breaking news
pre-wedding dinner
-
ఆకాశ్, శ్లోకా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ , శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. స్విస్‌లోని సెయింట్ మోర్తిజ్ వేదికగా మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగాయి. ఈ వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులు ఆకాశ్-శ్లోకా గుర్రపు బండిలో కాసేపు ఊరేగుతూ వేదికకు చేరుకుని అందర్నీ అలరించారు. బాణా సంచావెలుగులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. సుమారు 850 మంది అతిథులు హాజరైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు రణ్‌బీర్ కపూర్,అలియా భట్ తోపాటు లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇంకా కరణ్ జోహార్, పింకీ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లూనా పార్క్‌లో ప్రత్యేక వినోద కార్యక్రమాలతోపాటు అతిథుల సౌకర్యార్థం హోటల్ మోర్టిజ్లోని అత్యంత విలాసవంతమైన గదులను బుక్ చేశారట. కాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం మార్చి 9న ముంబైలో జరగనున్న విషయం తెలిసిందే. View this post on Instagram Firecracker show done right! 💯 #ambanipreweddingcelebrations A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 9:40pm PST View this post on Instagram Yet another video of the fireworks last night to prove the grandeur of the event! 💥 A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 11:39pm PST View this post on Instagram Ranbir Kapoor blesses the Couple Of The Hour - Akash & Shloka! 💜 A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 12:06pm PST -
కాబోయే భార్యతో యువరాజ్ షికార్లు
న్యూఢిల్లీ: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, తనకు కాబోయే భార్య హాజల్ కీచ్‌తో ప్రివెడ్డింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. బుధవారం రాత్రి సన్నిహితులకు స్పెషల్ డిన్నర్ ఇచ్చారు. సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్, డిజైనర్-నటి పెర్నియా ఖురేషీ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు. యువీ-కీచల్ హోటల్ నుంచి బయటకు వస్తూ మీడియా కెమెరా కంట పడ్డారు. నలుపు రంగు డ్రెస్, నీలం రంగు జాకెట్ ధరించిన హాజల్ కీచ్.. యువీ చేతిలో చేయి వేసి నడుస్తూ బయటకు వస్తున్న ఫొటోలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యువరాజ్ నల్లరంగు టీషర్ట్, తెలుగు రంగు పాంట్ దుస్తులు ధరించి తలకు హెయిర్ బాండ్ పెట్టుకున్నాడు. ఇద్దరు చేతిలో చేయి వేసుకుని ఆనందంగా హోటల్ నుంచి బయటకు రావడాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఫొటో గ్రాఫర్ వారిందర్ చావ్లా క్లిక్ మనిపించాడు. నవంబర్ 30న చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయంలో యువీ- హాజల్ కీచ్ పెళ్లి సిక్కు సంప్రదాయంలో జరగనుంది. డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయంలో పెళ్లి జరుగుతుందని సమాచారం. ఢిల్లీలో ఘనంగా వివాహ విందు ఇవ్వనున్నారు. సినిమా, క్రీడా, రాజకీయ ప్రముఖులు రిసెస్షన్ కు రానున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్ పూర్ లో ఉన్న ఫాంహౌస్ లో సంగీత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే మొదలవడంతో యువీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.