breaking news
Pension applicants
-
రెండేళ్ల వెయిటింగ్.. 9 రోజుల్లో క్లోజింగ్!.. పింఛన్ల పోర్టల్‌కు ‘తాళం’
సాక్షి, అమరావతి: కొత్త పింఛన్ల మంజూరు కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ పట్టుమని పది రోజులు కూడా సాగలేదు. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కారి్మకులు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులకు కొత్త పింఛన్లకు అర్హత ఉన్నా.. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమకూర్చుకునేలోపే దరఖాస్తు ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల నమోదు ప్రక్రియ కేవలం 9 పనిదినాల్లో శుక్రవారం (18వ తేదీ)తో ముగిసింది. గడచిన రెండేళ్ల రెండు నెలల కాలంలో అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించలేదు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఒకరోజు ముందు ప్రకటించి మరునాటి నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల నమోదును మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్లపాటు పింఛన్ కోసం ఎదురు చూసిన లక్షలాది మంది ఒకేసారి దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయాలకు క్యూ కట్టారు. దరఖాస్తులు స్వీకరించిన ప్రతిరోజూ దరఖాస్తుల నమోదు పోర్టల్ మొరాయించింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులు అన్ని అర్హతలున్నా వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. అష్టకష్టాలు పడి పత్రాలు తెచ్చుకున్నా.. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డులో గతంలో ఏమైనా మార్పులు చేసుకున్నారా అనే వివరాల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆ పత్రం ఎక్కడ దొరుకుతుందో తెలియని అవ్వాతాతలు వారం రోజులపాటు అన్ని ఆఫీసులు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగారు. చాలామంది ఆ మార్పులు, చేర్పుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకునేలోపే దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయింది. వితంతువులకు సైతం ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు. పింఛన్ దరఖాస్తుతోపాటు భర్త మరణానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేశారు. మరణ ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవడానికే కనీసం 21 రోజులు సమయం పడుతుంది. అయితే, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కనీసం పది రోజులు కూడా సాగకపోవడంతో ఆ నిర్ణీత గడువులోగా అర్హత ఉండీ దరఖాస్తు చేసుకోలేకపోయిన లక్షలాది మంది పేదలు ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటుందోనని ఆందోళన పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికి ఎప్పుడిస్తారో తెలియదు.. అంతా గోప్యతే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అర్హులైన వారు వలంటీర్ల ఆధ్వర్యంలో నిరంతరం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. అప్పట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ఎప్పుటికప్పుడే కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఏ సచివాలయ పరిధిలో ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారన్న వివరాలతో అందులో ఎవరికి మంజూరు చేశారు, ఎవరికి ఏ కారణంతో తిరస్కరించారనే వివరాలను గ్రామసభలో చర్చించి, ఆయా జాబితాలను ఆయా సచివాలయాల నోటీసు బోర్డుల్లో పెట్టేవారు. అప్పట్లో అంతా పూర్తి పారదర్శకంగా పింఛన్ల మంజూరు ప్రక్రియ కొనసాగగా.. చంద్రబాబు సీఎం అయ్యాక రెండేళ్ల రెండు నెలల తర్వాత దరఖాస్తులకు వీలు కల్పించి, ఆ ప్రక్రియనంతా రహస్యంగా చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరు ఎలాంటి దరఖాస్తు చేసుకున్నా.. ఆ దరఖాస్తు వివరాలన్నీ ఆన్లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు 7వ తేదీ తర్వాత మొదట రెండు రోజులపాటు అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచారు. గత శుక్రవారం నుంచి దరఖాస్తుల సంఖ్యతో పాటు దరఖాస్తుదారుల వివరాలన్నీ ప్రభుత్వం అందరికీ కనిపించకుండా చేసింది. ఈ మేరకు సచివాలయాల సేవ పోర్టల్‌లో మార్పులు చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా మాత్రమే మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు చూస్తే అర్హతల్ని పక్కన పెట్టి పచ్చపార్టీ నేతలకు నచ్చిన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 13.63 లక్షల దరఖాస్తులు ఈ నెల 7నుంచి 18వ తేదీ వరకు దాదాపు 13.63 లక్షల దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందులో దాదాపు సగం అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఆ దరఖాస్తులపై లబ్ధిదారుల ఇళ్ల వద్ద పరిశీలన కార్యక్రమం ఈ నెల 23 వరకు కొనసాగుతుందని చెబుతున్నారు. ఆ తరువాత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఎంపిక చేసిన దరఖాస్తుదారుల జాబితాలను ఉన్నతాధికారులకు పంపనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
నెలకు రూ.55 కడితే చాలు.. జీవితాంతం పెన్షన్
-
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్‌కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్‌కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్‌గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు. -
రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్.. ఎలాగంటే?
ఉద్యోగం లేనివారికి, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, కూలీలకు పెన్షన్ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రోజూ టీ తాగే ఖర్చుతో నెలకు రూ.5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. అదే మీరు కొంత ఆలస్యంగా అంటే మీ ఇరవైఐదో ఏట ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాలి. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40వ ఏట దీన్ని ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్ పొందే వీలుంది. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా చిన్న వయసులోనే నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతోనే రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. -
సెల్ఫీతో లైఫ్ సర్టిఫికెట్
సాక్షి, కాజీపేట అర్బన్: ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఉద్యోగులు పెన్షన్దారులుగా వృద్ధాప్యంలో తమ శేష జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. కాగా ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు పెన్షన్‌దారుడు లైఫ్ సర్టిఫికెట్‌ను సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో లేదా బ్యాంకులో అందజేస్తే సంబంధిత అధికారులు పెన్షన్‌దారుడు జీవించి ఉన్నట్లుగా ధృవీకరించి పెన్షన్ అందజేస్తారు. ఒకవేళా పెన్షన్‌దారుడు ట్రెజరీ కార్యాలయం, బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లో లేదా మీ–సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ ఆధారిత లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయాలి. ఇందుకు రూ.30 చెల్లించాలి. సకాలంలో లైఫ్ సర్టిఫికెట్ అందజేయకపోతే పెన్షన్ నిలపి వేయబడుతుంది. దీంతో పెన్షన్‌దారుడికి టెన్షన్ మొదలవుతుంది. పెన్షన్‌దారులకు వరంలా.. నేటి ఆధునిక యుగంలో మారుతున్న టెక్నాలజీ వృద్ధాప్యానికి చేరుకున్న పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం టీయాప్–ఫోలియో వరంగా మారనుంది. ఇంట్లో ఉంటునే కేవలం ఒక సెల్ఫీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేసే విధంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం టీ యాప్ ఫోలియోకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాబై వేల మంది, ఉమ్మడి వరంగల్‌లో సుమారు ఇరవై వేల మంది పెన్షన్‌దారులకు లైఫ్ సర్టిఫికెట్ అందజేయడంలో చాలా ఈజీగా మారనుంది. యాప్ డౌన్లోడ్ ఇలా.. పెన్షన్‌దారులు తొలుత తమ ఆండ్రాయిడ్ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి టీ యాప్–ఫోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడీగా మొబైల్ నెంబర్ స్వీకరిస్తుంది. ఎంపీన్ను పాస్‌వర్డ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయడం ద్వారా టీ–యాప్ ఫోలియోలోకి లాగిన్ అవుతారు. యాప్‌లోకి ప్రవేశించిన అనంతరం పెన్షనర్ అన్యూవల్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనే అప్షన్‌ను క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా పెన్షనర్ ఐడీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఎలక్షన్ ఓటర్ ఈపీక్ నెంబర్ , అసెంబ్లీ నియోజకవర్గం పేరును ఎంటర్ చేయాలి. అనంతరం పెన్షన్‌దారుడు ఒక సెల్ఫీ దిగి పంపించాలి. సెల్ఫీ ఫోటో జనాభా లెక్కల (ఓటర్ ఐడీ)తో సరిపోలితే ఆమోదం పొందినట్లుగా ధృవీకరిస్తూ ఒక మెసేజ్, రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. పెన్షన్‌దారుడికి అందిన మెసేజ్ సంబంధిత ట్రెజరరీ, బ్యాంకు అధికారికి చేరడంతో లైఫ్ సర్టిఫికెట్ అందించినట్లుగా భావిస్తారు. దీంతో పెన్షన్‌దారులకు లైఫ్ సర్టిఫికేట్ అందించడంలో ఏర్పడే కష్టాల నుంచి ఒక సెల్ఫీతో ఊరట లభించనుంది. సద్వినియోగం చేసుకోవాలి... పెన్షన్‌దారులు ప్రభుత్వం, ట్రెజరరీ శాఖ ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫేస్ రికాగనైజేషన్ టెక్నాలజీ ద్వారా మొట్టమొదటి సారిగా పెన్షన్‌దారుడు టీయాప్–ఫోలియో సౌజన్యంతో సెల్ఫీ అందిస్తే కార్యాలయంలోని రికార్డుల ఆధారంగా ఆమోదం అందిస్తాం. ఒక్క సారి ఆమోదం పొందిన పెన్షన్‌దారుడు తర్వాత ఏడాది నుంచి లైఫ్ సర్టిఫికెట్ అందజేయకపోయినా ఆటోమెటిక్‌గానే ఆమోదం పొందుతారు. - గుజ్జురాజు, ఉప సంచాలకులు, జిల్లా ఖజానా కార్యాలయం -
పింఛన్ దరఖాస్తుల్లో భారీగా కోత!
విజయనగరం అర్బన్ :అర్హులందరికీ సామాజిక భద్రత పింఛన్ వర్తింపచేసి ‘ఆసరా’గా నిలుస్తామని చెబుతున్న రాష్ట్ర పాలకులు... చేతల్లో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే పింఛన్‌దారుల సంఖ్యను భారీగా కుదించిన సంగతి తెలిసిందే. అయితే నూతనంగా మంజూరు చేయబోతున్న పింఛన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించే పనిలో పడింది. పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న 36 వేల మందిలో కేవలం 11,710 మందిని మాత్రమే ప్రాథమికంగా ఎంపిక చేశారు. మిగిలిన వారిని ఎందుకు ఎంపిక చేయలేదో స్పష్టమైన కారణాలను వివరించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులందరికీ పింఛన్ ఇస్తామని చెప్పి ఇలా కొందరినే ఎంపిక చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 11,710 మంది పేర్లతో ప్రాథమిక అర్హత జాబితాను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు పంపింది. ఈ జాబితాలోని అర్హతలను మరోసారి పరిశీలించే బాధ్యతను గ్రామ స్థాయి జన్మభూమి కమిటీలు అప్పగించారు. ఈ మేరకు కమిటీలు నిర్థారించి ప్రకటించిన తుదిజాబితాను ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకొని తుదిజాబితాలను జిల్లా కేంద్రాలకు పంపాలి. ఆ జాబితాకు జిల్లా కమిటీ అనుమతి ఇస్తుంది. ఈ లెక్కన రానున్న ఏప్రిల్ నెలకు కూడా నూతన పింఛన్లు వచ్చే పరిస్థితి కనబడలేదు. మరోవైపు తుదిజాబితా ఎంపిక బాధ్యత జన్మభూమి కమిటీలకు అప్పగించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గ్రామల్లో రాజకీయ జోక్యం తారస్థాయిలో చేరుతుంది. 36వేల మందిలో 11,710 మందిని ఎంపిక జిల్లాలో జరిగిన జన్మభూమి, మాఊరి పిలుస్తోంది వంటి కార్యక్రమాల్లో 45 వేల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత ధ్రువీకరణ పత్రాలను అనుసంధానం చేసిన తరువాత 36 వేల దరఖాస్తులు మిగి లాయి. రాష్ట్రప్రభుత్వ అనుమతి కోసం పంపిన ఆ జాబితాలో కేవలం 11,710 మంది మాత్రమే ప్రాథమికంగా అర్హులని తాజాగా అదేశాలొచ్చాయి. వీరిలో వికలాంగులు-4,168, వితంతువులు-4,107, ఓఏపీ-3,137, వీవర్స్-121, టోడీ టాపర్స్-177 మంది ఉన్నారు. ప్రాథమి క జాబితాలోలేనివారి అనర్హతకు కారణాలు చెప్పకపోవడంపై పలు అ నుమానాలు వస్తున్నాయి. కొత్త పింఛన్ల సంఖ్యను పరిమితం చేయడానికే అంటూ విమర్శలు వస్తున్నాయి.


