breaking news
pravallika died
-
నా బిడ్డ చావుపై రాజకీయాలు చేయొద్దు
దుగ్గొండి: ‘‘మీకు, మీ పార్టీలకు గొడవలు ఉంటే మీరే చూసుకోండి .. మా కుటుంబాన్ని నా బిడ్డ చావును అందులోకి లాగకండి’’ అంటూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ప్రవల్లిక తల్లి మర్రి విజయ మాట్లాడిన మాటలు మంగళవారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు స్పందించారు. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రవల్లిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ మాట్లాడిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. నా బిడ్డ చావును అందులోకి లాగకండి.. వీడియోలో ఏముందంటే.. ‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవల్లిక. రెండేళ్ల నుంచి నా బిడ్డ, నా కొడు కును హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్నా.. మేము కాయకష్టం చేసుకుని చదివిస్తున్నం. మా పిల్లలకు కష్టం రాకూడదని హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్న. నా బిడ్డను వాడు వేధించాడు. వాడి టార్చర్‌ను మా అమ్మాయి మాతో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డ చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడు బయటికి రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రావద్దు. మీకు, మీ పార్టీలకు గొడవలు ఉంటే మీరే చూసుకోండి .. మా కుటుంబాన్ని నా బిడ్డ చావును అందులోకి లాగకండి. నా బిడ్డ ఉరి వేసుకున్నట్టే వాడికి ఉరిశిక్ష పడాలి’ అని మర్రి విజయ వీడియో పోస్టు చేశారు. ‘ప్రవల్లిక చనిపోవడానికి కారణం శివరాం. మా అక్క స్నేహి తురాలి ద్వారా పరిచయమయ్యాడు. వేధించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక డిప్రెషన్లో పడింది. సూసైడ్ చేసుకుంది’ అని ప్రవల్లిక తమ్ముడు మర్రి ప్రణయ్‌కుమార్ మరో వీడియోలో పేర్కొన్నాడు. సీఎంను కలిసేందుకు వెళ్లారా? ప్రవల్లిక ఆత్మహత్య రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంప నలు సృష్టించడం.. ప్రభుత్వంపై పలు ఆరోపణలు రావడంతో.. సోమవారం ప్రవల్లిక తల్లిదండ్రులు మర్రి లింగయ్య, విజయ మంత్రి కేటీఆర్ నుంచి పిలుపురావడంతో సిరిసిల్ల వెళ్లి కలిసినట్లు వార్తలొ చ్చాయి. అదే రోజు రాత్రి వారు ఇంటికి తిరిగివచ్చి మంగళవారం ఉదయం 5వ రోజు పక్షికి పెట్టే కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ప్రకాష్ జవదేకర్ పరామర్శకు వస్తున్నారని సమాచారం వచ్చినా.. వారు కలవడా నికి నిరాకరించడంతో కిషన్‌రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నారు. పక్షి కార్యక్రమం ముగియగానే సీఎం కేసీఆర్‌ను కలవడానికి హైదరాబాద్‌కు వెళ్లినట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎక్కడ మాట్లాడారో తెలియదు కానీ వారి మాటలు చర్చాంశనీయమయ్యాయి. శివరామ్ కోసం వేట ముమ్మరం సాక్షి, హైదరాబాద్: ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరా బాద్ చిక్కడపల్లి పోలీ సులు ఆ మేరకు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి శివరామ్ రాథోడ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. శివకుమార్ చేతిలో మోసపోయా నన్న విష యాన్ని ప్రవల్లిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సా ప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. పరారీలో ఉన్న నిందితుడు శివరామ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణం
-
ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
-
ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
-
'సెలైన్ వల్ల ప్రవళిక మృతి చెందలేదు'
-
'సెలైన్ వల్ల ప్రవళిక మృతి చెందలేదు'
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో పురుగులున్న సెలైన్ ఎక్కించడం వల్ల ప్రవళిక మృతి చెందిందన్న వార్త అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నారి మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదన్నారు. (చదవండి ...పురుగుల సెలైన్: చిన్నారి మృతి) చిన్నారికి పోస్టుమార్టం అవసరంలేదని కుటుంబసభ్యులు లిఖితపూర్వకంగా కోరడంతోనే పోస్టుమార్టం నిర్వహించలేదని చెప్పారు. ప్రవళికకు వచ్చిన వ్యాధి లక్ష మందిలో ఒకరికి మాత్రమే వస్తుందన్నారు. సెలైన్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించామన్నారు. 62 రోజుల పాటు నిపుణులైన వైద్య బృందంతోనే చికిత్స అందించామని తెలిపారు. అంతకు ముందు ప్రవళిక తండ్రి భిక్షపతి మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నీ బిడ్డ చనిపోతే చనిపోతుంది..అదేమైనా పెద్ద విషయమా' అని అన్నారన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. మీడియాకు చెబుతావా.. కేసులు పెడతానంటూ బెదిరించారని భిక్షపతి వాపోయారు.