breaking news
Prasanna Vadanam Movie
-
This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు కావడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో పెద్ద సినిమాలన్నీ దాదాపు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఓటీటీల్లోనే సినిమాలు ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్‌తో సహా చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో సుహాస్ ప్రసన్నవదనం, పృథ్వీరాజ్ సుకుమార్ ఆడుజీవితం కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి మీరు ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్గారోడెన్న్ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్(యానిమేషన్)- మే 23ఇల్లూజన్స్ ఫర్ సేల్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23ఇన్ గుడ్ హ్యాండ్స్-2(ఇంగ్లీష్ సినిమా)- మే 23 ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్(ఇంగ్లీష్ సిరీస్)- మే 23అట్లాస్ (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- మే 24ముల్లిగన్ పార్ట్-2 (యానిమేషన్ సిట్కామ్)- మే 24మై ఓని గర్ల్(యానినేషన్ చిత్రం)- మే 26 అమెజాన్ ప్రైమ్ది వన్‌పర్సెంట్ క్లబ్ సీజన్-1- మే 23ది బ్లూ ఎంజెల్స్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23డీఓఎం సీజన్-2(వెబ్ సిరీస్)- మే 24బాంబ్‌సెల్- మే 25డిస్నీ ప్లస్ హాట్స్టార్డోరామ్యాన్ సీజన్-19 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20షిన్ చిన్ సీజన్-16 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20మార్వెల్ స్టూడియోస్:అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్‌మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22పాలైన్-(జర్మన్ సినిమా)- మే 22ది కర్దాషియన్స్- సీజన్-5(ఇంగ్లీష్ సినిమా)- మే 23ది బీచ్ బాయ్స్(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24ఆడుజీవితం(ది గోట్ లైఫ్) (మలయాళ సినిమా)- మే 26(రూమర్ డేట్)రోలాండ్ గారోస్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ సినిమా)- మే 26ఆహాప్రసన్నవదనం(తెలుగు సినిమా) మే 24యాపిల్ టీవీ ప్లస్ట్రైయింగ్ సీజన్-4- మే 22 -
ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. సుహాస్ హీరోగా నటించిన ఆ సినిమా పేరే 'ప్రనస్న వదనం'. విడుదలకు ముందే అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉండటంతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అలరించేందుకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.తెలుగులో ఈ మధ్య కాలంలో సుహాస్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. రీసెంట్గా 'ప్రసన్న వదనం'తో వచ్చాడు. మే 3న థియేటర్లలోకి వచ్చింది. హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే కథ ఆసక్తికరంగా అనిపించింది. సినిమా కూడా బాగానే ఉందని చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ మూవీ మూడు వారాల్లోనే అంటే మే 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)'ప్రసన్నవదనం' కథేంటి?సూర్య (సుహాస్) ఓ రేడియో జాకీ. ఓ యాక్సిడెంట్ కారణంగా ప్రొసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది. ఇది ఓ లోపం. అదేంటంటే ఇతడికి మొహాలు గుర్తుండవు, కనిపించవు. అన్నీ గుర్తుంటాయి ముఖాలు తప్ప. దీన్ని ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. ఈ సమస్యతో ఉన్నోడు కాస్త ఓ హత్యలో సాక్షి అవుతాడు. అసలా మర్డర్ చేసిందెవరు? లోపమున్న హీరో నిందుతుల్ని ఎలా పోలీసులకు పట్టిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు థియేటర్లలో చూడాలంటే కాస్త కష్టం కానీ ఓటీటీలో మాత్రం క్రేజీగా ఆడేస్తాయి. ప్రస్తుతం అటు థియేటర్, ఇటు ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. వచ్చే వారం ఓటీటీలోకి వచ్చేస్తుంది కాబట్టి 'ప్రసన్నవదనం'.. డిజిటల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్సులు గట్టిగా ఉంటాయనమాట.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)Without a Face, But Not Without Courage..💪A Hero's Journey Beyond Sight!🎭A gripping thriller-drama #PrasannaVadanamOnAha Premieres May 24th!(24 hours early access for aha gold subscribers)@ahavideoIN @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC… pic.twitter.com/NG4CmDnW94— ahavideoin (@ahavideoIN) May 17, 2024