breaking news
Pranahita Pushkaralu
-
పుష్కరతీరం.. పులకించిన జనం (ఫోటోలు)
-
‘మీకు పెన్ ఉంటే, మాకు గన్ ఉంది’.. జర్నలిస్టుపై పోలీస్ దురుసు ప్రవర్తన
సాక్షి, వరంగల్: మీకు పెన్ ఉంటే మాకు గన్ ఉంది.. ఈయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. పోలీసులంటే ఏమనుకుంటున్నాడో తెలియాలి.. అంటూ ఓ సీఐ కాళేశ్వరం వద్ద పుష్కరాల విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుపై దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ఆయన తీరును నిరసిస్తూ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు వివాదాస్పద అధికారిని పుష్కరాల విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలానికి చెందిన ఓ టీవీ చానల్ రిపోర్టర్ పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల పూజలను వీడియో తీశాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై మొగిలి సదరు జర్నలిస్టును అడ్డుకొని వీడియో తీయొద్దంటూ ఆలయం ఎదుట ఉన్న సీఐ జానీ నర్సింహులు వద్దకు తీసుకొచ్చాడు. ఆలయంలో వీడియో తీయడానికి అనుమతి లేదంటూనే జర్నలిస్టు చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను సీఐ బలవంతంగా లాక్కున్నాడు. తాను స్థానిక రిపోర్టర్నని మొర పెట్టుకున్నప్పటికీ పోలీసులంటే ఏమనుకుంటున్నావు.. మీ దగ్గర పెన్ ఉంటే.. మా దగ్గర గన్ ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పలువురు జర్నలిస్టులు గొడవను ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా సీఐ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పోలీస్ ఔట్‌పోస్ట్‌లో ఉన్న కాటారం డీఎస్పీ బోనాల కిషన్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను వివరించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఫోన్ ద్వారా ఎస్పీ జె.సురేందర్‌రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే వివాదానికి తెరలేపిన సీఐ జానీ నర్సింహులు అక్కడికి చేరుకొని ఇగో అన్న.. నా ఫిర్యాదు.. జరిగిందంతా ఇందులో రాసిన.. వాళ్ల మీద ఎఫ్ఐఆర్ చెయ్ అన్నాడు. ఇందుకు డీఎస్పీ బదులిస్తూ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాను.. కొద్దిసేపట్లో సార్ నిర్ణయం తీసుకుంటారు.. మీరు ఏదైనా చెప్పాలనుంకుంటే ఎస్పీ సంప్రదించండి అని వెల్లడించాడు. చదవండి: మూడేళ్ల కిందట మాటలు బంద్.. మూగవాడికి మాటలొచ్చాయ్! అయినప్పటికీ వినకుండా సీఐ కొద్దిసేపు డీఎస్పీతో వాగ్వాదానికి దిగి ఫిర్యాదు అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ సురేందర్‌రెడ్డి పుష్కర విధుల నుంచి సీఐ జానీ నర్సింహులు, ఎస్సై మొగిలిని తొలగించినట్లు అనధికారిక సమాచారం. ఇదిలా ఉండగా సీఐ జానీ నర్సింహులు తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవా లని టీయూడబ్ల్యూజే(హెచ్143) రాష్ట్ర నాయకుడు తడక రాజ్నారాయణగౌడ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాయకులు సామంతుల శ్యాం, క్యాతం సతీష్‌కుమార్ డిమాండ్ చేశారు. చదవండి: రంజాన్ మాసంలో.. ఇది తప్పనిసరి! ఫుల్ డిమాండ్ -
Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం
సాక్షి, మంచిర్యాల/భూపాలపల్లి /కాళేశ్వరం: ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వేమనపల్లి ఘాట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుష్కరాలను ప్రారంభించారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ వెంట.. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సాయంత్రానికే ప్రాణహిత తీరాలకు చేరుకుని.. తాత్కాలిక గుడారాల్లో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పుష్కరాలు మొదలవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. పిండ ప్రదానాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరంలో దేవాదాయశాఖ అధికారులు, వేదపండితులు కాలినడకన కలశాలు, మంగళ వాయిద్యాలతో ప్రాణహిత నదికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.54 గంటలకు పడవలో నదికి అవతలివైపు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నదికి పంచ కలశాలతో ఆవాహనం చేసి.. పుష్కరుడి(ప్రాణహిత)కి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం పంచ కలశాలల్లో నీటిని తీసుకొచ్చి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి అభిషేకం, పూజలను నిర్వహించారు. ఇక కాళేశ్వరానికి అనుకుని అవతలివైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని సిరొంచలో ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని రెండు ఘాట్లలో తొలిరోజు 10 వేల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. ఇక్కడికి తొలిరోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా తరలివచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నదీ హారతి ఇచ్చారు. అర్జునగుట్ట వద్ద కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఇంద్రకరణ్‌రెడ్డి గోదావరి ఉప నదిగా మనకు ప్రాణహిత పుష్కలంగా నీరందిస్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది సంతోషకరం. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు హరిస్తాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు అన్నిరకాల మేలు జరగాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘ప్రాణహిత’ ప్రత్యేక టూర్ ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల కోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక యాత్ర ప్యాకేజీని బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నెల 24దాకా అంటే 12 రోజుల పాటు ఈ ప్రత్యేక యాత్ర నడుస్తుంది. రోజూ ఉదయం 05:00 బషీర్‌బాగ్ సీఆర్వో నుంచి బస్సు బయలుదేరుతుంది, 8:30 గంటలకు అల్పాహారం ఉంటుంది. 11:00 గంటల సమయంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 వరకు సిరోంచ పుష్కరఘాట్ వీక్షించేందుకు సమయమిస్తారు. తర్వాత గంటపాటు దర్శన సమయం, 1.45 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్లో భోజనం ఉంటాయి. 2.45 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ యాత్ర ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760, నాన్‌ఎసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా ఉంటాయని టీఎస్‌టీడీసీ ప్రకటించింది.