breaking news
Price Bid
-
ఐసీఐసీఐ ఏఎంసీ @ రూ. 2,0612,165
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రూ. 2,061–2,165 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 12న ప్రారంభమై 16న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 11న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్(యూకే) 4.89 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 10,602 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈ నెల 19న లిస్టింగ్‌కానున్న కంపెనీ విలువ రూ. 1.07 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. ప్రస్తుతం ఏఎంసీలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకు 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతం భాగస్వామ్య కంపెనీ ప్రుడెన్షియల్ హోల్డింగ్స్ కలిగి ఉంది. కాగా.. ఇప్పటికే ఈ విభాగంలో నాలుగు సంస్థలు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, శ్రీరామ్ ఏఎంసీ, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ దేశీయంగా లిస్టయ్యాయి. ఈ బాటలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐదో కంపెనీగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో అడుగుపెట్టనుంది. అంతేకాకుండా ఐసీఐసీఐ గ్రూప్ నుంచి ఐదో లిస్టెడ్ కంపెనీగా నమోదుకానుంది. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ఐపీవో ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ(జేవీ)లో భాగస్వామ్య సంస్థ వాటా విక్రయించినప్పటికీ తాము మెజారిటీ వాటాను కొనసాగించనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొన్న విషయం గమనార్హం! -
అర్ధరాత్రి తెరుచుకున్న ‘డిండి’ టెండర్లు?
రూ.3,940 కోట్ల పనులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు నీరందించేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకం పనుల ఆర్థిక టెండర్లు (ప్రైస్ బిడ్ల)ను శుక్ర వారం అర్ధరాత్రి తెరిచినట్లు సమాచారం. మొత్తంగా 7 ప్యాకేజీలకుగాను రూ.3,940 కోట్ల విలువైన పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో అప్పగింత! నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి (0.8 టీఎంసీ), గొట్టిముక్కల (1.8 టీఎంసీ). చింతపల్లి (0.99 టీఎంసీ), కిష్టరాంపల్లి (5.68 టీఎంసీలు), శివన్నగూడెం (11.96 టీఎంసీలు) రిజర్వాయర్లు, వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనుల టెండర్లకు సంబంధించి సాంకేతిక అంశాల పరిశీలనను గత నెల రెండో వారంలోనే ప్రారంభించారు. అది ఆలస్యం కావడంతో శుక్రవారం రాత్రి ప్రైస్ బిడ్లు తెరిచిన సూపరింటెండెంట్ స్థాయి అధికారులు.. వాటిని పరిశీలన కోసం చీఫ్ ఇంజనీర్‌కు పంపించారు. వారి పరిశీలన పూర్తయ్యాక కమిషనర్ ఆఫ్ టెండర్స్ పరిశీలనకు పంపుతారు. అక్కడ టెండర్లు పొందిన ఏజెన్సీల అర్హతలను పరిశీలించిన అనంతరం పనులు అప్పగిస్తారు. ఈ ప్రక్రియకు మరో వారం రోజులు పట్టే అవకాశముంది. -
‘పాలమూరు’కు పోటాపోటీ
♦ రూ. 29,924 కోట్ల పనులకు టెండర్లు వేసిన పెద్ద సంస్థలు ♦ పోటీలో ఎల్అండ్టీ, నవయుగ, గాయత్రి, కేఎన్ఆర్, పటేల్, మెగా ఇంజనీరింగ్ సంస్థలు ♦ సాంకేతిక కారణంతో తెరుచుకోని ప్యాకేజీ-4, ప్యాకేజీ-15 టెండర్లు ♦ చివరి నిమిషం వరకు టెండర్ల దాఖలుకు పోటీపడ్డ కాంట్రాక్టర్లు ♦ టెక్నికల్ బిడ్‌ను తెరిచిన అధికారులు.. ఈ నెల 29న ప్రైస్‌బిడ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు భారీగా పోటీ నెలకొంది. ఈ పనులకు సాంకేతిక టెండర్లను శనివారం సాయంత్రం బహిర్గతం చేశారు. మొత్తంగా రూ.29,924.78 కోట్ల విలువైన 18 ప్యాకేజీల పనులు దక్కించుకునేందుకు పేరుపొందిన కాంట్రాక్టు సంస్థలు క్యూ కట్టాయి. సాంకేతిక కారణాలతో ప్యాకేజీ-4, ప్యాకేజీ-15ల టెండర్లను తెరవలేదు. మిగతా 16 ప్యాకేజీలకు ఎల్అండ్టీ, నవయుగ, గాయత్రి, మెగా, కేఎన్ఆర్, పటేల్ ఇంజనీరింగ్ వంటి సంస్థలు పోటీపడ్డాయి. ఆయా సంస్థలు సాంకేతిక నిబంధనల మేరకు అర్హత సాధించాయా, లేదా? అన్న అంశాలను పరిశీలిస్తామని... దీనికి సుమారు 9 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ నెల 29న ప్రైస్‌బిడ్‌ను తెరుస్తారు. అందులో తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఎల్-1గా గుర్తించి వారికి టెండర్ ఖరారు చేయనున్నారు. భారీగా పనులు.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 62 మండలాల్లోని 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులకు గత నెల 17న నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించిన టెక్నికల్ బిడ్లను శనివారం సాయంత్రం ఆరున్నరకు తెరిచారు. బిడ్ సమయం ముగిసే కొద్ది నిమిషాల ముందు వరకూ కూడా టెండర్లు దాఖలు కావడం గమనార్హం. పెద్ద ప్యాకేజీల వైపే బడా సంస్థల మొగ్గు ప్రాజెక్టులోని పెద్ద ప్యాకేజీల పనులను దక్కించుకునేందుకు పటేల్, నవయుగ, ఎల్ అండ్‌టీ, మెగా వంటి సంస్థలు పోటీలో నిలిచాయి. రూ. 3,226.46 కోట్లు విలువైన పనులున్న ప్యాకేజీ-1 కోసం పటేల్, నవయుగ కంపెనీలు టెండర్ వేయగా... రూ. 5,027.90 కోట్ల విలువైన ప్యాకేజీ -5 పనులకు మెగా, ఎల్అండ్టీ, నవయుగ సంస్థలు టెండర్లు వేశాయి. ప్యాకేజీ-8లో ఉన్న రూ. 4,303.37 కోట్ల పనులకు, రూ. 2వేల కోట్ల పైచిలుకు విలువున్న ప్యాకేజీ-7, ప్యాకేజీ-16, ప్యాకేజీ-18ల పనులకు సైతం ఇవే సంస్థలు పోటీ పడుతున్నాయి. రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువ విలువైన ప్యాకేజీల పనులకు మాత్రం నాలుగు నుంచి ఐదేసి సంస్థలు పోటీ పడ్డాయి. రూ. 1,669.99 కోట్ల విలువైన ప్యాకేజీ-4, రూ. 838.30 కోట్ల విలువైన ప్యాకేజీ-15ల టెండర్లను ఆదివారం తెరిచే అవకాశముంది.


