breaking news
Preminchukundam Raa
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘ప్రేమించుకుందాం రా’ హీరోయిన్
టాలీవుడ్లోకి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తుంటారు. వారిలో కొందరు తొలి సినిమాతోనే విజయం సాధించి స్టార్ హీరోయిన్గా అవతరిస్తే.. మరికొందరు తొలి సినిమాతోనే కనుమరుగైపోతారు. ఇంకొంత మంది అయితే వరుస సినిమాలు చేస్తూ తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే సడన్‌గా వెండితెరకు దూరమవుతారు. అలాంటి వారిలో అంజలా ఝవేరి ఒకరు. ఈ పేరు అందరికి తెలియకపోవచ్చు కానీ.. ఆమె నటించిన సినిమాల పేర్లు చెబితే ఈజీగా గుర్తుపట్టేస్తారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలో పక్కింటి అమ్మాయి కావేరి పాత్రలో నటించిన బ్యూటీయే ఈ అంజలా ఝవేరి. ఇది ఆమె తొలి సినిమా. ఫస్ట్ సినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం లభించింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన చిత్రం ‘చూడాలని ఉంది’. 1998లో విడుదలైన ఈ చిత్రంలో సౌందర్య మొదటి హీరోయిన్ కాగా.. అంజలా ఝవేరి సెకండ్ హీరోయిన్గా నటించింది. అది కూడా సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. 'రావోయి చందమామ', 'దేవీ పుత్రుడు', 'ప్రేమ సందడి' లాంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మూవీల్లో నటించిన ఈ భామ చాలా మంది అగ్రహీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇలా కెరీర్ పీక్ స్టేజిలో ఉండగానే బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరాని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. View this post on Instagram A post shared by Tarun Arora (@tarun_raj_arora) పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అంజలా ఝవేరి.. 2012లో చివరగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మంచి పాత్రలు వస్తే మళ్లీ నటించేందుకు అంజలా ఝవేరి సిద్ధంగా ఉన్నట్లు ఆమె భర్త తరుణ్ అరోరా చెప్పారు. ప్రస్తుతం అతను తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్టైలిష్ విలన్‌గా రాణిస్తున్నాడు. -
కాపీ కళ వచ్చేసిందే బాలా!
‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన... ‘పెళ్లి కళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా తద్దినక తాళం ఉంది ఆజా ఆజా’ పాట పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని పాటలకు మహేష్ సంగీతం సమకూర్చారు. ‘పెళ్లి కళ వచ్చేసిందే బాల’ ట్యూన్ మాత్రం ఆఫ్రికన్ గాయకుడు మోరీ కాంటే ప్రసిద్ధ పాట ‘యే కే యే కే’ నుంచి తీసుకున్నారు. గినియా దేశంలోని అల్బదరియ పట్టణానికి చెందిన మోరీ కాంటేకు వోకలిస్ట్‌గా మంచి పేరు ఉంది. పాటలు రాయడమే కాదు చక్కగా పాడగలడు కూడా. 1987లో విడుదలైన ‘యే కే యె కే’ పాటతో ఆయన పేరు మారుమోగిపోయింది. ఈ పాట అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందింది.