రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. కేంద్రం తాత్సారం
- ప్రత్యేక హోదా సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునరావు
- ఢిల్లీలో జగన్ దీక్షకు మద్దతుగా గుంటూరులో ‘నగర యువజన దీక్ష’
పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ప్రత్యేకహోదా సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ‘నగర యువజన దీక్ష’ నిర్వహించారు. పార్టీ యువజన విభాగం నేత ఎలికా శ్రీకాంత్‌యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దీక్షను ప్రారంభించిన మల్లికార్జునరావుమాట్లాడుతూ మంగళవారం జరిగే బంద్‌కు పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.
శ్రీకాంత్‌యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన విషయంలో చంద్రబాబు సర్కార్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై మాటలు చెప్పి కేంద్ర మంత్రుల పదవులు తెచ్చుకున్న నేతలు ఇప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. మైనారిటీ విభాగం నగరాధ్యక్షుడు షేక్ జానీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని తిరుపతి సంఘటనతో సుస్పష్టం అయిందన్నారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కోవూరి సునీల్‌కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు మాట్లాడారు.
తొలుత తిరుపతిలో ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన మునికోటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కా ర్యక్రమంలో వైఎస్సార్సీపీ పలు విభాగాల నేత లు నిమ్మరాజు శారదాలక్ష్మి, కొట్టె కవిత, షేక్ ర బ్బానీ, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, నాగం కాశీ విశ్వనాథ్, మెట్టు వెంకటప్పారెడ్డి, చింకా శ్రీని వాసరావు, మెహమూద్, జూలూరి హేమంగదగుప్తా, కాటూరి విజయ్, గోపాల్, బాబ్జీ, యిర్రి సాయి. ఐలా శ్రీనివాసరావు, మేరువ నర్సిరెడ్డి, కడియాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.