patny center
-
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం
సనత్‌నగర్ (హైదరాబాద్): సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీఐ బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ భవనం నాలుగో అంతస్తులో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొన్నిసార్లు ఆదివారం కూడా కొందరు సిబ్బంది కార్యాలయానికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఇద్దరు ఉద్యోగులు నాలుగో అంతస్తులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు అగ్ని ప్రమాదం జరగక మునుపే బయటకు వెళ్లిపోగా, మరొకరు అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకు వచ్చేసినట్లు సమాచారం.ఎగసిన మంటలతో భయాందోళనప్యాట్నీ సెంటర్ ప్రధాన రహదారిలో నగరానికి సంబంధించి ఎస్బీఐ అడ్మి నిస్ట్రేషన్ కార్యకలాపాలు ఇక్కడి నాలుగు అంతస్తుల భవనంలో కొనసాగు తాయి. నాలుగో అంతస్తులో లోన్ల విభాగం ఉంది. ఆ విభాగంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికులతో అటు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లో అగ్నికీలలు అంతస్తు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో.. మల్కాజిగిరి, మౌలాలి ప్రాంతాల నుంచి మరో రెండు అగ్నిమాపక శకటాలను రప్పించారు. కాగా, ప్రమాదం జరిగింది నాలుగో అంతస్తులో కావడంతో.. భారీ క్రేన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో కీలక ఫైళ్లు, పెద్ద ఎత్తున ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండే ఈ కార్యాలయంలో.. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ప్రాణనష్టమే తప్పింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమై ఉండవచ్చని సికింద్రాబాద్ ఫైర్ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. -
హరిహరకళాభవన్ మూగబోయింది!
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని హరిహరకళా భవన్.. జంట నగరాల ప్రజలకే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకూ సుపరిచితమే.. 1989 సంవత్సరం నుంచీ అద్భుత కళా ప్రదర్శనలతో ఎప్పుడూ కళ కళలాడుతూ ఉండేది.. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులతో ఆ ప్రాంతం సందడిగా ఉండేది.. కేవలం కళలు, కళాకారులకే కాకుండా సభలు, సమావేశాలకూ వేదికయ్యేది.. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో జిగేల్మంటూ మెరిసిపోయేది. ప్రదర్శనలు ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చేవారు. ఉన్నట్టుండి కోవిడ్–19 కారణంగా హరిహరకళాభవన్ మూగబోయింది. 16 నెలలుగా భవన్ తలుపులు తెరుచుకోవడం లేదు. – రాంగోపాల్‌పేట్ కోవిడ్–19 కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నట్లే కళా రంగం కూడా తీవ్రంగా కష్టాల్లోకి కూరుకుపోయింది. నిత్యం ప్రదర్శనలతో సాగిపోతున్న హరిహరకళా భవన్‌కు తాళం పడింది. 1989 సంవత్సరం నుంచి ఎన్నో వేల కార్యక్రమాలకు వేధికైన హరిహరకళాభవన్ కోవిడ్–19 కారణంగా గతేడాది మూతపడింది. నగరంలోని రవీంద్రభారతి తర్వాత అతిపెద్ద ఆడిటోరియం ప్రస్తుతం కళా ప్రదర్శనలు లేక కళా విహీనంగా తయారైంది. నిత్యం అతిథులు, ప్రముఖుల రాకపోకలు, ప్రేక్షకులతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ భవన్ నిశ్శబ్దంగా మారి బోసిపోయింది. 16 నెలలుగా తెరుచుకోని తలుపులు 2020లో మొదటి దశ కరోనాతో మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో హరిహర కళాభవన్ కూడా మూత పడింది. తర్వాత షాపులు, మాల్స్, ఫంక్షన్ హాల్స్ అన్ని తెరుచుకున్నా కళాభవన్ మాత్రం తెరుచుకోలేదు. రెండవ దశ కరోనా వచ్చి లాక్డౌన్ ఎత్తేసినా ఆ అదృష్టం కళా భవన్‌కు దక్కడం లేదు. భవన్లో నెలకు సగటున 20 రోజులు కార్యక్రమాలు నడుస్తుండటంతో వాటి నుంచి జీహెచ్ఎంసీకి ఆదాయం చేకూరేది. నామమాత్రపు అద్దెకు.. ఇంత పెద్ద ఆడిటోరియం నామమాత్రపు అద్దెకు అందిస్తుండటంతో చాలామంది ఇక్కడ కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తుండేవారు. 16 నెలల నుంచి మూత పడిఉండటంతో ఆదాయానికి గండి పడింది. భవన్ నిర్వహణకు ఇక్కడ 16 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి జీతాలు విద్యుత్, నీటి బిల్లులు మాత్రం జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ఒక్క రూపాయి ఆదాయం లేకున్నా విద్యుత్, తాగునీటితో పాటు నిర్వహణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 1400 సీట్ల కెపాసిటీతో.. 1989 సంవత్సరం సెప్టెంబర్ 24న అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ, గవర్నర్ కుముద్‌బెన్ జోషి, నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతులమీదుగా దీన్ని ప్రారంభించారు. నగరంలోనే అతిపెద్ద ఆడిటోరియంగా 1400 సీట్ల కెపాసిటీతో ఎయిర్ కూలర్, పార్కింగ్ సదుపాయంతో దీన్ని నిర్మించారు. ఎదురుచూస్తున్నాం ప్రియ కల్చరల్ ద్వారా హరిహర కళాభవన్‌లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. మ్యాజిక్ షో, నృత్య ప్రదర్శనలు అందించాం. దక్షిణ భారత దేశంలోని అనేక నగరాల్లో ప్రదర్శనలు చేస్తున్నా తక్కువ అద్దెతో ఇంత పెద్ద ఆడిటోరియం ఎక్కడా కనిపించ లేదు. హరిహరకళాభవన్ తెరిస్తే మేము ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధం. – కార్తీక్, ప్రియ కల్చరల్ కార్యదర్శి ఏడాదిన్నరగా.. సికింద్రాబాద్ వాసులకు ఉండే మంచి ఆడిటోరియం. తరచూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగుతుండేవి. ఎంతో మంది ప్రేక్షకులకు ఇవి ఆహ్లాదకరంగా ఉండేవి. కానీ ఏడాదిన్నరగా అందుబాటులో లేదు. – సూర్యప్రకాశ్‌రెడ్డి -
ప్యాట్నీ సెంటర్లో అర్ధరాత్రి కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ప్యాట్నీ సిగ్నల్ వద్ద ఓ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు ఆటో తిరగబడి పడిపోవడంతో అందులో ఉన్నవారు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. వెంటనే వారిని స్థానికులు పలు ఆస్పత్రులకు తరలించారు. అంతా జరిగిన కారు అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అతి వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి. -
ఐదు కార్లను ఢీకొట్టిన లారీ
-
ప్యాట్నీ వద్ద తగలబడిన ఆర్టీసీ బస్సు
-
ప్యాట్నీ వద్ద తగలబడిన ఆర్టీసీ బస్సు
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద గురువారం ఉదయం జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ప్రయాణీకులు భయంతో బస్సులో నుంచి బయటకు దూకి పరుగులు తీశారు. బస్సు సిబ్బంది వెంటనే ప్యారడైజ్‌లోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనతో ప్యాట్నీ-ప్యారడైజ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.