breaking news
prakasam district collector
-
1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు: కలెక్టర్లు
సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు మాట్లాడారు. ఏమన్నారో వారి మాటల్లోనే.. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం గడిచిన ఆరు నెలలుగా మీరు ఇస్తున్న సూచనల మేరకు మా జిల్లాలో జిల్లా స్ధాయిలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటుచేశాం, కలెక్టర్, జేసీల నేతృత్వంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది, ఇందులో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కన్వీనర్‌గా ఉన్నారు, అన్ని ప్రభుత్వ విభాగాలలో వస్తున్న వినతులు, ఫిర్యాదులు పరిశీలించడం, మండల స్ధాయిలో కూడా పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి గ్రీవియెన్స్‌ను పరిశీలించడం, మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సంబంధిత వార్త: ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్ మా జిల్లాలో వస్తున్న గ్రీవియెన్స్‌ను పరిష్కరించడం, రీ ఓపెన్ అయిన వాటిని పరిష్కరించడం చేస్తున్నాం. మీ సూచనల ప్రకారం గ్రామ సచివాలయం నుంచి జిల్లా కేంద్రం వరకు అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ పేరు ఉండడం వల్ల నాణ్యతతో కూడిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీ సూచనలు సలహాలు పాటించి ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం. మా జిల్లా యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉంది. థాంక్యూ సార్. -దినేష్ కుమార్, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కారం సార్, ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం అంతా వీక్షిస్తుంది. మేం మా దగ్గరకు వచ్చే గ్రీవియెన్స్ పరిష్కారానికి పూర్తి మెకానిజాన్ని సిద్దం చేసుకున్నాం, 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం, స్పెషల్ ఆఫీసర్ కూడా పరిశీలిస్తున్నారు, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమస్య పరిష్కారం అవగానే చిరునవ్వుతో వెనుదిరగాలి అనే విధంగా ముందుకెళుతున్నాం, గడిచిన కొద్ది వారాలుగా మేం ఈ కార్యక్రమానికి పూర్తి సన్నద్దమై ఉన్నాం. జిల్లా స్ధాయి నుంచే కాదు మండల స్ధాయి నుంచి కూడా అధికారులు సిద్దంగా ఉన్నారు, ఎలాంటి జాప్యం లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం, ఇప్పటికే జిల్లా అధికారులకు తగిన విధంగా శిక్షణ కూడా ఇచ్చాం, గ్రీవియెన్స్ పరిష్కారం తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం. ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.! -నిషాంత్‌కుమార్, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం, జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించాం, ఇప్పటికే అవగాహన తరగతులు నిర్వహించాం, 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు తీసుకున్నాం, డైలీ స్టేటస్ రిపోర్ట్‌ను తీసుకుని పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం, పిటీషన్‌ను నిర్ణీత కాలపరిధిలో పరిష్కరిస్తున్నారా లేదా అని జిల్లా స్ధాయిలో పర్యవేక్షణ జరుగుతుంది, అన్ని శాఖల సమన్వయంతో పిటీషనర్‌కు న్యాయం జరిగేలా చూస్తాం, సివిల్ కేసుల పరిష్కారానికి మండల, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సహకారం తీసుకుంటాం. ఫీడ్ బ్యాక్ మెకానిజాన్ని కూడా ఏర్పాటుచేశాం, ఈ కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్ అవుతుందని భావిస్తున్నాం. అన్భురాజన్, ఎస్పీ, వైఎస్సార్ కడప జిల్లా -
'పచ్చ' కలెక్టర్..!
ఒంగోలు : యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో సోమవారం నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో కలెక్టర్ సుజాతశర్మ తెలుగుదేశం పార్టీ జెండాలతో అలంకరించిన ఎడ్లబండిపై ఊరేగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలు విమర్శలకు తావిచ్చింది. ఏరువాక కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. తొలకరి వర్షాల నేపథ్యంలో ఏరువాక పౌర్ణమి నాడు వ్యవసాయ పనులు ప్రారంభించడం రైతులకు ఆనవాయితీ. ఈ ఏడాది తొలిసారిగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ఆత్మ శాఖ నిధులు వినియోగించుకోవాలని సూచించింది. ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. దానిలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో అధికారులు సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, టీడీపీ నేత కరణం బలరాం, స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్లబండిపై ఊరేగింపు నిర్వహించారు. అయితే, ఆ ఎడ్లబండిని తెలుగుదేశం జెండాలతో అలంకరించి పసుపుమయం చేశారు. అదే బండిపై మంత్రి, టీడీపీ నేతలతో కలిసి కలెక్టర్ సుజాతశర్మ ఊరేగారు. పార్టీలకతీతంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాత్రం టీడీపీ జెండాలు కట్టిన బండిలో ఊరేగడం విమర్శలకు దారితీసింది. -
ప్రకాశం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం ఒంగోలులో పలు సూచనలు చేశారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబ్లర్లు : 08592 281400, లేదా టోల్ ఫ్రీ నంబర్ : 1077కు ఫోన్ చేయాలని సూచించారు.