breaking news
pitbull
-
రెచ్చిపోయిన పెంపుడు కుక్క.. 15 నిమిషాల పాటు..
-
రెచ్చిపోయిన కుక్క.. 15 నిమిషాల పాటు..
జలందర్ : పంజాబ్‌లో జలందర్ ఘోరం జరిగింది. ఓ 15 ఏళ్ల బాలుడిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. మాములుగా పిచ్చి కుక్కలు దాడి చేసినప్పుడు ఇతరులు బెదిరిస్తే.. లేదా రాళ్లతో కొడితే పారిపోతాయి. కానీ ఈ కుక్క మాత్రం బాలుడి కాలిని పళ్లతో గట్టిగా పట్టి ఎంతకీ వదలలేదు. బాటసారులు వచ్చి దాడి చేసినా.. ఆ కుక్క ఆదరలేదు.. బెదరలేదు. జలందర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జలందర్‌కు చెందిన ఓ బాలుడు గత మంగళవారం సాయంత్రం సైకిల్‌పై ట్యూషన్‌కి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చే క్రమంలో ఇంటికి సమీపంలో ఓ పెంపుడు కుక్క దాడికి దిగింది. అతని కుడికాలిని పళ్లతో పట్టి కొరకసాగింది. ఇది గమనించిన బాటసారులు.. కుక్కను రాళ్లతో, కర్రలతో కొట్టారు. అయినప్పటికీ కుక్క బాలుడిని వదలలేదు. బాలుడి తల్లి కాళ్లతో తన్నినా, నీళ్లు చల్లినా కుక్క మాత్రం అక్కడి నుంచి పారిపోలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత కుక్క అతన్ని వదిలి పారిపోయింది. కుక్క దాడిలో తీవ్రగాయాలపాలైన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
మూడు కాళ్లతో వీరోచితంగా పోరాడింది
మనకి తెలిసినంతవరకు ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల జంతువు కుక్క. మనుషులు కుక్కల్ని తమ కుటుంబసభ్యులతో సమానంగా చూడటం మనం రోజు చూస్తూనే ఉంటాం. కుక్కలు కూడా మనుషులను ఎంత ప్రేమిస్తాయో లేవీ అనే 15 ఏళ్ల పిట్ బుల్ జాతికి చెందిన శునకం మరోసారి నిరూపించింది. రెండేళ్ల కిందట యజమాని కుమారున్ని కాపాడి కాలును కోల్పోయిన లేవీ, ఇప్పుడు వారి కుటుంబాన్ని రక్షించడానికి ఏకంగా ప్రాణాన్నే పణంగా పెట్టింది. వివరాలు.. వారం రోజుల కింద అమెరికాలో విస్కాన్సిన్లోని జానెస్విల్లేలో ఓ దుండగుడు చోరీకి యత్నించాడు. గన్‌తో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు, యజమాని డార్సి చెర్రీ, ఆమె బాయ్ ఫ్రెండ్ బాబ్ స్టెంజెల్ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. వాళ్లను భూమి మీద కూర్చోబెట్టి చేతులు తల వెనుక పెట్టుకోవాలని బెదిరించాడు. ఇదంతా గమనించిన లెవీ (మూడు కాళ్లతోనే) ఒక్కసారిగా అరుస్తూ.. మీద పడ్డంత పనిచేసింది. దీంతో ఏంచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ దుండగుడు గన్‌తో ఆ శునకాన్ని కాల్చి అక్కడ నుంచి పరారయ్యాడు. బుల్లెట్ తలలో నుంచి శునకం ఎడమ కాలి వరకు దూసుకెళ్లింది. దీంతో లేవీని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 2014లో కుటుంబసమేతంగా ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు చెర్రీ కుమారుడు కొండ చివరనుంచి పడిపోతుండగా లేవీనే కాపాడింది. అయితే ప్రమాదవశాత్తు కొండపైనుంచి లేవీ పడిపోవడంతో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. రెండేళ్ల కిందట కూడా వారి కుటుంబాన్ని ఒక భారీ చోరీ నుంచి లేవీ కాపాడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లేవీ హీరోయిజం ముగియలేదని, ఇకముందు కూడా కొనసాగుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు.