breaking news
Photo of the Year
-
ఈ సింహాల అనుబంధం చూశారా?
భావోద్వేగాలు అన్నవి మనుషులకే పరిమితమా.. ఈ చిత్రాన్ని చూస్తే.. మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.. ఈ రెండు సింహాలు అన్నదమ్ములు.. చూశారుగా.. వీటి మధ్య బాండింగ్.. ఇలాంటి చిత్రాలు కాస్త అరుదే.. అందుకే ఇది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్స్ చాయిస్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఏటా ఈ అవార్డును లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రదానం చేస్తోంది. మొత్తం 45 వేల ఎంట్రీలు రాగా.. తుది జాబితాకు 25 ఎంపికయ్యాయి. జనం ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని టాంజానియాలో తీశారు. భావోద్వేగాలు అన్నవి మనుషులకే పరిమితం కావన్న విషయాన్ని ఈ ఫొటో నిరూపిస్తోందని.. అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఈ చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ లాయిడ్ అన్నారు. ఈ చిత్రానికి ఆయన పెట్టిన పేరు ఏమిటో తెలుసా? బాండ్ ఆఫ్ బ్రదర్స్.. పర్ఫెక్ట్ కదూ.. -
పులి పోరు.. అవార్డుల జోరు..
ఈరోజు నువ్వో నేనో తేలిపోవాల్సిందే అంటూ హోరాహోరీగా పోరాడుతున్న ఈ పులుల చిత్రం బాగుంది కదూ.. దీన్ని తీసింది మన దేశానికి చెందిన ఫొటోగ్రాఫర్ అర్చనా సింగ్. ఆమె ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 5న మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ జాతీయ పార్కులో తీశారు. ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ రీడర్స్ ఫొటో ఆఫ్ ద ఇయర్-2014 పోటీలో ‘నేచర్’ విభాగంలో ఈ ఫొటోకు ప్రత్యేక ప్రశంస లభించింది.