breaking news
piracy cd
-
విజయవాడలో భారీ ఫైరసీ రాకెట్
-
పైరసీ సీడీ చూసి సందీప్ కిషన్ షాక్!!
టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు షాక్ తగిలింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా మంచి విజయం సాధించడంతో సంతోషంగా ఉన్న సందీప్.. ఉన్నట్టుండి దాని పైరసీ సీడీలు నేరుగా తన కంట్లోనే పడటంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సందీప్ కిషన్.. తాను ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనంలో ఉన్నట్టుండి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సీడీ చూసి అవాక్కయ్యాడు. సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలే కావడం, ఇంతలోనే సీడీ చూడటంతో హతాశుడయ్యాడు. అందులో ఇటీవలే విడుదలైన తన చిత్రంతో పాటు.. బన్నీ అండ్ చెర్రీ, మసాలా సినిమాలు కూడా ఉన్న సీడీ ఉంది. దాంతో చక్కటి విజయం సాధించిన సంతోషం కాస్తా ఒక్కసారిగా ఉసూరుమంది. ఇలా ఉంటే సినిమాలు ఎలా బాగుపడతాయంటూ ట్విట్టర్లో తన ఆవేదన పంచుకున్నాడు. తనకు ఇది చాలా డిప్రెసింగ్‌గా అనిపిస్తోందన్నాడు. అయితే, పైరసీ వచ్చినా కూడా తన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందుకు వారికి సెల్యూట్ అంటూ మరో ట్వీట్ చేశాడు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ కుదేలు అవుతోందని తెలిసినా, ఇప్పటికీ సినిమా విడుదలైన రెండు మూడు రోజుల్లోనే పైరసీ సీడీలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే విడుదలకు ముందే పైరసీ కాపీ బయటకు వచ్చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో సినీ ప్రముఖులు వాపోతున్నారు. Found this in the Innova I m Traveling to Vijayawada in..Ila unte Cinemalu ela bagupaduthayi..it's depressing :( pic.twitter.com/AQ4BkR3VWb — Sundeep Kishan (@sundeepkishan) December 22, 2013 Inspite of piracy VenkatadriExpress is still declared a superhit..adhi purely Telugu audience gopathanammu :) salute to you — Sundeep Kishan (@sundeepkishan) December 22, 2013