breaking news
Personal Trainer
-
త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న ఇతన్ని గుర్తుపట్టారా?
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ( Anant Ambani ), రాధికా మర్చంట్ల ( Radhika Merchant ) వివాహం త్వరలో జరగబోతోంది. మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అనంత్ అంబానీ బరువు తగ్గడం, ఆ తర్వాత పెరగడం గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ అనంత్ అంబానీ కొన్ని నెలల్లోనే 108 కిలోలు ఎలా తగ్గగలిగారు అని అందరూ ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటారు. అప్పట్లో ఆయన అంతలా బరువు తగ్గడానికి ప్రధాన కారణం ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా. ఎవరీ వినోద్ చన్నా? దేశంలోని ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన వినోద్ చన్నా, ఒకప్పుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పర్సనల్ ట్రైనర్. కఠినమైన ఆహారం, వ్యాయామ నియమావళి ద్వారా కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడానికి అతను సహాయం చేశాడు. వినోద్ చన్నాది స్వయంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. అతను ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి చాలా కృషి చేశాడు. అతను ఒకప్పుడు చాలా బక్కపలచగా ఉండేవాడు. దీంతో అతన్ని అందరూ హేళన చేసేవారు. ఒక ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. తాను పెరిగే సమయంలో పోషకాహార లోపంతో బాధపడేవాడినని చెప్పాడు. ఫిట్నెస్ ట్రైనర్‌గా విజయం సాధించడానికి ముందు వినోద్ చన్నా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డు వంటి చిన్న చిన్న పనులెన్నో చేశాడు. వినోద్ చన్నా పెరిగేకొద్దీ జీవితంలో ఫిట్నెస్ ప్రాముఖ్యతను గ్రహించి జిమ్‌లో చేరాడు. ఇదే అతని ప్రయాణాన్ని మలుపు తిప్పింది. అనంత్ అంబానీతో కలిసి పనిచేసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో వినోద్ చన్నా మాట్లాడుతూ.. బరువు తగ్గడంలో అనంత్ అంబానీ నిబద్ధతను తెలియజేశారు. అనంత్ అంబానీ కోసం అధిక ప్రోటీన్, హై ఫైబర్, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారంతో ప్రత్యేక డైట్ ప్లాన్ రూపొందించినట్లు వినోద్ చన్నా తెలిపారు. ఆయన ఫీజు ఎంతంటే.. అనంత్ అంబానీతో పాటు నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు వినోద్ చన్నా పర్సనల్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎంత చార్జ్ చేస్తారో చెప్పలేదు కదా.. 12 ట్రైనింగ్ సెషన్ల ప్యాకేజీకి వినోద్ చన్నా రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. -
ఫిట్నెస్ అండ్ బాడీబిల్డింగ్..
appకహానీ... ప్రస్తుతం ప్రముఖులు, సినీ తారలు నాజూకైన శరీరాకృతి కోసం పర్సనల్ ట్రైనర్లను నియమించుకుంటున్నారు. దీని కోసం వారు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చిస్తారు. వీరిలా ఆ స్థాయిలో మనం పర్సనల్ ట్రైన ర్లను ఏర్పాటు చేసుకోలేం కదా..!! కాకపోతే మంచి శరీరాకృతిని పొందటానికి మనకూ కొన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ‘ఫిట్నెస్ అండ్ బాడీబిల్డింగ్’ అనే హెల్త్, ఫిట్నెస్ యాప్. దీన్ని మనం మన స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు... ►యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ►ప్రతి వర్క్ఔట్కు సంబంధించిన వీడియోను చూడొచ్చు. దాని ప్రకారం మనం వర్క్ ఔట్ చేయొచ్చు. ►ఏ వర్క్ఔట్తో ఏ ఏ భాగాలు ప్రభావితం అవుతాయో వివరించారు. ►ప్రతి ఎక్సర్సైజ్కు సంబంధించి బొమ్మలతో కూడిన వివరణలు ఇచ్చారు. ►చేసిన వ్యాయామాలను సేవ్ చేసుకొని, వాటి వివరాలు చూసుకోవచ్చు. ►బిల్ట్ ఇన్ టైమర్, క్యాలెండర్ ఫీచర్లు ఉన్నాయి.వర్క్ఔట్లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి మనకు నచ్చిన ఫొటోను పెట్టుకోవచ్చు.