breaking news
Premium flagship smartphone
-
వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!
సాక్షి,ముంబై: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్ప్లస్కుచెందిన స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరలో లభ్యమవుతోంది. త్వరలోనే ఈ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో ఇండియాలో 5 వేల రూపాయల తగ్గింపుతో అందిస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇండియా లాంచింగ్ ప్రైస్ రూ. 66,999. కాగా ప్రస్తుతం 5,000 ధర తగ్గింపుతో రూ. 61,999లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 66,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో ఇది లభ్యం. దీంతోపాటు వన్‌ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60,999 కే లభిస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు 6.7 అంగుళాల QHD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 48+ 50+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీ మరోవైపు వన్‌ప్లస్ 10కి కొనసాగింపుగా వన్‌ప్లస్ 11 స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో చైనాలో లాంచ్ కానుందని అంచనా. -
ఎల్జీ జీ ఫ్లెక్స్ 2 @ రూ.56,000
హైదరాబాద్: ఎల్జీ తన ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్, ఎల్జీ జీ ఫ్లెక్స్2ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఫోన్‌ను ప్రముఖ హిందీ సినిమా నటులు అనిల్ కపూర్, నర్గీస్ ఫక్రిలు ఆవిష్కరించారని ఎల్జీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్‌ను అమర్చామని ఎల్జీ మొబైల్స్ ఇండియా బిజినెస్ హెడ్ దీపక్ జస్రోషియా పేర్కొన్నారు. ధర రూ.56,000 వరకూ ఉంటుందని తెలిపారు. ఈ ఫోన్లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ పి-ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లే, 64-బిట్ ఆక్టకోర్ సీపీయూ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2జీబీ ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.