాలపై అవగాహన లభిస్తోంది. దూరవిద్య కోర్సులు కూడా ఐఐఆర్ఎం.. వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇన్సూరెన్స్ కెరీర్ ఔత్సాహిక అభ్యర్థులందరికీ అందుబాటులో ఉండే విధంగా దూరవిద్యా విధానంలోనూ మూడు కోర్సులను అందిస్తోంది. అవి.. - ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ - ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ - ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్మెంట్. దూర విద్య విధానంలో జనవరి 2015లో ప్రారంభమయ్యే కోర్సులకు ప్రవేశ ప్రక్రియ మొదలైంది. ఏడాది వ్యవధిలో రెండు సెమిస్టర్లుగా ఉండే ఈ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. రెగ్యులర్, డిస్టెన్స్ విధానాల్లోని కోర్సుల్లో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి లేకపోవడం ఔత్సాహిక అభ్యర్థులకు, ముఖ్యంగా కెరీర్ మార్పు కోరుకునే మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు బాగా కలిసొచ్చే అంశం. వెబ్సైట్: www.iirmworld.org.in వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ఇప్పటికే బీమా రంగంలోని ఆయా సంస్థల్లోని ఉద్యోగులకు ఆధునిక నైపుణ్యాలు అందించే విధంగా ఐఐఆర్ఎం కార్పొరేట్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తోంది. ఇవి.. సదరు సంస్థల ప్రతిపాదన మేరకు వేర్వేరుగా నిర్వహిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు ఇన్సూరెన్స్ కోర్సుల బోధన విషయంలో ఐఐఆర్ఎం పాటిస్తున్న ప్రమాణాల ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సొంతమైంది. చార్టర్డ్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ -లండన్ నుంచి ‘అక్రెడిటెడ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సెంటర్’ హోదాతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఫలితంగా ఐఐఆర్‌ఎంలో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సీఐఐ-లండన్ నిర్వహించే డిప్లొమా, ఏసీఐఐ పరీక్షల్లో కొన్ని పేపర్ల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ (లండన్), సొసైటీ ఆఫ్ యాక్చుయరీస్ (అమెరికా)ల గుర్తింపు కూడా ఐఐఆర్ఎం కోర్సులకు లభించింది. ఈ గుర్తింపు కేవలం రెగ్యులర్ విధానంలోని కోర్సులకే కాకుండా.. దూర విద్య విధానంలోని కోర్సులకూ వర్తింపజేయడం విశేషం. భారత్-శిక్షణ మన దేశంలో ఇన్సూరెన్స్ కోర్సుల శిక్షణలో ఎంతో చరిత్ర, గుర్తింపు కలిగిన ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఐఐఐ) -ముంబైతో దీటుగా ఐఐఆర్ఎం నిలుస్తోంది. ఐఐఆర్ఎం నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్‌ను.. ఐఐఐ-ముంబై అందించే ఫెలోఫిప్నకు సమానంగా ఐఆర్డీఏ గుర్తించడమే ఇందుకు నిదర్శనం. పరిశ్రమ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఈ ఇన్స్టిట్యూట్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పరిశ్రమ వర్గాల నుంచి ప్లేస్‌మెంట్స్ పరంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునెటైడ్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర ప్రముఖ సంస్థలెన్నో ఐఐఆర్‌ఎంలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ నిర్వహిస్తున్నాయి. కేవలం ఇన్సూరెన్స్ సంస్థలే కాకుండా సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా 95 శాతంపైగా ప్లేస్మెంట్ రికార్డ్‌తో.. రూ. 2.5 లక్షల కనిష్ట వేతనం, రూ. 5 లక్షల గరిష్ట వేతనంతో.. సగటు రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో ఇక్కడి విద్యార్థులు కొలువులు ఖాయం చేసుకుంటున్నారు. లోకల్ టు గ్లోబల్.. ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కారణం ఇక్కడి ఫ్యాకల్టీ, బోధన, శిక్షణ, లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తుండటమే. కేవలం స్థానిక అవసరాలనే పరిగణనలోకి తీసుకో కుండా అంతర్జాతీయంగా ఈ రంగంలో మార్పులను నిరంతరం విశ్లేషిస్తూ.. దానికి అనుగుణంగా శిక్షణపరమైన అంశాలను కూడా అప్డేట్ చేస్తున్నాం. దీనివల్ల విద్యార్థులకు గ్లోబల్ యాక్సెసబిలిటీ లభిస్తోంది. మరోవైపు రీసెర్చ్ యాక్టివిటీస్‌కు కూడా తగిన ప్రాధాన్యమిస్తున్నాం. దీంతో పరిశ్రమ వర్గాల్లో మంచి ఆదరణ, విద్యార్థులకు నైపుణ్యాలు అందుతున్నాయి. - పి. రాజేశ్వర రావు, సీఈఓ, ఐఐఆర్ఎం -
ఇన్సూరెన్స్ పేరుతో మోసం
ఇంకొల్లు, న్యూస్‌లైన్ : ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలు పేదల పాలిట శాపంగా మారాయి. రోజంతా కష్టపడి దాచుకున్న సొమ్మును కొందరు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఈ తరహా మోసం ఒకటి ఇంకొల్లులో బుధవారం వెలుగుచూసింది. ఓ ప్రముఖ సంస్థ లైఫ్ ఇన్సురెన్సు పేరిట ఇంకొల్లులో నెలకొల్పిన కార్యాలయం బోర్డు ఏడాదికే తిప్పేసింది. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. సంస్థ తాలూకా పత్రాలు పట్టుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక పర్చూరు రోడ్డులో ఓ భవనంపై అంతస్తులో గతేడాది లైఫ్ ఇన్సురెన్సు కార్యలయాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఖాతాదారుల నుంచి భారీ మొత్తంలో పాలసీలు కట్టించుకున్నారు. ఫోను నంబర్ల సాయంతో ఖాతాదారులను కార్యాలయానికి పిలిపించుకుని ఏడాదికి రూ. 5 వేలు చొప్పున 5 సంవత్సరాలు చెల్లిస్తే 20 సంవత్సరాలకు రూ. 50 వేలు ఇస్తామని చెప్పారు. ఖాతాదారులు ఆశపడి ఆ సంస్థలో డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన తర్వాత కనీసం బాండు కూడా ఇవ్వలేదు. జిరాక్స్‌పై ఒంగోలు కార్యాలయం ముద్ర వేసి ఖాతాదారులకు ఇచ్చారు. సరిగ్గా ఏడాది తర్వాత బోర్డు తిప్పి మోసం చేశారు. ఖాతాదారులు రెండు రోజుల నుంచి కార్యాలయానికి వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కార్యాలయం యజమాని మాత్రం ఇల్లు అద్దెకు ఇవ్వబడునని బోర్డు పెట్టేశాడు. కంపెనీ వారు ఇచ్చిన ఫోను నంబర్లు కూడా పని చేయకపోవటంతో మోసపోయినట్లు ఖాతాదారులు గుర్తించారు. ఫోన్ చేస్తే వెళ్లా: అత్తులూరి హనుమంతరావు, హనుమోజీపాలెం ఫోను చేసి మరీ కార్యాలయానికి పిలిపించుకున్నారు. డ్రాలో కంపెనీ బీమా సౌకర్యం కల్పించినట్లు నమ్మబలికారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన రూ. 5 వేలు చెల్లించా. కంపెనీ తరఫున బాండు కూడా ఇవ్వలేదు. తర్వాత ప్రింటెడ్ బాండు వస్తుందని చెప్పారు. తీరా చూస్తే కార్యాలయం మూసి వేసి ఉంది.