breaking news
prison breakout
-
ఘోరంగా తన్నుకున్నారు.. 25 మంది మృతి, 100 మందికి గాయాలు
కొలంబో: శ్రీలంకలోని నెగొంబో జైల్లో ఖైదీలు తీవ్ర ఘర్షణకు దిగారు. దీంతో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి తీవ్రగాయాలయ్యాయి. అంతమంది ఖైదీలు ఘర్షణ పడుతున్న సమయంలో అక్కడి పోలీసులు ఏమీ చేయలేకపోయారు.మృతుల్లో నలుగురు గార్డులు ఉన్నారని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో శ్రీకంలోని జైళ్లలో ఇంతటి ఘౌరమైన అల్లర్లు ఎన్నడూ జరగలేదని చెప్పారు. రాజధాని కొలంబోకు ఉత్తర దిశలో ఉన్న నెగొంబో ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు."కొంతమందికి తుపాకీ గాయాలు ఉన్నాయి. ఇంకొందరికి కత్తి కోతలు, తీవ్ర గాయాలు ఉన్నాయి" అని అధికారులు తెలిపారు. నెగొంబో జైలులో ఆదివారం సాయంత్రం ఘర్షణలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ జైలులో వేలాది మంది ఖైదీలు ఉన్నారు.ఘర్షణల వార్తలు జైలు అంతటా వ్యాపించడంతో పక్కనే ఉన్న విభాగంలోని మహిళా ఖైదీలు ఆదివారం రాత్రి భవనం పైకప్పుపైకి ఎక్కి తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పైకప్పులో ఓ భాగం కూలిపోవడంతో కొంతమంది మహిళలకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం పోలీసు కమాండోలను పిలిపించినా వారిని జైలు లోపలికి పంపలేదు.సోమవారం ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో జైలు బయటకు చేరుకున్నారు. పరిస్థితిని గమనించేందుకు వైమానిక దళం డ్రోన్లు, హెలికాప్టర్‌ను వినియోగించింది. స్థానికులు తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని తెలిపారు. సోమవారం ఉదయం పరిస్థితి అదుపు తప్పిందని ఓ పోలీసు అధికారి ఏఎఫ్పీకి తెలిపారు.కాగా, గతంలోనూ శ్రీలంకలోని జైళ్లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2020 డిసెంబరులో శ్రీలంకలోని మరో జైలులో జరిగిన అల్లర్లలో 11 మంది ఖైదీలు మరణించారు. 117 మంది గాయపడ్డారు. ఆ సమయంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుండటంతో రద్దీగా ఉన్న జైళ్ల నుంచి వందలాది మంది ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం నాటికి శ్రీలంక జైళ్లలో 41,250 మంది ఖైదీలు ఉన్నారని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇది ఆ జైళ్ల సామర్థ్యం కన్నా దాదాపు 4 రెట్లు ఎక్కువ. -
మరణశిక్ష నుంచి ఎట్టకేలకు విముక్తి
మనీలా: డ్రగ్స్ తరలించారన్న ఆరోపణలపై అరెస్టయి గత 15 సంవత్సరాలుగా జైళ్లో మగ్గిపోతున్న అమాయక ఫిలిప్పీన్స్ మహిళకు ఎట్టకేలకు ఇండోనేసియా జైలు నుంచి తాత్కాలిక విముక్తి లభించింది. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇకపై ఆమె జీవితకాల జైలు శిక్షను ఇండోనేసియాకు బదులు సొంతదేశం ఫిలిప్పీన్స్‌లోని మహిళల కారాగా రంలో అనుభవించనుంది. ఇండోనేసియా విధించిన శిక్ష ప్రకారం 2015 ఏడాదిలోనే ఫిలిప్పీన్స్ పోలీసుల తుపాకీ గుళ్లకు బలికావాల్సిన మేరీ జేన్ వెలోసో అనూహ్యంగా ఆ దారుణ శిక్ష అమలు నుంచి తప్పించుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాలని త్వరలో దేశాధ్యక్షుడిని వేడుకుంటానని 39 ఏళ్ల మేరీ చెప్పారు. బుధవారం ఉదయం ఆమె ఇండోనేసియా నుంచి బయల్దేరి స్వదేశం ఫిలిప్పీన్స్‌లోని మనీలా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ తల్లి రాకతో ఇద్దరు కుమారులు, మేరీ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎనిమిది మందిపై బుల్లెట్ల వర్షం2010లో బతుకుదెరువు కోసం పనిమనిషిగా ఇండోనేసియాలో అడుగుపెట్టిన ఆమెను ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అరెస్ట్‌చేశారు. వెంట తెచ్చిన సూట్‌కేసులో 2.6 కేజీల నిషేధిత హెరాయిన్ మాదకద్రవ్యం ఉండటంతో ఆమెపై కఠిన డ్రగ్స్ ట్రాఫికింగ్ చట్టాలు మోపి మరణశిక్ష విధించారు. ఆ సూట్‌కేసుతో తనకేం సంబంధం లేదని, ఇండోనేసియాలో ఇంటి పనిమనిషిగా పని కుదిర్చిన ఏజెంట్ మారియా క్రిస్టినా సెర్గీ ఆ సూట్‌కేసు ఇచ్చాడని, అందులో ఏముందో తనకు నిజంగా తెలీ దని ఆమె ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. ఐదే ళ్ల తర్వాత షూట్ చేసి చంపేయాలని తీర్పు వెలువడింది. అక్రమంగా డ్రగ్స్ తెచ్చారంటూ మేరీసహా ఆస్ట్రే లియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఘనా, నైజీరియాలకు చెందిన మొత్తం తొమ్మిది మందిని 2015 ఏడాదిలో ఒక ద్వీపకారాగారానికి తీసుకెళ్లారు. మేరీ తప్ప మిగతా ఎనిమిది మందిపై ఫైరింగ్ స్క్వాడ్ పోలీసులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించి చంపేశారు. ఈమెను కూడా చంపేసేవారే. కానీ ఈమెను ఇండోనేసియాకు పంపిన ఏజెంట్ సెర్గీ కేవలం రెండ్రోజుల ముందు ఫిలిప్పీన్స్‌లో అరెస్టవడం, తానే ఆమెకు ఆ సూట్‌కేసు ఇచ్చి పంపాన ని ఒప్పుకోవడంతో ఈమె శిక్ష అమలు ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. అయితే ఎవరు తెచ్చినా డ్రగ్స్ తమ భూభాగానికి తేవడం మాత్రం నేరమే కాబట్టి ఈమెను నిర్దోషిగా వదిలేది లేదని ఇండోనేసియా కరాఖండీగా చెప్పింది. దీంతో మేరీ విడుదలకు ఫిలిప్పీన్స్‌లో పెద్ద ఉద్యమమే మొదలైంది. చివరకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకుంది. మేరీ మిగతా శిక్షాకాలం సొంత దేశంలో అనుభవించేలా డీల్ కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఆమెను ఇండోనేసియా బుధవారం వదిలేసింది. -
పోలీసుల కాల్పుల్లో.. ముగ్గురు ఖైదీల మృతి
మనీల(ఫిలిప్పైన్స్): ఫిలిప్పైన్స్‌లోని రెస్టివ్ జోలో ఐలాండ్‌లో ఓ జైలు నుంచి 14 మంది ఖైదీలు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఖైదీలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా..ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఐలాండ్‌ను సందర్శించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. గత జనవరిలో బంగసామోరో ఇస్లామిక్ ఫ్రీడం ఫైటర్స్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 160 మంది మిందానౌ ఐలాండ్‌లోని జైలు నుంచి పరారైన సంగతి తెల్సిందే.


