breaking news
Petlaburj public hospital
-
అక్కడంతా సపరేటు: అబ్బాయి పుడితే రూ. 2 వేలు, మరి అమ్మాయికి..
సాక్షి, చార్మినార్: పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నా.. వైద్య సేవలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. దీంతో గర్భిణులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాతబస్తీలో గర్భిణుల కోసం అత్యంత అధునాతనమైన వైద్య సేవలు అందించడానికి పేట్ల బురుజులో ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఉంది. ఇక్కడ దోమల బెడద అధికంగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాత్రూంలతో పాటు పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉందంటున్నారు. డబ్బులు ఇవ్వందే ఏ పనీ కాదు... ► కింది స్థాయి సిబ్బంది గర్భిణుల వద్ద నుంచి ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని బోరు మంటున్నారు. ► మగ పిల్లవాడు పుడితే రూ. 2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.15 వందలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► ప్రసవం జరిగిన వెంటనే పాప, బాబులను చూపించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వినిపిస్తుంటాయి. ► అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు. ► ఈ విషయాన్ని సంబంధిత వైద్యాధికారులతో పాటు సిబ్బంది ఖండించారు. ► వారి సంతోషం కోసం చాయ్ తాగమని ఎవరైనా డబ్బులిస్తే ఇచ్చి ఉండవచ్చుగానీ..సిబ్బంది డిమాండ్ చేయడం లేదన్నారు. 634 పడకల ఆస్పత్రిలో రౌండ్ ది క్లాక్ వైద్య సేవలు.. ► పాతబస్తీ పేద మహిళలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో దివంగత నేత డాక్టర్ వైఎస్‌రాజ శేఖర్‌రెడ్డి పేట్ల బురుజులో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ► మొదట్లో 462 పడకల ఈ ఆస్పత్రిలో మరో 172 పడకలను పెంచి..మొత్తం 634 తో రౌండ్ ది క్లాక్ వైద్య సేవలను అందిస్తున్నారు. ► ప్రతి రోజూ ఉదయం అవుట్ పేషంట్లకు వైద్య సేవలు కొనసాగుతాయి. అవుట్ పేషంట్ విభాగం మూసిన అనంతరం అత్యవసర కేసులను రౌండ్ ది క్లాక్ తీసుకుంటారు. ► కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేస్తారు. మల,మూత్ర,రక్త పరీక్షలతో పాటు ఎక్స్ రేను ఉచితంగా నిర్వహిస్తారు. ► రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అసౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. ► పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రిలో సౌకర్యాలను కూడా పెంచాలని రోగులు వారి బంధువులు కోరుతున్నారు. చదవండి: మాజీ కార్పొరేటర్ దారుణ హత్య.. ఖండించిన సీఎం -
అబార్షన్ కోసం వచ్చిన గర్భిణి మృతి
శాలిబండ: అబార్షన్ కోసం వచ్చిన ఓ గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రాత్రి జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని మృతురాలి బంధువులు గురువారం అసెంబ్లీ ఎదుట ఆందోళనకు యత్నించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొండాపూర్‌కు చెందిన చెన్నయ్య భార్య యాదమ్మ(36) ఇటీవల గర్భం దాల్చింది. ఇప్పటికే ఆమెకు 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ వయసులో పిల్లల్ని కనడం కష్టమని భావించింది. అబార్షన్ చేయించుకునేందుకు గత నెల 22నపేట్లబురుజు ఆస్ప్రత్రికి వచ్చింది. ఎంటీపీ సమస్య ఉన్న కారణంగా ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని ఆమెకు అబార్షన్ చేయాల్సిందేనని వైద్యులు కూడా సూచించారు. తర్వాత చేయించుకుంటానని వెళ్లిన ఆమె బుధవారం ఆస్పత్రికి వచ్చింది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఆపరేషన్ గదికి తీసుకువెళ్తుండగా యాదమ్మ మృతి చెందింది. కాగా ఆమె మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వస్తే తెలుస్తాయని ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ శ్రీదేవి తెలిపారు. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహంతో యాదమ్మ కుటుంబ సభ్యులు గురువారం అసెంబ్లీ ఎదుట ధర్నా చేసేందుకు యత్నించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.