breaking news
pilots suspended
-
విమానం గాల్లోకి ఎగిరాక పైలట్ల ఫైట్.. పాపం ప్రయాణికులు..!
పారిస్: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. విమానాలను నడిపే పైలట్లు ఎంతో నేర్పుతో, నైపుణ్యవంతులై ఉంటారు. సమన్వయంతో విమానాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. అలాంటిది.. వారే విమానంలోని కాక్‌పుట్‌లో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్చల్ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్ నుంచి జెనీవాకు వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానంలోని ఇద్దరు పైలట్లు గొడవకు దిగిన కారణంగా వారిని సస్పెండ్ చేశారు అధికారులు. పైలట్లు గత జూన్ నెలలో విమానం కాక్‌పిట్‌లో గొడవ పడినట్లు ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే, కొద్ది క్షణాల్లోనే గొడవ సద్దుమణిగిందని, ఆ తర్వాత విమాన ప్రయాణం సాఫీగా కొనసాగినట్లు చెప్పారు. తమ ప్రవర్తనపై మేనేజ్మెంట్ నిర్ణయం కోసం పైలట్లు ఇన్నాళ్లు వేచి ఉన్నారని చెప్పారు. ఫ్రాన్స్ పౌర విమానయాన సంస్థ భద్రతా దర్యాప్తు సంస్థ నివేదిక బయటకు రావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూన్‌లో జరిగిన సంఘటన నివేదిక ప్రకారం.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయానికే కాక్‌పిట్‌లో పైలట్, కోపైలట్‌ల మధ్య వివాదం మొదలైంది. దీంతో ఒకరు ఎదుటి వ్యక్తి కాలర్ పట్టుకున్నారు. దాంతో అతడిపై దాడి చేశారు మరొకరు. కాక్‌పిట్ నుంచి అరుపులు క్యాబిన్లోకి వినిపించినట్లు పలువురు తెలిపారు. దీంతో వారు వెళ్లి గొడవను ఆపారని, ఓ పైలట్ ఫ్లైట్ డెక్కు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్ -
ఫుల్లుగా తాగి.. విమానాలు నడుపుతారట!
ఫుల్లుగా తాగేసి.. విదేశాల నుంచి రావాల్సిన విమానాలు నడిపేందుకు వచ్చిన ఇద్దరు పైలట్లపై ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ సంస్థలు వేటు వేశాయి. ప్యారిస్ నుంచి ముంబై రావాల్సిన జెట్ ఎయిర్వేస్ పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేయగా, ఎయిరిండియా పైలట్ రెండోసారి తాగి పట్టుబడటంతో మూడేళ్ల పాటు అతడి లైసెన్సును సస్పెండ్ చేశారు. ఆ పైలట్ బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది. ఇద్దరినీ గ్రౌండ్ చేశారని, వాళ్లిద్దరి లైసెన్సులను డీజీసీఏ సస్పెండ్ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. భారతదేశంలో పైలట్లు తొలిసారి తాగి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి పట్టుబడితే మూడేళ్లు లైసెన్సు సస్పెండ్ చేస్తారు. అదే మూడోసారి కూడా పట్టుబడితే వాళ్ల లైసెన్సును శాశ్వతంగా రద్దుచేస్తారు. ఇతర దేశాలకు చెందిన పైలట్లకు అప్పుడప్పుడు ఈ పరీక్షలు చేస్తారు గానీ, డీజీసీఏ నిబంధనల ప్రకారం భారతీయ పైలట్లను మాత్రం ప్రతిసారీ తప్పనిసరిగా పరీక్షిస్తారు. ఇలా తాగి పట్టుబడిన పైలట్లలో ఎక్కువమంది జెట్ ఎయిర్వేస్ వాళ్లే ఉన్నారు. 2013 నుంఇచ 2015 వరకు దాని అనుబంధ సంస్థ జెట్లైట్తో కలిపి 38 మంది పైలట్లు తాగి పట్టుబడ్డారు.