breaking news
pravatipuram
-
మంత్రి సంధ్యారాణికి బిగ్ షాక్ YSRCPలో చేరిన 320 TDP కుటుంబాలు
-
పార్వతీపురంలో ఉద్రిక్తత
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం ఏడో వార్డులో జరుగుతున్న జన్మభూమి గ్రామ సభ రసాబాసగా మారింది. పాఠశాల ఆవరణలో పెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిందిగా కోరిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో.. తోపులాట జరిగింది. విద్యార్థుల పరీక్షలు జరుగుతున్న సమయంలో పాఠశాల ఆవరణలో సభలు జరపడం సరైంది కాదని వైఎస్సార్సీపీ నాయకులు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఇష్టం వచ్చిన చోట పెట్టుకునే హక్కు తమకుందని.. ప్రభుత్వం తమదని అహంకార పూరితంగా మాట్లాడటంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


