breaking news
pedakakani temple
-
గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్
-
పెదకాకాని ఆలయంలో నగల మాయం కేసులో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: పెదకాకాని శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐదుగురు అర్చకులను అధికారులు సస్పెండ్ చేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు చదలవాడ జాలయ్య చదలవాడ మణికంఠ శాస్త్రి, పొత్తూరు విజయ్ ప్రతాప్, కందుర్తి విశ్వనాధ్, గిరికుమార్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. చోరీతో తమకు సంబంధం లేదని నిన్న అర్చకుల ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్ పెట్టిన 24 గంటల్లోనే అర్చకులపై ప్రభుత్వం వేటు వేసింది. ఆలయ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి నగలు మాయంపై అర్చకులు స్పందిస్తూ.. ఆలయ ప్రాంగణంలో నిన్న(మంగళవారం) మీడియా సమావేశం నిర్వహించారు. శివాలయంలో భగవంతుని సేవ చేసుకుని జీవనం సాగిస్తున్నామే కానీ దొంగలం కాదని ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు అన్నారు. స్థానాచార్యులు మాట్లాడుతూ స్వామి సేవ చేసుకోవడమే తప్ప దొంగతనం చేసే వారము కాదన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే శ్రావణమాసం విశేష అలంకరణల్లో భాగంగా ఈనెల 14వ తేదిన భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూలలతో అలంకరణ చేసి నగలు అలంకరించామన్నారు.18వ తేదీ మంగళవారం డ్యూటీలో ఉన్న అర్చకుల ద్వారా అమ్మవారి మంగళసూత్రాలు, నాన్తాడు కనిపించడం లేదని తెలుసుకుని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. విచారణకు హాజరు కావాలని సమాచారం అందిన వెంటనే స్టేషన్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అలంకరించిన పూలు తొలగించే క్రమంలో పూలమాలల్లో ఆ ఆభరణాలు పోయి ఉండవచ్చని భావిస్తున్నామని వివరించారు.40 ఏళ్ళుగా ఆలయంలో అర్చకత్వం చేస్తున్నామని, ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని అభిప్రాయపడ్డారు. నేరం చేసిన వారికి ఎటువంటి శిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదని, మేము అర్చకత్వం చేసుకునేటపుడు ఆలయంలో అమ్మ వారి ఆభరణాలు మాయం కావడంపై భక్తులకు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పొత్తూరి సాంబశివరావు తెలిపారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకుడు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చదలవాడ జాలయ్య, ఉప ప్రధాన అర్చకులు, ఎక్స్అఫీషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. -
మంగళసూత్రం మాయంపై కేసు లేదా? బాబు సర్కార్ పై అంబటి ఫైర్
-
శివ శివా...
పెదకాకాని మల్లేశ్వరస్వామికి రావాల్సిన బకాయిలెన్నో? వ్యాపారులు చెల్లించాల్సింది రూ.1,19,18,444 నోటీసులకూ స్పందన లేదు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆలయ అధికారులు ప్రసిద్ధిగాంచిన పెదకాకాని శివాలయానికి బాకీదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఆలయంలో నిర్వహించే వివిధ షాపులను, హక్కులను టెండర్ల ద్వారా చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు అద్దె సరిగ్గా చెల్లించటం లేదు. దీంతో బకాయిలు రోజురోజుకూ పెరిగి రూ.కోటి దాటాయి. పెదకాకాని : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, పూలు, కట్టెలు, కూల్‌డ్రింక్స్, చెప్పుల స్టాండ్, గ్యాస్ పొయ్యి అద్దెకు ఇవ్వడం వంటి వాటిపై బహిరంగ వేలం పాటలు జరుగుతుంటాయి. హెచ్చుపాట పాడిన వ్యక్తికి ఆ వ్యాపారం అప్పగిస్తుంటారు. ఇందుకు వారు దేవస్థానానికి నెలనెలా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.కానీ, కొందరు వ్యాపారులు అద్దెను సరిగ్గా చెల్లించట్లేదు. కొంతకాలంగా వ్యాపారుల మధ్య పోటీ పెరగడం, ఎక్కువ పాటలు పాడి షాపులను దక్కించుకోవడం, దేవస్థానం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి బాకీలు ఉన్న వారికి గానీ, వారి కుటుంబీకులకు గానీ తరువాత జరిగే వేలంపాటలో పాల్గొనే హక్కులేదు. ఇక్కడ ఆ నిబంధన సరిగ్గా అమలు జరగట్లేదు. మొద్దు బకాయిలెన్నో.. దేవస్థాన వ్యాపారులైన బొమ్మిశెట్టి గరటాదేవి రూ.40,11,968, వి.రాజారామ్మోహన్రాయ్ రూ.27,90,000, బోడా ప్రసన్న రూ.20,17,200, ఆలా ప్రసాద్‌రావు రూ.5,30,076, యడ్లపల్లి రమేష్ రూ.91,200, సీతంశెట్టి అరుణ రూ.24,48,000 చెల్లించాల్సి ఉంది. ఆలయానికి బాకీ చెల్లించాల్సిన వ్యాపారస్తులకు ముందుగా ఆలయం తరఫున, ఆ తరువాత లాయర్ నోటీసులు అందజేశారు. 2015వ సంవత్సరం, అంతకుముందు కోర్టు ద్వారా ఆలయానికి బాకీలు చెల్లించాలని కోరారు. బాకీదారుల పేర్లు ఆలయ ప్రాంగణంలో బోర్డుపై ఏర్పాటుచేశారు. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు ఒక కాంట్రాక్టర్ ఉండగానే సదరు షాపునకు మూడు నెలల ముందే పాట నిర్వహిస్తారు. ఈ పాటలో షాపు దక్కనివారు (అప్పటికే కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి) ఆ తరువాత మూడు నెలల కాలానికి అద్దె చెల్లించకపోవడం వల్ల ఈ బాకీలు భారీగా పెరిగిపోతున్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం ఆలయానికి వ్యాపారస్తులు బాకీలు ఉన్న మాట నిజమే. ముందుగా ఆలయ నోటీసులు జారీ చేశాం. ఆ తరువాత లాయర్ నుంచి డబ్బు చెల్లించాలని నోటీసులు ఇప్పించాం. వ్యాపారస్తుల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బు వసూలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. నోటీసు బోర్డులు రాసిన తరువాత ఇద్దరు చెల్లించారు. కోర్టు ద్వారా మిగిలిన వారి వద్ద కూడా వసూలు చేస్తాం. - దార్ల సుబ్బారావు, ఆలయ సహాయ కమిషనర్, పెదకాకాని శివాలయం


