breaking news
peddy reddy ramachandra reddy
-
బాబు.. సెక్యూరిటీ లేకుండా వెళ్లండి.. ప్రజలే చెబుతారు: పెద్దిరెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాగే, బనకచర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు.. రెండు రూపాయల కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. గ్రామాల్లో తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. బాబు ష్యూరీటీ మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలి.బనకచర్ల ప్రాజెక్ట్ పై గురు శిష్యులు దోబూచులాడుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరిపై మరొకరు పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి తెర లేపారు. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలనా అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గు చేటు. సంక్షేమ పథకాలను ఏడాది విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఏంటి?.రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక ఆయన హయాంలోని సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. మోసపురిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత జగన్‌కే దక్కింది. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. పోలీసుల పహారా మధ్య ఇంటింటికి.. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారు. సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలే చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
జగన్ పాలన వల్లే ఈ ఫలితాలు
-
‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’
-
అవినీతిమయం
► బాబు వంచనను ప్రజలకు వివరించాలి ► వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గెలిపించి తీరాలి ► వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలో పెద్దిరెడ్డి, భూమన ► అట్టహాసంగా ముగిసిన ప్లీనరీ... ► 34 తీర్మానాలకు ఆమోదం తిరుపతి మంగళం/ తిరుపతి అర్బన్ : రాష్ట్రాన్ని అవినీతికి నిలయంగా మార్చిన సీఎం చంద్రబాబుకు దండుకోవడం, దాచుకోవడం మాత్రమే తెల్సునని వైఎస్సార్సీపీ శాసనసభా ఉప పక్షనేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం తిరుపతిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన జిల్లా ప్లీనరీలో పెద్దిరెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లను గెలిపించి ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి బహుమతిగా అందించాల్సి ఉందన్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పనిచేయాలన్నారు. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం రాష్ట్రానికి సరైన నాయకుడు లేక చిన్నపాటి అభివృద్ధికి నోచుకోక గందరగోళంగా తయారైంది. అప్పటి కాంగ్రెస్ పాలనలో మూడేళ్లు, ఇప్పుడు చంద్రబాబు పాలనలో మరో మూడేళ్లు పాటు రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అధికార దాహంతో ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా నోటికి వచ్చిన అబద్దపు హామీలతో అధికారం చేజించుకున్నాడు. అధికా రంలోకి వచ్చాక ప్రజల సంక్షేమాన్ని గాలికి వది లేసి అవినీతి అక్రమాలతో రూ.లక్షల కోట్లు దండుకోవడమే లక్ష్యంగా మందుకు పోతున్నాడని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి సూచిం చారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. అవినీతి ప్రభుత్వ పాలనకు సమాధి కట్టేందుకు కార్యకర్తలు కంకణబద్దులై కదలాలని పిలుపుని చ్చారు. గుక్కెడు తాగునీటిని అందించడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమై మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. గామీణ ప్రాంతాల్లో చిన్నపాటి అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు. దళితకాలనీలు, గిరి జన తాండాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయన్నారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారన్నారు. వైఎస్సార్, జగన్ ఫొటోలతో గెలుపొంది డబ్బులకు, మంత్రి పదవులకు కక్కుర్తి పడి టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను దూషిం చడం, విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, అనుబంధ సంఘాల నాయకులు ప్రసంగించారు. రాష్ట్రంలో రాక్షస, అరాచకపాలన అంతం కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా నాయకత్వం కావాలని జిల్లా స్థాయి పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. జిల్లానలుమూలల నుంచి ప్లీనరీకి కార్యకర్తలు ఉత్సాహంగా తరలి వచ్చారు.