breaking news
power division Employees
-
ఆ కంపెనీలో 12వేల ఉద్యోగాలు కట్
జనరల్ ఎలక్ట్రిటీ (జీఈ) కంపెనీ భారీగా ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా జీఈ పవర్ విభాగంలో వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు పథకాలు రచించింది. అమెరికా బయట సుమారు 12వేలమంది ఉద్వాసన పలకనుంది. గ్యాస్, పవర్ , కోల్ మార్కెట్ నష్టాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అతి పెద్ద గ్యాస్ టర్బైన్లు ఉత్పత్తిదారుగా ఉన్న జీఈ పవర్ గ్యాస్-టర్బైన్ తయారీదారు పునరుత్పాదక లాభాల క్షీణత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పవర్బిజినెస్లో 12వేల ఉద్యోగాలను కట్ చేయాలని ప్రణాళిక వేసింది. ఈ క్రమంలో జీఈ పవర్ కార్పోరేషనులో 18 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించనున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ అండ్ ప్రొడక్ట్ రెండింటిలోనూ ఈ కోత ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కంపెనీ కొత్త సీఈవోగా ఎన్నికైన జాన్ ఫ్లాన్నెరీ సంస్థ ఖర్చులను తగ్గించడంతోపాటు, కష్టాల్లో ఉన్నసంస్థను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం బాధాకరమైనది. కానీ అవసరమైనదని డివిజన్ చీఫ్ రస్సెల్ స్టోక్స్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో సవాళ్లు కొనసాగినప్పటికీ 2018 లో జీఈ పవర్ పురోగతిని సాధిస్తుందని తాము భావిస్తున్నామన్నారు. మరోవైపు ఇప్పటికే కార్పొరేట్ జెట్లను ఉపయోగించడాన్ని కంపెనీ సీఈవో వదులుకున్నారు. అలాగే త్రైమాసిక డివిడెండ్ చెల్లింపును ఆలస్యం చేయడంతోపాటు కొన్ని వ్యాపారాలను విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా వచ్చే ఏడాది పవర్ డివిజన్లో నిర్మాణాత్మక ఖర్చులు 1 బిలియన్ డాలర్లు తగ్గుతుందని ఆశిస్తోంది. మొత్తంగా 2018 నాటికి సంస్థ అంతటా 3.5 బిలియన్ల డాలర్ల ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వార్తలతో న్యూయార్క్ రెగ్యులర్ ట్రేడింగ్‌లో బుధవారం దాదాపు ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. -
విద్యుత్ ఉద్యోగుల విభజనను త్వరగా చేపట్టాలి
నల్లగొండ :విద్యుత్ ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తిచేయాలని ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, కార్యదర్శి స్వామిరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ వసతి గృహంలో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఇంజినీర్లను వీలైనంత త్వరగా వారి ప్రాంతాలకు పంపాలన్నారు. అదే విధంగా బంగారు తెలంగాణ సాధన దిశగా విద్యుత్ ఇంజినీర్ల సంఘం నిరంతం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కే వీఎన్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.