మనమంతా ఒక్కటే... శాంతే మార్గం!
పోప్ లియో–14 ఈస్టర్ ఆది వారం రోజు ప్రసంగిస్తూ చెప్పిన ‘మనమంతా ఒక్కటే’ అనే మాటలు ప్రపంచంలో శాంతి నెలకొనడానికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలియ చేస్తున్నాయి. మే 8న 267వ అగస్టినియన్ పోప్గా, సెయింట్ పీటర్ వారసుడిగా ఎన్నికైన పోప్ లియో మే 18న ఆ సర్వోన్నత చర్చి పదవిని స్వీకరించనున్నారు. రెండు వేల ఏళ్ల క్యాథలిక్ చర్చి చరిత్రలో ఆయన తొలి అమెరికన్ పోప్ కావడం విశేషం. అంతే కాదు ద్వంద్వ పౌరసత్వాలు (అమెరికన్, పెరువియన్) కలిగిన తొలి పోప్ కూడా ఆయనే. పారిశ్రామిక యుగం తొలి నాళ్లలో సామాజిక న్యాయం కోసం, కార్మికుల హక్కుల కోసం గళమెత్తి నిరసన తెలిపిన పోప్ లియో–13 గౌర వార్థం ఆయనకు ‘లియో–14’ అనే పాపల్ పేరు (పోప్ అయ్యాక పెట్టే పేరు) పెట్టారు. ఆయన అసలు పేరు రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివస్ట్.పోప్ లియోది అమెరికాలోని చికాగో. కానీ జీవితంలో ఎక్కువ భాగం పెరూలోని చిక్లాయోలో గడిపారు. పెరువి యన్ జీవనశైలిలో ఆయన మమేకమై వారితో కలిసి పోయారు. కేవలం ఆ భాష నేర్చుకోవడంతోనే ఆగిపో కుండా వారి జీవితాల్లోని పలు పార్శా్వలను పరిశీలించారు. వారి బాధల్నీ, వేదనల్నీ గమనించారు. అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడుతూ మారుమూల పల్లెల్లో సైతం ఆయన ప్రయాణించారు. ఎల్లవేళలా శాంతి, న్యాయం, మతస్వేచ్ఛ, సమానత్వం, దేశభక్తి, మనిషిని మనిషిగా గౌరవించడం వంటి అంశాల కోసం పని చేశారు. అందుకే పెరువియన్లు ఆయనను తమ కొత్త నాయకుడని పిలుస్తారు. ఇక పోప్ పదవిని ఓ అమెరికన్ స్వీకరిస్తాడన్న నమ్మకం చాలా మందికి చాలా కాలంపాటు లేదు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు పోప్ లియో ఆ పదవిలోకి వచ్చి అమెరికన్ల ఆధ్యాత్మిక అంతస్తును పెంచారు.1982లో ప్రీస్ట్గా మారిన పోప్ లియోకు చర్చి చదు వులో పలు డిగ్రీలు ఉన్నాయి. ఇతరుల మాటలు ఆలకించడంలో, వారి అభిప్రాయాలను గౌరవించడంలో పోప్ లియోది అందె వేసిన చెయ్యి. ఈ గుణమే ఆయనను తోటి వారికి, అంతర్జాతీయ నేతలకు దగ్గర చేశాయి. ఆంగ్లం, స్పానిష్, ఇటాలియన్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలు అనర్గ ళంగా మాట్లాడగలిగిన పోప్ లియో ఈ బహుభాషలను ఆడంబరం కోసం కాక, ప్రపంచంలోని అనేకులతో నేరుగా సంభాషించి, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఉపయోగిస్తున్నారు. 2004, 2006లలో రెండుసార్లు లియో భారతదేశాన్ని సందర్శించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ప్రత్యేక వసతులూ కోరలేదు. చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఆయన పద్ధతి, సామాన్య జీవనశైలి భారతీయులను ఆకట్టుకుంది.పోప్ లియో రాబోయే రోజులలో ఎటువంటి ప్రభావం చూపబోతున్నారో ఆయన వెల్లడి చేస్తున్న భావాల ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రపంచం ప్రయత్ని స్తున్నది. ఈస్టర్ ఆదివారం నాడు ఆయన చేసిన తొలి ప్రసంగంలో ‘మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని దేశాధి నేతలను అభ్యర్థిస్తున్నాను’ అన్నారు. ఇప్పటికే రెండు మహా యుద్ధాలను చూసిన ప్రపంచం మరో భారీ యుద్ధా నికి సిద్ధంగా లేదని వివరించారు. తన ముందు పోప్గా ఉన్న ఫ్రాన్సిస్ సందేశమే తన సందేశమని ఆయన పేర్కొన్నారు. గాజాలో శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు. భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అభి నందించారు. చేతిలో ఆయుధం పెట్టుకొని ఎవరూ ప్రేమను పంచలేరని, యుద్ధాల నిరోధానికి ఐక్యరాజ్య సమితి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పోప్ లియో తన ప్రసంగంలో సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు దాని వెనకే ఉన్న దుష్పరిణామాల గురించి వివరించడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలనీ, సర్వమానవాళి శ్రేయస్సును కాంక్షించాలనీ అంటున్న ఆయన మాటల్ని బట్టి చూస్తే, ఈ ఏఐ యుగంలో ఆధునిక సాధువులా కనిపిస్తున్నారాయన.ఇటీవల అంతర్జాతీయ మీడియాతో పోప్ లియో మాట్లాడుతూ ‘మీడియాను నియంత్రిస్తే కొంతమేర ప్రజల ఆలోచనా విధానాన్ని నియంత్రించినట్లు అవుతుంది’ అన్నారు. క్రైస్తవులు సార్వజనీన మానవులని పోప్ మాట. అందర్నీ సమానంగా సోదరభావంతో చూడలేనివారు క్రైస్త వులు కారనేది ఆయన మాట.ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలు నడు స్తున్నాయి. దాయాది దేశాల మధ్య సమస్యలు నెల కొన్నాయి. ఇవి ప్రస్తుతం పోప్ ముందున్న సవాళ్లు. తన తొలి ప్రసంగంలోనే శాంతి కోసం ఆయన పడిన తపనను బట్టి తప్పకుండా ఆయన ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారని చాలామంది విశ్వసిస్తున్నారు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు వారి మధ్య సయో ధ్యను కుదిర్చి, యుద్ధాన్ని నివారించే పెద్దలు ఈ సమాజా నికి చాలా అవసరం. అటువంటివారే పోప్. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోప్ ఏర్పరిచే శాంతిబాటలకు ఎంతో ప్రాధాన్యం ఉందని అందరూ భావిస్తున్నారు.జహారా బేగం, - వ్యాసకర్త సామాజిక కార్యకర్త, అమెరికా