breaking news
Pharmaceutical industries
-
ఔషధ విక్రయాలకు రెండంకెల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ విక్రయాలు గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో 13 శాతం వృద్ధి చెందాయి. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం నాలుగు మాసాలుగా పరిశ్రమ రెండంకెల వృద్ధి కొనసాగిస్తోందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ వెల్లడించింది. ఆగస్ట్‌లో ఇది 12.1 శాతం నమోదైతే, 2021 సెప్టెంబర్‌లో ఇది 12.6 శాతంగా ఉంది. భారత ఔషధ విపణి యాంటీ–ఇన్ఫెక్టివ్స్, రెస్పిరేటరీ మినహా అన్ని రకాల చికిత్సలలో బలమైన రెండంకెల వృద్ధి కారణంగా మెరుగైన పనితీరును అందించడం కొనసాగించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ధరల్లో 6.6 శాతం పెరుగుదల.. 2021 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఔషధాల అమ్మకాల పరిమాణం 4.5 శాతం ఎగసింది. నూతన ఉత్పత్తుల రాక 1.9 శాతం పెరిగింది. ధరలు 6.6 శాతం దూసుకెళ్లాయి. తీవ్రమైన జబ్బులకు వాడే ఔషధాల విక్రయాలు 9.2 శాతం పెరిగాయి. మొత్తం పరిశ్రమలో వీటి వాటా 47 శాతం. దీర్ఘకాలిక రోగాలకు వాడే మందులు 16.1 శాతం, మిత, మధ్యస్థ వ్యవధి జబ్బులకు ఉపయోగించే ఔషధాల అమ్మకాలు 17.3 శాతం అధికం అయ్యాయి. గైనకాలజీ సంబంధ మెడిసిన్స్ అత్యధికంగా 24.7 శాతం, హృదయ 18.2, చర్మ, నాడీ వ్యవస్థ సంబంధ మందులు 17.8 శాతం ఎగశాయి. కంపెనీల వారీగా ఇలా.. సెప్టెంబర్ నెల అమ్మకాల్లో అత్యధికంగా నాట్కో ఫార్మా 31.2 శాతం వృద్ధి సాధించింది. బయోకాన్ 28.2, గ్లెన్‌మార్క్ 23.2, ఈరిస్ లైఫ్‌సైన్సెస్ 21.2 శాతం దూసుకెళ్లాయి. టోరెంట్, ఆస్ట్రాజెనికా, అజంతా, జైడస్, సన్ ఫార్మా, అబాట్, వొకార్డ్, జేబీ కెమికల్స్, ఇప్కా ల్యాబ్స్ మార్కెట్ కంటే అధికంగా 16 నుంచి 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్డీసీ, ఆల్కెమ్, సిప్లా, గ్లాక్సోస్మిత్‌క్లైన్ 10–12 శాతం, లుపిన్, రెడ్డీస్, అలెంబిక్ 8–9 శాతం అధికంగా విక్రయాలు సాగించాయి. నొవార్టిస్, ఇండాకో రెమెడీస్, ఫైజర్, సనోఫి 3 శాతం లోపు వృద్ధికి పరిమితం అయ్యాయి. ఇక సెప్టెంబర్ త్రైమాసికానికి పరిశ్రమ 13 శాతం వృద్ధి సాధించింది. -
టైం వచ్చింది.. భారత ఫార్మా రంగంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: భారత ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమకు అనుకూల సమయం వచ్చిందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పరిమాణాత్మక (సంఖ్యా పరంగా) స్థాయి నుంచి విలువ పరంగా అగ్రస్థానాన్ని చేరుకోవాలని, అంతర్జాతీయ మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమకు అనుకూలమైన విధానాలతో మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. భారత ఫార్మాస్యూటికల్స్ సమాఖ్యతో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘భారత ఫార్మా విజన్ 2047’కు కార్యాచరణను రూపొందించడంలో భాగంగా మంత్రి పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ‘‘అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను నేర్చుకోవాలి. వాటికి అనుగుణంగా సొంత నమూనాలను రూపొందించుకోవాలి. దేశీయ డిమాండ్ అందుకుంటూనే అంతర్జాతీయంగా విస్తరించాలి. పరిమాణాత్మకంగా అగ్రస్థానంలో ఉన్న పరిశ్రమ.. విలువ పరంగానూ అదే స్థానానికి చేరుకోవాలి. పరిశోధన, తయారీ, ఔషధాల అభివృద్ధిలో అంతర్జాతీయంగా ఉన్న ఉత్త మ విధానాలను సొంతం చేసుకోవాలి’’అని మంత్రి సూచించారు. రానున్న సంవత్సరాల్లో మరింతగా వృద్ధి సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీర్ఘకాల విధానాలు పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకొస్తా యంటూ.. ఈ విషయంలో ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో సమగ్రమైన విధానం అనుస్తామంటూ.. మన విధానాలు భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల అనంతరం తీసుకొచి్చనవిగా పేర్కొన్నారు. ఇవి దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పారు. వినూత్నమైన టెక్నాలజీలపై పరిశ్రమ పెట్టుబడులు పెట్టాలని, తయారీ సామర్థ్యాలను విస్తరించుకోవాలని సూచించారు. పీఎల్ఐ వంటి పథకాలతో ఫార్మా పరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 4 మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
Vadodara Chemical Factory Boiler Blast గుజరాత్: వడోదర ఇండస్ట్రియల్ జోన్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన బాయిలర్‌లో శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు జరిగిన పేలుడులో నాలుగేళ్ల బాలిక, 65 ఏళ్ల వృద్ధుడు సహా నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, గాయాలైన తల్లి (30)తోపాటు గాయపడిన వారినందరిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు అధికారి సాజిద్ బలోచ్ వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల గోడలు కూలడమేకాక, 1.5 కిలోమీటర్ల మేర ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఐతే ఘటనలో మృతి చెందినవారు, గాయపడిన వ్యక్తులు ఫ్యాక్టరీ కార్మికులు, ప్రయాణికులుగా గుర్తించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు తయారుచేసే కాంటన్ లేబొరేటరీస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా గుజరాత్లో ఎనిమిది రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. డిసెంబర్ 16న పంచమహల్ జిల్లాలో ఇదే తరహాలో ఫ్యాక్టరీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చదవండి: Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు! -
ఫార్మాలో రూ.81,730 కోట్ల వ్యాపార అవకాశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 వ్యాక్సిన్ సరఫరా భారత ఔషధ రంగానికి కాసులు కురిపించనుంది. ఇక్కడి తయారీ సంస్థలకు భారత్‌తోపాటు, అంతర్జాతీయంగా వచ్చే మూడేళ్లలో రూ.81,730 కోట్ల వరకు వ్యాపార అవకాశాలు ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ వెల్లడించింది. ‘వ్యాక్సిన్ల విక్రయం ద్వారా యూఎస్ సంస్థలు ప్రీమియం ధరలను ఆస్వాదిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ధరలు ఒక్కో డోసుకి రూ.1,114.5 నుంచి రూ.1,857.5 వరకు ఉంది. ఒక్కో డోసుపై రూ.260 వరకు లాభం గడిస్తున్నాయి. భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు ప్రీమియం ధరను పొందే అవకాశం లేదు’ అని వివరించింది. అంతర్జాతీయంగా ఇలా.. దేశీయ డిమాండ్‌లో ఎక్కువ భాగం మార్చి 2022 నాటికి నెరవేరుతుందని అంచనా. యూరప్, ఉత్తర అమెరికా, అభివృద్ధి చెందిన ఆసియా దేశాల వంటి అధిక ఆదాయ మార్కెట్లలో ఎగుమతి అవకాశాలు పూర్తిగా అయిపోయాయి. చైనా, జపాన్, కొన్ని దక్షిణ అమెరికా దేశాలను మినహాయించి వివిధ ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎగుమతికి ఆస్కారం ఉంది. ఇక్కడ టీకా వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. డిమాండ్ 125 కోట్ల డోసుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా ఆగస్ట్ 10 నాటికి 435 కోట్ల డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్స్ నమోదయ్యాయి. భారత్‌లో అవకాశాలు.. వ్యాక్సినేషన్లో భాగంగా ఆగస్ట్ 10 నాటికి భారత్‌లో 50 కోట్ల డోసులు నమోదయ్యాయి. దేశంలో మరో 200 కోట్ల డోసులు అవసరం. ఇక్కడ రోజుకు 50–55 లక్షల డోసుల స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. ఈ ఏడాది జనాభాలో అత్యధికులకు వ్యాక్సినేషన్ పూర్తి కావొచ్చని అంచనా. ఈ కాలంలో భారత ఫార్మా సంస్థలకు రూ.34,180 కోట్ల వ్యాపార అవకాశం ఉంటుంది. ఎగుమతులు పెరగడంతో ఇది వచ్చే ఏడాది నాటికి రూ.36,410 కోట్లకు చేరుకుంటుంది. 2023లో డిమాండ్ రూ.11,890 కోట్లకు పరిమితం అవుతుంది’ అని కేర్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. -
జనం పైకి కాలకూటం
సాక్షి, సిటీబ్యూరో: వడ్డించేవాడు మనవాడైతే చాలు బంతిలో ఏ మూలన కూర్చున్నా ఫరవాలేదన్నట్లుంది కొన్ని పరిశ్రమల తీరు. రాష్ట్ర సర్కారు పెద్దల అండతో.. బడా పరిశ్రమల లాబీ ఏకంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకే తిలోదకాలిచ్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) జారీ చేసిన సూచనలనూ తుంగలోకి తొక్కింది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 1999 నుంచి అమల్లో ఉన్న ‘బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెంపు, విస్తరణ నిషేధా’నికి నిలువెల్లా తూట్లు పొడిచి తమ పబ్బం గడుపుకొంటోంది. 1999లో జారీచేసిన నిషేధం ఉత్తర్వులను కాలరాస్తూ 2013 జూలై 25న తమకు అనుకూలంగా పారిశ్రామిక విస్తరణ ఉత్తర్వులు తెచ్చుకున్న పె(గ)ద్దల ఉదంతం సర్వత్రా కలకలం సష్టిస్తోంది. జనంపైకి కాలకూటం వదులుతున్న సుమారు 250 పరిశ్రమలకు ఈ ఉత్తర్వులు కాసుల పంట పండిస్తున్నాయని పర్యావరణ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నగర శివార్లలోని జీడిమెట్ల, పాశమైలారం, గడ్డపోతారం, ఖాజిపల్లిలతో పాటు రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వదులుతున్న జల, వాయు కాలుష్యంతో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లోగడ స్పష్టం చేసింది. 2010లో దీనికి సంబంధించి విడుదల చేసిన పర్యావరణ కాలుష్య సూచీ ప్రమాదకర స్థాయిలో ఉంది. 2010లో 70.7గా నమోదైన పర్యావరణ కాలుష్య సూచీ.. 2011 నాటికి 74.58 గా నమోదైందని పేర్కొంది. 2013 నాటికి ఇది అత్యధికంగా 76.05కు చేరడం తథ్యమని స్పష్టం చేసింది. అయితే సీపీసీబీ జారీ చేసిన వాస్తవాలకు పరిశ్రమల లాబీ మసిబూసి మారేడుకాయ చేసింది. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్య సూచీ కేవలం 47.33 శాతానికి తగ్గినట్లు చూపుతూ తప్పుడు నివేదికను సష్టించి ఏకంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పీసీబీ అప్పిలేట్ అథారిటీ, రాష్ట్ర పరిశ్రమల శాఖలోని ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి తమ దారిలోకి తెచ్చుకుంది. అంతేకాదు ఆయాకంపెనీల నుంచి వెలువడుతున్న నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), వాయు కాలుష్యంలో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ధూళిరేణువులు, సూక్ష్మ ధూళికణాల మోతాదును తక్కువగా చూపడం గమనార్హం. అంతటితో ఆగక రాష్ట్ర సర్కారు పెద్దలకు సైతం పెద్దమొత్తంలో తాయిలాలు ముట్టజెప్పి ప్రసన్నం చేసుకొని నిషేధం విధించిన ఉత్తర్వులను సవరించుకోవడంలో సఫలీకతం కావడం గమనార్హం. పర్యావరణానికి తీవ్ర హాని కొన్ని బడా కంపెనీలు పరిమితికి మించి ఉత్పత్తులు తయారు చేస్తుండడంతో పారిశ్రామిక వ్యర్థజలాలు అనూహ్యంగా ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని పటాన్‌చెరులోని పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి కేంద్రం (పీఈటీఎల్), జీడిమెట్లలోని శుద్ధికేంద్రం (జేఈటీఎల్)లకు తరలించడంలో విఫలమౌతున్నాయి. తమకు కేటాయించిన పరిమితికి మించి వ్యర్థాలు ఉత్పన్నం అవుతుండడంతో వాటిని యథేచ్ఛగా చుట్టుపక్కల ప్రదేశాలకు విడుదల చేస్తున్నాయి. మరికొన్ని పరిశ్రమలు ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు తరలించి రాత్రి వేళల్లో వ్యర్థజలాలను డంప్ చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషతుల్యమౌతున్నాయి. పారిశ్రామిక ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ సెంటర్‌కు తరలించే విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడికక్కడే ఘన వ్యర్థాలను పూడ్చుతుండడంతో పరిస్థితి విషమమౌతోంది. పెద్దపెద్ద బల్క్‌డ్రగ్ పరిశ్రమలు తమ ఉత్పత్తులనుఇంటర్మీడియెట్ కంపెనీలకిచ్చి ఉత్పత్తులు తయారు చేయిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ కంపెనీల్లో జల,వాయు,ఘన వ్యర్థాల కాలుష్యాన్ని కట్టడిచేసే ఉపకరణాలు పూర్తిస్థాయిలో లేవు. ఇక్కడ తయారైన ఉత్పత్తులకు తమ లోగో తగిలించి పెద్ద కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అక్కడి కాలుష్యంతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. పలు పరిశ్రమలు తమకు అనుమతి ఉన్న దానికంటే వందరెట్లు అత్యధికంగా ఉత్పత్తులు తయారుచేస్తూ పర్యావరణానికి పొగ బెడుతుండడం పట్ల పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన జలాలను 1200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఆవిరి చేస్తున్నట్లు చెబుతున్న పరిశ్రమలు.. పెరిగిన విద్యుత్ చార్జీల నేపథ్యంలో ఆ పనిచేయడం లేదు. వాటిని సమీప నా లాలు, చెరువుల్లోకి రాత్రి వేళల్లో వదిలేస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు కలిసిన జల ఉద్గారాలను శుద్ధి చేసేందుకు సొంతంగా పరిశ్రమలోనే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ)ని ఏర్పాటు చేయడంలో చాలాపరిశ్రమలు విఫలమయ్యాయి. ఇక జల ఉద్గారాల్లోని పర్యావరణానికి తీవ్ర హాని చేసే మూలకాలను శుద్ధిచేసే రివర్స్ అస్మోసిస్ ప్లా ంటు ఏర్పాటులోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పలు పరిశ్రమలు వాయు ఉద్గారాలను వడకట్టే స్ట్రిప్పర్ ఏర్పాటు విషయాన్ని విస్మరించాయి. కర్మాగారాల్లో ఘన, ద్రవ, వాయు ఉద్గారాల్లో హానికారక మూలకాలను ఆవిరి చేసే మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ (ఎంఈఈ), ఎజిటేటెడ్ థిన్ ఫిల్మ్ డ్రైవర్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిషేధానికి తూట్లు ఇలా.. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1999 ఏప్రిల్ 20న జారీ చేసిన నిషేధం ఉత్తర్వుల (జి.ఓ.ఎం.ఎస్.నెం.62) ప్రకారం నగర శివార్లు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలోని బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచరాదు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు కిలోమీటరు పరిధిలో ఎలాంటి విస్తరణ చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. జల, వాయు కాలుష్య చట్టాలను ఉల్లంఘించే పనులకూ పాల్పడరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ.. పరిశ్రమల లాబీ ఈ నిషేధానికి తెలివిగా తిలోదకాలిచ్చేలా చేసింది. ప్రభుత్వ పెద్దలను ఏడాదిగా అన్ని విధాలా ప్రసన్నం చేసుకొని 2013 జూలై 25న నిషేధం ఉత్తర్వులకు సవరణ చేస్తూ జి.ఒ.ఎం.ఎస్.నెం.64 జారీ అయ్యేలా చేసింది. దీని ప్రకా రం జీరో లిక్విడ్ డిశ్చార్జి (జల,వాయు,ఘన కాలుష్య ఉద్గారాలు పరిమితులకు లోబడి)ఉండే విధంగా ఉపకరణాలను ఏర్పాటు చేసుకున్న తరవాత ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ చర్యలు చేపట్టుకోవచ్చన్న సాకుతో నిషేధాన్ని ఎత్తివేసేలా చేసింది. ఈ ఉత్తర్వులతో తమ ఉత్పత్తులను అనూహ్యంగా పెంచుకునేందుకుగేట్లు బార్లా తెరిచినట్లైంది. దీంతో పరిశ్రమల లాబీ ఆగడాలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. చాలా పరిశ్రమలు తూతూ మంత్రం చర్యలు తీసుకొని చేతులు దులుపుకొన్నాయి తప్ప ఎక్కడా కాలు ష్య ఉద్గారాలను కట్టడి చేసే ఉపకరణాలను పూర్తిస్థాయిలో ఏ ర్పాటు చేసిన దాఖలాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అనర్థాలివే... పరిశ్రమలు వదులుతున్న గాఢత కలిగిన వ్యర్థాలతో పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి వెలువడుతున్న ద్రవ వ్యర్థాలు నాలా నీటిని విషమయం చే స్తున్నాయి. నిత్యం ఈ నాలాలో ప్రవహిస్తున్న 70 మిలియన్ లీటర్ల మురుగు నీరు, కూకట్పల్లి నాలాలో కలుస్తున్న మరో 80 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో అధిక గాఢత గల రసాయనాలు కలుస్తున్నట్లు పీసీబీ టాస్క్‌ఫోర్స్ బందాలు నిగ్గుతేల్చాయి. జీడిమెట్ల, కూకట్పల్లి నాలాల నుంచి రోజువారీ గా వచ్చి కలుస్తున్న 150 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో పారిశ్రామిక వ్యర్థాలుంటున్నా యి. ఇవి నేరుగాా హుస్సేన్‌సాగర్‌లో చేరుతుండడంతో చారిత్రక సాగరం గరళంగా మారుతోంది. మియాపూర్, కేపీహెచ్‌బీ, బాలానగర్, సనత్‌నగర్, కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పీల్చే గాలిలో అమ్మోనియా మోతాదు పెరగడంతో కళ్ల మంట లు, ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. క్యూబిక్ మీటర్ గాలిలో ధూలికణాల సాంద్రత 500కి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటరు గాలిలో 200 మైక్రోగ్రాములకు మించరాదు. భూగర్భ జలాలు ఉపయోగించడానికి వీల్లేకుండా రంగు మారాయి. ఇందులో ఆర్సినిక్, కాడ్మియం, మెర్య్కురీ వంటి హానికారక మూలకాలున్నట్లు ఎన్జీఆర్ఐ (జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ) అధ్యయనంలో తేలింది. పారిశ్రామిక కాలుష్యం పెరుగుతుండడంతో ఇటీవల శ్వాసకోశ వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. సమీప భవిష్యత్‌లో పారిశ్రామిక కాలుష్యం మరింత పెరిగితే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు పెరుగుతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.